Wednesday, April 6, 2016
Sunday, April 3, 2016
Wednesday, November 12, 2014
చిన్ని చెంచు గేయం
చిన్ని చెంచు గేయం
ఎచటనే! ఎచటనే!
ఎచటనే నా చిన్ని చెంచు
ఎందు దాగున్నావో
ఎరిగింపవా సుంత .....
మునిమాపు నీరెండ
ముసుగుతాల్చిన సంధ్య
కెదురెదురు పరువెత్తి
వేదికినానే నిన్ను .....
వనమెల్లా కన్నుగా
మనసెల్ల నిన్నుగా
సిరికన్న మిన్నగా
వెతికినానే నిన్ను ....
నా చిన్ని చెంచు ....
జతగోరి ఒంటిని
నిలిచినానే చెంచు
చెంచు పల్లియ దరికి
చేర వచ్చిన వేళ
ఒరులు చూడక నన్ను
కురుల గప్పిన ప్రేమ
కరువాయె నా నేడు !
పోక మ్రానులనీడ
టేకు ఆకుల లోన
వెదురు పరమాన్నము
వడ్డించి తినిపించు
వలపు లేమాయెనే!
సెలయేటి దరిచేరి
కనుసన్నలను గీటి
కలువ దొప్పల లోన
ఇప్ప పూవులా తేనె
దాహమిచ్చిన నాటి
దయనేల మరచితే!
చెంచీత నవ్వులో
మంచి ముత్తెపు వాన
కురిసి వెలిసిన నాడు
సరిరావు వెన్నెలలు
సరిరావు సరిరావు
సురలోక భోగాలు
ఎచటనే! ఎచటనే!
ఎచటనే నా చిన్ని చెంచు
ఎందు దాగున్నావో
ఎరిగింపవా సుంత .....
మునిమాపు నీరెండ
ముసుగుతాల్చిన సంధ్య
కెదురెదురు పరువెత్తి
వేదికినానే నిన్ను .....
వనమెల్లా కన్నుగా
మనసెల్ల నిన్నుగా
సిరికన్న మిన్నగా
వెతికినానే నిన్ను ....
నా చిన్ని చెంచు ....
జతగోరి ఒంటిని
నిలిచినానే చెంచు
చెంచు పల్లియ దరికి
చేర వచ్చిన వేళ
ఒరులు చూడక నన్ను
కురుల గప్పిన ప్రేమ
కరువాయె నా నేడు !
పోక మ్రానులనీడ
టేకు ఆకుల లోన
వెదురు పరమాన్నము
వడ్డించి తినిపించు
వలపు లేమాయెనే!
సెలయేటి దరిచేరి
కనుసన్నలను గీటి
కలువ దొప్పల లోన
ఇప్ప పూవులా తేనె
దాహమిచ్చిన నాటి
దయనేల మరచితే!
చెంచీత నవ్వులో
మంచి ముత్తెపు వాన
కురిసి వెలిసిన నాడు
సరిరావు వెన్నెలలు
సరిరావు సరిరావు
సురలోక భోగాలు
Monday, November 10, 2014
దోసెడు మల్లె మొగ్గలు
దోసెడు మల్లె మొగ్గలు
రావూరు రచన ఈ క్రింది లింక్ లో చదవండి .
http://tatavarty.com/gprasuna/ Story_Dosedu%20Mallemoggalu. pdf
రావూరు రచన ఈ క్రింది లింక్ లో చదవండి .
http://tatavarty.com/gprasuna/
Sunday, November 9, 2014
వడగళ్ళు
వడగళ్ళు రచన -రావూరు
ఆమధ్య ఎక్కడో చదివాను ఒక జంట మొదటి రాత్రే తగవు లాడుకొని విడాకు లిచ్చుకొన్నారని. "ఆదిలో ఆనందం పోయిన కొద్దీ పోరు-అంతానికి అంతులేని వైరం. "అనే సామెత వుంది మనకి. పైన చెప్పిన జంట ఈసామెతను కూడా రూపు మాపి వేసారు.
నిజానికి ఆదిలో ఆనందం అనేది అనుభవించ వలసిన సుఖం. కొత్తలో దంపతులేమిటి,స్నేహితులేమిటి,పాలు పోసేవాళ్ళేమిటి,పని చేసేవాళ్ళెమిటి ,పక్క భాగం లో వాళ్ళేమిటీ -"ఏదో అదృష్టం వల్ల ఇలా దగ్గర అయినాం"- అన్నంతగా వ్యవహరిస్తారు. అసలా పలక రింపులేవేరు ఆప్యాయతలే వేరు .........ఇన్నాళ్ళూ ఎక్కడున్నామో?...వీరిప్పుడు కనిపించారు.ముందే కనిపిస్తే ఎంత హాయిగా గడి చేదో? అన్నంతగా ప్రవర్తిస్తారు.
సిగ్గులు,నిగ్గులు,మొగ్గులు-పొడి దగ్గులు
కొత్తగా కాపురానికి వచ్చినప్పుడు పడుచు కత్తెలు ఎంతో నమ్రతగా వుంటారు.భర్తతో మాట్లాడడానికే సిగ్గు పడతారు.తమలో ఏవో అంతులేని నిగ్గులున్నయని చెప్పడానికిబదులు చేష్టల్లోకి దిగుతారు. ప్రతి విషయం లో మొగ్గు చూపడానికి ప్రయత్నిస్తారు. పలకరించడానికి భయమన్నట్లుపొడి దగ్గులతో భర్త దృష్టిని ఆకర్షించుకొంటారు.క్రమ క్రమంగా మారిపోతుందా స్వరూపం .జారిపోతుందా స్వభావం. కొత్తరూపం ధరిస్తారు.ఆమె సిగ్గు పడటం మానేస్తుంది. ఆమెను చేసుకొన్నందుకు భర్త సిగ్గు పడే పరిస్థితి కల్పిస్తుంది. ఆదిలో పొందిన ఆనందానికి బదులు అంతులేని చింతలోపదతాడు భర్త అనిపించుకొన్న అదృష్ట హీనుడు.
ఏ ఆఫీసుకో బయలుదేరి భర్త వీధిలోకి వచ్చిన తర్వాత భార్యకు ఏదో జ్ఞాపకం వచ్చి " ఏమండోయ్ !మిమ్మల్నే! ఏమిటి గొర్రెలాగా తలవంచుకుపోతారు వూరివెంట మీరు ---- ఊడలు దిగిన మర్రిచెట్టులా ఇంట్లో నేనూనా? పంచదార అయిపోయింది, చేతిసంచీ పట్టుకెళ్ళండి,మధ్యాన్నానికేలేదు......వంటిగంట కల్లా పంపాలి. "అని సంచీ ఆయనకో అర్ధ గజం దూరంలో పడేట్టూ గిరాటు వేయడం జరుగుతుంది. వీధి భాగవతం కూడా దేనికని ఆయనగారా సంచీపుచ్చుకొని ,అలాటి ఇల్లాల్ని బహూకరించినందుకు భగవంతుణ్ణి మెచ్చుకొని ఆయన గారు వెళ్ళి పోతారు. సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత "దీనికి సానతం బుధ్ధి చెప్పాలి" అని మాత్రం మనసులో సణుగుతూ వెడతాడు.
కాపరానికి వచ్చింది నెల క్రింద- కసిరి కొట్టేది రోడ్డు మీద
"కాపురానికి వచ్చి నెలా పదిహేను రోజులు కాలేదు అప్పుడే కసిరి కొడుతోంది మొగుణ్ణీ ,అందులో నడి రోడ్డూ మీద" అని పక్క ఇళ్ళవాళ్ళు చెప్పుకోవడం జరుగుతుంది. కలిసి మెలిసి కాలం గడిపిన కొద్దీ మనస్సులు అర్ధం చేసుకోవడం, మమతలు వడపోసుకోవడం -అనుభవాలను గుండెల్లో రంగరించుకోవడం -ఆదర్శ జీవితంలో అడుగు పెత్తడం "జరుగుతుందంటారు పెద్దలు.ఆ సిధ్ధాంతాలు చాలావరకు తారుమారైనాయి....మగవాళ్ళు మాత్రం మారరూ !
"సాయంత్రం ఇంటికి వచ్చినప్పటి నుంచీ సమరం ప్రారంభం ....బయట తిరిగినంత సేపు చిరునవ్వులు గుమ్మరిస్తారు...ముంగిట్లో అడుగు పెట్టేసరికి ముఖం ముడతలు పడుతుంది....అసలదోరకం ఫోజు వస్తుంది.రోజూ చేసే సంసారమే గనక అలవాటు అయిపోయింది ంకానీ -కొత్తగా చూస్తే కోపంలో ఆ రూపం ఘోరమనుకోండి ......ఇంతా చేస్తే నే చేసిన నేరమేమిటో అర్ధం కాదు.!అని కొందరు ఇల్లాళ్ళు గొడవ పడుతూ వుంటారు.
ఒకాయన ఫించను పుచ్చునుకొని ఇంట్లోనే కుంటు కొంటూ తిరుగుతుతున్నాడు.ఓపిక తగ్గింది.వూపిరి హెచ్చింది.పది గంటల వేళ పంట్లాం వేసుకొని ఎక్కడో అక్కడ కొంత సేపు తిరిగిరాందే ప్రాణం వూరుకోదు.ఫలానా పని అనిగానీ చోటు అని కూడా విండదు కనుక -- ఎప్పుడు వచ్చేదీ ఆయనకు తెలియదు.ఒక్కొక్క రోజు రెండింటికి వచ్చి తిండి తినడం జరిగేది.
అత్తిసరు నేవేస్తా!పచ్చడి నువ్వు నూరుకో!
" ఆయన భార్యను బ్రతిమాలాడూ,కాస్త పది దంటలకే అన్నం పెట్టు-నీకు పుణ్యం వుంటుంది. ఆకలితొ తిరగ లేకుండా వున్నాను."అని ఆవిడ వెంటనే జవాబు చెప్పింది - ఇప్పటికి నలభై ఏళ్ళనుంచి ,తెల్లరి లేచినప్పటినుంచీ పొయ్యి దగ్గర పొగలో పడి చాకిరీ చేసి పదింటికల్లా వడ్డించాను.ఇక నా వల్ల కాదు.వూరికేవున్న మనిషి వూరంతా తిరగడమెందుకు? నన్ను ఉరుకులూ పరుగులూ తియ్యమనడమెందుకు ?నావల్లకాదు మహాప్రభో!.....వంటి గంటకు వండి పెడితే గొప్ప.అంది
ఓపిక విండటం లేదే!ఏదో పచ్చడి మెతుకులన్నా పెట్టవే! ఫినను దారుడికి అంతకన్నా ఎక్కువేమి పెడతావు?"అని ఆయన అభ్యర్ధన.
' మీకు ఓపిక తగ్గితే నాకు మాత్రం తగ్గదా?నేనేమి పాషాణాన్నా!పచ్చడి మెతుకులు పెట్టడం మాత్రం తేలికేమిటి? పోనీ అత్తెసరు నేను పడేస్తాను....ఆ పచ్చడేదో మీరే నూరుకోండి. ...తినండి."అని ఆవిడగారి సలహా...
ఒకప్పుడు ఆవిడ సిగ్గులు ఒలక బోసి వుంటుంది.నిగ్గులు చూపించి వుంటుంది.ఆయన చూచిన ప్రతి చూపుకి మొగ్గి వుంటుంది. కాలం గదిచిన కొద్దీ అలా మారింది...ఈ తగవులో తప్పెవరిదో,ఒప్పెవరిదో -తీర్పు చెప్పడం కష్టం .నేర్పుతో నిభాయించుకు రావడమొక్కటే మార్గం.
వాడితో కాపురం కన్నా వల్లకాటికి చేరడం మంచిది
మా వూళ్ళో ఒక రైతు కుమార్తె వుండేది. ఆ అమ్మాయిని కోరికోరి వూళ్ళోనే వున్న మేనమామ కిచ్చి వివాహం చేసారు.ఆ అల్లుడు చాలా సమర్ధుడు.మాటకారి మంచి నేర్పరి. అయితేనేం పెళ్ళయిన ఆరు నెలల తరువాత ఆ అమ్మాయి అతడంటే ఇష్తం లేదని చెప్పి వచ్చి పుట్టింట్లో కూర్చోవడం ప్రారంభించింది.
ఎవరైనా సలహా చెప్ప డానికి వెడితే -మీరు చెప్పడం అనవసరం -వాడితో కాపురం కంటే వల్లకాటికి చేరడం సుఖం .......అవస్థలు పడేదానికి నాకు తెలుసా? మీకు తెలుసా వాడి సంగతి? అని ప్రశ్నించేది.వచ్చిన వాళ్ళు ఏమి చెప్పాలో తెలియక వెళ్ళీ పోయే వారు.
వూరి మధ్యలో గల గుడి దగ్గర నిలబడి" స్వామీ! వాణ్ణి తెచ్చి కట్టిన వాడివి నువ్వు కనుక నీకు చెపుతున్నా,వాడితో నే కాపురం చెయ్యలేను.....ఎందుకింత ఘట్టిగా చెపుతున్నానో నువ్వు గ్రహించు.....కావాలంటే వాణ్ణి పిలిచి నువ్వు అడుగు "అని ఏమేమో చెపుతూ వుండేది. ఏదో చెప్పరాని బాధలు పడుతోందని కొంద్రూ,మతి చెడిందని కొందరు నిర్ణయించుకొని వూరుకొన్నారు.
విచిత్ర మేమిటంటే....ఆరుగురు బిడ్డల తల్లి అయేదాకా ఆవిడైలా వాడితో కాపురం చెయ్యనని చెపుతూనే వుండేది. దానికి తగ్గట్టు ఎక్కువగా పుట్టింటి వద్దే కాలక్షేపం చేస్తూ వుండేది. దాంపత్యాలలో "వైరానికి" సంబంధించిన ఒక విచిత్ర ఊదంత మిది.
అది మేం బతికి వున్నప్పటి ఫొటో
ఒక రింటికి వెడితే గోడమీద వున్న దంపతుల ఫొటో చూపించిందా ఇల్లాలు.ఎంతో అందం గా వున్నారని సంతోషించా. వెంఠనే ఆవిడ అన్నది "అది మేం బతికి వున్నప్పటి ఫొటో అని. మరి ఆదాంపత్యమెలా మారిపోయిందో,ఆమె ఎలాటి స్థితి లో కాపురం చేస్తొందో తెలుస్తుందామె మాటవల్ల .
28-8-76

Friday, May 9, 2014
Friday, November 22, 2013
డా సి. నారాయణ రెడ్డి మానవత నారాధించే మధుర విపంచి
మానవత నారాధించే మధుర విపంచి
డా సి. నారాయణ రెడ్డి
{భాషా కుటీరం లో రావూరు డా సి నారాయణ రెడ్డిగారికి సన్మానం చేసి అభినందన సంచిక ప్రచురించింది అందులో రావూరు రచన .}
కాల పరిణామం లో సంవత్సరానికో వసంతం . కవికి జీవిత మంతా వసంతమే!అతని హృదయ ము ఆరామం .... భావాలు పూల మొగ్గలు.శైలి పసిడి నిగ్గులు. ..... కావ్యాలు పొదరిళ్ళు -సందేశాలు పుప్పొళ్ళు.
సామాన్యం గా చెప్పుకోతగ్గ ఉపమానాలివి. కొందరు కవుల జీవితాలలో వసంతం ఒక పరువుగా వచ్చి మాయమవుతూ వుంటుంది . తిరిగి ఎప్పుడో చెప్పకుండా చివుళ్ళు పట్ట వచ్చు. ... వాటిలో ఒక మొగ్గ తొంగి చూడవచ్చుఽవి గతించిన వసంతానికి ఆనవాళ్ళుగా నిలుస్తాయి...... మనల్ని పిలిచి అలనాటి చరిత్రను జ్ఞాపకం చే సుకొమ్మంటాయి. కాని,కాలాన్ని స్వంతం గా మలచుకొని -జీవితమంతా వసంతంగా మార్చుకోగల వారు కొద్ది మందే వుంటారు.
ఆ ఆరామంలో ఎన్ని కొత్త మొక్కలు వెలుస్తాయో,ఎన్ని విరులు విరుస్తాయో ,ఎంత మధుర మైన తేనె జల్లులు కురుస్తాయో-అంచనా వేయడం కశ్తమ్. ;అలా వేయబూనడం ఆ కవితా హృదయాన్ని వంచన చేయడమే అవుతుంది .
ఆయన చేతిలో వంద కలాలు
అలాటి అంచనాలను మించిన కవులలో డా సి నారాయణ రెడ్డిగారొ కరు. చేతిలో వంద కలాలున్నట్లు ,తనలో అంతు లేని బలం వున్నట్లు ,ఆయన రచనలు సాగిస్తూ వుంటారు . కొత్తదనం చెడదు -మెత్తదనం పోదు. .. వయసు అడ్డు రాదు-మనసు పస తప్పిపోదు ఆ ధునికాన్ధ్ర కవితా ప్రపంచంలో ఆయన ఒక స్థానం ఏర్పరుచుకొన్నారు. దానికి సుస్థి రత కల్పించుకొన్నారు.
అటు సాహితీ రంగంలో ,ఇటు ఫిలిం ప్రపంచంలో ఆయన కవితలు పరుగులు తీస్తూనే వున్నాయి,సరస్వతి పాదాలకు గంధం పూస్తూనే వున్నాయి. .ఒక ప్ర క్క సన్మానాలు,ఒకప్రక్క సత్కారాలు
ఒక ప్రక్క బహుమానాలు,ఒకప్రక్క కీర్తి తోరణాలు . ఆయన సవ్య సాచి అనిపించుకొన్నారు. భవ్య మనస్కుడని అనిపించుకొన్నారు.
ఫిలిం రంగం లో ఆయన గేయరచయితగా "రికార్డు"నెలకొల్పు కొన్నారు". రెడ్డిగారి పాట లేందే ఫిలిం బయటికి రాదు-అసలు సెన్సారు ఆమోదించదు " అని హాస్యంగా అనుకోవడం కూడా కద్దు.రెడ్డి గారు వ్రాసినాన్ని ఫిలిం గేయాలు ఏభాషలో ఎవరు వ్రాసి వుండరు . అవి వెయ్యి ఏనాడో దాటి రెండో వెయ్యి నండుకోవడం కోసం ఉయ్యాలలూగుతూ ముందుకు ఉరుకు తున్నాయి.
విమానానిదే ఆలస్యం
"గులేబ కావళి " చిత్రం ద్వారా రెడ్డిగారు ఫిలిం పరిశ్రమకు పరిచయం అయారు. "నన్ను దోచుకొందు వటే " అన్న పాట వ్రాసిన వేళా విశేషం -అప్పటి నుంచీ ఇప్పటి వరకు ఆయన కలం నిర్ఝరి లాగా పరుగెత్తుతూనే వుంది -వయ్యారాలు ఒలక బోస్తూనే వుంది . రెడ్డిగారివలె గేయ రచన చేయగల వారుండ వచ్చు కాని ఆయన కలం కల్పించిన వ్యామోహం ,మరొకరు కల్పించలెకపొయారు.హైదరాబాదులో నివాసం.మ దరా
సు లో కవితా విన్యాసం .విమానానిదే ఆలస్యంగానీ, కలానిది మాత్రం కాదు.
ఇన్ని పాటలు వ్రాసినా -కొద్ది ప్రొడ్యుసర్ల బులపాటానికి వదిలితే -అన్నిటిలో భావ గాంభీర్యం ,భాషా సౌందర్యం,తొణికిస లాడుతోనే వుంటాయి . భావనా,చిత్రణా లేని గేయం ,సంపాదనా ,సౌజన్యం లేని భర్త వలె పేలవం కాక తప్పదు. రెడ్డి గారు ప్రతి పాటలో తమ సహజ ప్రతిభను వెలారుస్తూ వుంటారు. ..... పన్నీటి దీపాలు వెలిగిస్తూనే వుంటారు .
మల్లియలారా-మాలికలారా
మౌనముగా నున్నారా......
మా కథ విన్నారా ?
-వంటి అతి మధుర మైన గేయాలు వందల కొలది వున్నాయి.
"పోలేవునీవు
రాలేను నేను
నీదారిలోనే నే
నిలిచినాను -
-వంటి భావ పూరిత మైన పాటలు ఎన్నో వున్నాయి. ఇలాటి వన్నీ ఏరితే ఏటి వొడ్డు కోయిల గుంపులు ఒక్కసారిగా గొంతెత్తి కుహుకుహు ధ్వానాలు చేసినట్లుంటుంది . ఇలాంటివెన్నో......
ఒక్క "ఏకవీర"చిత్రానికి మాత్రంసంభాషణ
లు వ్రాసారు . "సంభాషణలు వ్రాయాలనే కోరిక నాకు లేదు..... అదొక ప్రత్యేక కృ షి -తీరిక వుండాలి." అన్నారాయన ఒకసారి .పాటలు వ్రాసి కెంపులు,పచ్చలు
విసిరినట్లు విసిరి రావడం ఆయన అలవర్చుకొన్న విద్య.
గ్రంధ రచనలో రెడ్డిగారు సిద్ధ హస్తులు .ఇప్పటికీ ఇరవై పైగా గ్రంధాలు వెలువడినాయి .ఆన్నిటిలోఏదో ప్రత్యేకత .... ఏదో ఉద్విగ్నత ..... ఉజ్వలత
వచన కవితలో కొత్త పరవళ్ళు దిద్దింది వారి కలం .ఆపరవళ్ళలొ పాఠక లోకం మునిగి ముచ్చటలు పడుతూ వుంటుంది. రేడియో నాటికలకు జీవం పోసిన వారిలో వీరొకరు .
గేయ ప్రపంచానికి రత్న కిరీటం
హిందీ,అరవం ,మరాఠీ ,వంగ భాషలలో కూడా ఏకవీ ఫిలింలకు ఇన్ని గేయాలు వ్రాసి వుండరు. అలాగే ఘంటసాల వారివలె ఏనేపథ్య గాయకుడు అన్ని పాటలు పాడి వుండడు . ఆ విధంగా ఒకరు ఫిలిం గేయ ప్రపంచానికి,మరొకరు సంగీత ప్రపంచానికి రత్న కిరీటాలు
గా అవతరించారు . ఇద్దరికీ జోహార్లు చెప్పక తప్పదు.
సామాన్యంగా సరస్వతి చోటు చేసుకొన్న వీటిలో లక్ష్మి ప్రవేశించ దు . కవి ఎంత భోగలాలసుడో అంత చింతా క్రాంతుడుగా వుండాలని ఆమె సంకల్ప మెమో!నారయణ రెడ్డి గారి విషయంలో ఇద్దరు సఖ్యత పడ్డారు . ఆయన ఇంట చెమ్మ చెక్క లాడుతూ వుంటారు. అందుకనే ఆయన్ని "ఆంద్ర రవీంద్రుడు "అనాలనిపిస్తుంది .
వేములవాడ ప్రాంతం లోని హనుమాజీ పేటలో సింగిరెడ్డి వారింట జన్మించిన ఒక లేత మనసు,భీమేశ్వరాలయ ప్రాంగణం లో వలయాలుగా తిరిగే గానాలలో నుంచి సరిగమలు సంతరించుకొని .వాటి మీద సాహిత్యపు రజను జల్లుకొని ,తెలుగుతల్లి మెడలో వెలలేని హారాలు వెయ్యాలని కళలు గని -నేటికి డా నారాయణ రెడ్డి గా మారాడు .
రెడ్డి రాజుల శౌర్యాన్ని ,ఆంధ్రుల వీరత్వాన్ని ,అమర కవుల భావనా పటిమను ,తెలుగు కవుల రచనా నైపుణ్యాన్ని ,ఆధునికుల ప్రగతి శీలతను పూల సజ్జలాంటి ఒజ్జల హృదయం ,సజ్జనులకు కానుకగా అమరే సౌజన్యం -ఆయన జీవితం లో ఇంద్ర ధనుస్సు లాగా ఒళ్ళు విరుచుకొన్నాయి-ఒంపులు దిద్దుకొన్నాయి.
ఎన్నో చెప్పడం కంటే ఒక చిన్న మాట చాలుఈయన్ని గురించి అ దే ఆయన జీవిత చరిత్ర లాంటి గ్రంధమవుతుంది . ఏమిటా ఒక్క మాట?....... "మానవత నారాధించే మధుర విపంచి -శ్రీనారాయణ రెడ్డి ".
***********************************

Wednesday, March 27, 2013
కనిపించడం లేదు నాటిక రచన రావూరు
కనిపించడం లేదు నాటిక రచన- రావూరు
ర- మా ఫ్రెండ్ రాధ వస్తూంది . పొద్దున్నే ఆవిడకేమి కనపడటం లేదో!రా ..రాదా ! రా.... రా ఏమిటివాళ
పొద్దున్నే వచ్చావ్ !
రాధ- రమా మీ ఇంట్లో స్పోర్ట్స్ వరల్డ్ పుస్తకం తెచ్చారా?
ర -తేవడం తెచ్చారు గానీ తర్వాత మళ్ళీ కంటికి కనకనబడ లెదు.
రా- అయ్యో! ఏమయింది మరి?
చం - మా ఇంట్లో దెయ్యాలూ భూతాలూ తిరుగుతున్నాయి రాధగారూ!మా ఇంట్లో ఎవస్తువూ కనబడటం లెదు.
రా- మీ వస్తువుల సంగతి నాకెందుకు గానీ స్పోర్ట్స్ వరల్డ్ కనిపిస్తే ఒమాటివ్వు
ర -క్రికెట్ మాచ్ విశేషాల కోసమేనా? నీకింకా ఈ పిచ్చి వదిలే దారి కనబటం లేదు రాధా!
[రాధ నవ్వి వెళ్లి పోతుంది . ]
ర- ఇన్ని కబుర్లు చెపుతున్ది.పుస్తకమ్ మటుకు కొని చదవదు. మన తెలుగు వాళ్ళల్లో పుస్తకాలు కొని చదివే వాళ్ళే కనబడటం లేదు. .
చం - ఓహో!సుందరమా!రా!రా!
సుం - మా నాన్న గాని ,మా అమ్మ గాని కనిపించారా మీకు?
చం - మీ నాన్న వచ్చి వెళ్ళా దిప్పుడే మీ అమ్మ కనిపించలా ! ఇక్కడ పెట్టిన అయిదు రూపాయల నోటు కనిపించడంలా !
సుం -నిన్నటి నుంచీ పంజాబ్ లో ముగ్గురు ఎమ్ ఎల్ ఏ లు కనిపించడం లేదట!మరో రాష్ట్రం లో మంత్రి వర్గ నిర్మాణానికి మార్గమే కనిపించడం లేదట!
చం - బాబూ !కనిపించడం లేదు గొడవలు చెప్పకు. ప్రాణం విసిగి పొతొన్ది. కనిపించేవేవైనా వుంటే చెప్పు. 5రూపాయలు కనిపించడం లా!సంసారం చేసే మార్గం కనిపించడంలా-
సుం - పొద్దుటి నుంచి ఓ మిత్రుదికోసం తిరిగా ఎక్కడా కనిపించడంలా, ఇంటికివస్తే అమ్మా,నాన్నా కనిపించలా!
చం - మరి ఎం కనిపించిందోయ్ నీకు?కనిపించిందోకటి చెప్పు?
సుం - [నవ్వుతూ] కనిపించినవి చెప్పమన్నారా!కోపంతో వున్నా మీరు, మీ వెనక నవ్వుతున్న మీ భార్య .
చం- ఇదేనా కనిపించింది నీకు.చాల్లె! ఇక్కడినుంచి బైటకు పద మున్దు. ఊ ....ఊ నడు అవతలకు .కనిపించదంలా ,కనిపించడంలా- ఒకటే కాకి గోల కనిపించేది ఒకటే మాయ=కలియుగ మాయ.
ర- ఆ!మీవన్నీ సొద్యాలు.
చం - నీ కన్నీ మంగళ వాద్యాలు.
కాక పొతే ఏమిటండీ!అగ్గిపెట్టె,సిగరెట్టూ పెట్టె కనిపించనంత మాత్రాన ఏమీ కనిపించలేదంటారేం !వాటి మాటవదిలి మీకు ఇంకేం కనిపించలేదో చెప్పండి,వెతికి తెస్తాను.
చం- కనిపించనివి చెప్పాలా!చెప్పనా? కోప్పడవు కదా? నీలో పతి భక్తీ- నాలో అనురక్తి.
ర- నా పాటి భక్తీ కెమండోయ్ .నెను మీతో చెప్పకుండా ఎప్పుడైనా గడప దా టానా ?
చం-గడప దాటలేదులే! ఇంట్లో వుండీ గడి దాటేవాళ్ళు లేరూ!
ర- ఆ గళ్ళ సంగతి నాకు తెలియదు . ఇళ్ళల్లో కూడా గళ్ళుంటాయా!
చం- ఉండవూ మరి,విచిత్ర దాంపత్యాలలో వింత ముళ్ళు చాలా వుంటాయి-
[బయటనుంచి,చంద్రం గారూ! అనిపిలుపు]
చం- కనక బ్రహ్మం గారా!రన్ది.... రండి,కోర్చోండి.
కన - ఎంత విచిత్రం గా వుందయ్యా!ప్రపంచం?
చం- మీకూ అలాగే వుందీ !ఏమిటో చెప్పండి కొంచెమ్.
కన -ఏం చెప్పను? అవతల ఆడ పిల్ల కూడావుంది
చం- ఫర్వాలేదు,చెప్పండి ,మీరనుకున్నంత గాభరా ఏమీ లేదు.
కన - ప్లీడర్ కోటేశ్వర రావుగారి అబ్బాయి ,ఆర్నెల్ల నుంచీ కనపడటం లేదట!బంధువులందరికీ ఉత్తరాలు వ్రాసారుట ! పత్రికలలో ఫోటోలు కూడా వేశారుట !
ర- ఎన్నేళ్ళవాడు?
కన -కనిపించకుండా వెళ్ళె ఈడే కానీ.......
చం- ఏమిటి కానీ అంటున్నారు?
కన -వట్టి నత్తి సన్యాసి.ఎవర్నెనా పలక రించడానికి పది నిముషాలు పడుతున్ది.. అలాటిది ఆడపిల్లని-
చం- అలాగా! అయినా పలక రించా డం దేనికి.పావు ఠా ఉ కాగితం తీసుకొని గుండెలు చీల్చుకొంటూ నాలుగు ముక్కలు వ్రాస్తేవెతుక్కొంటూ వచ్చే వాళ్ళున్నారు. వాడికి నత్తి అయితేనేం -మొత్తం ఆస్తికి వాడిగా వారసుడు.
ర- ఇంకేమండీ !అన్నం నీళ్ళకు కరువుండదు,కొన్నన్ని చీరలు కోన వచ్చు.
చం- పిల్లాడు కనపడ లేదని ఆయన అంటుంటే వాళ్ళ సంసార స్వరూప మంతా వర్ణిస్తావేమిటేనువ్వు?
ర-ఆ! కనపడక ఎక్కడికి వెడతాడు? ఏకన్నె పిల్లనో వెతుక్కొంటూ వుంటాడు.
కాన- ఏం వెతుక్కొడమో!ఏమిటో!అనుకూల దాంపత్యాలు ఎక్కడా కనపడటం లేదమ్మా!
చం- ఎక్జాం పుల్ కావాలంటే మా అడ్రెస్ ఇవ్వండి.
కాన- ఇంకో విచిత్రం ఏమిటంటే ఈతడు వెళ్ళిన రోజు కాకుండా ఆ కిందటి రోజునుంచి వాళ్ళింట్లో అయిదు వందల రూపాయలు కనిపించడం లేదట.
చం- అలాగా!కనిపిస్తే అబ్బాయి కనిపించ వచ్చు గానీ అయిదువందల రూపాయలు కనిపించడం అబధ్ధమ్. ఇందాక ఇక్కడ పెట్టిన అయిదు రూపాయలు కనిపించడం లేదు. మా ఇద్దరి కళ్ళూ కలిసి నాలుగు కళ్ళు . అందులో కొంచెం పెద్దా- చిన్నా వున్నయనుకోండి. మా ఆవిడవి విశాల నేత్రాలు మరి.
కన - ఇవన్నీ కనపడక పోయినా ఫర్వాలేదు.ఎవ్వరికీ ఏదారీ కనిపించని రొజులివి. మా పెద్దాడికిన్త వరకు ఉద్యోగం గీత కనిపించలా!మా చిన్నాడికి పదో క్లాసు పాసయ్యే మార్గం కనిపించడమ్లా! మా మరదలికి మగ సంతాన భాగ్యం ఇంతవరకు కనిపించలా-
ర- బాగున్ది మీ కింకే మి కనిపించలేదు?
కాన- ఏమి చెప్పను?నేను వ్రాసిన "కనిపించని దైవం'" అనే వ్యాసాలు వేసే పత్రిక కనిపించడం లేదుఇన్తవరకు. . అన్నీ చెదలు పట్టి పోతున్నాయ్ .
ర- అయ్యో పాపం!దైవానికి సంబంధించిన వ్యాసాలే అచ్చు పడటంలా?
చం- ఏమిటే! నీ ఆశ్చర్యం?ఈమధ్య దేవాలయాల్లో దేముళ్ళే కనపడటం లా-కొందరు దేముళ్ళ మేడల్లో నగలు కనిపించడమ్లా.
కన -అసలు ప్రపంచం సరిగా నడిచే మార్గం కనిపించడంలా-
ర- కలికాలం కదండీ!అన్నట్లు మొన్న ఒక ఆవిడకి పున్నమి నాడు వెన్నెలే కనిపించలేదట!ఆకాశం మీద బండి చక్రం లా వున్నా చంద్రు డే కనిపించాలేదుట!
కన -ఇది మరీ ఆశ్చర్యం గా వుండే!సరేమరి,ఇహ నే వెళ్ళోస్తా.
[లేచి బయటకు వెళ్లి పొతాదు.]
చం - అమ్మయ్య వదిలాడు-ఆ చిల్లర డబ్బులుంటే చూడు,వెళ్లి సిగరెట్లు తెచ్చుకొన్తా.
ర- ఇప్పుడెక్కడ కనపదతాయండేఏ-అప్పు తెచ్చుకోక-
[చంద్రం గారు చంద్రం గారు -అనిపిలుస్తూనే బయట నుంచి కనక బ్రహ్మం లోపలకు వస్తాడు]
చం - ఏమిటీ? ఏమైందీ?
కన - వాకిట్లో పెట్టిన సైకిలు కనబడడం లేదండీ!ఎలాగండీ? ఖర్మ !- విచారించ కండి .కనపదని జాబితాలో వ్రాసుకొండి .
కన -ర్యాలీ సైకిలండీ! చాలా ఖరీదు. కొంచెం వెతికి పెట్టండి బాబూ!
చం- నేనా! వెతికి పెట్టేదా! భలేవారు మీరు.
కన - కానని వాని నూతగొని ,కానని వాడు
విశిష్ట వస్తువున్ , కానని భంగి
అలా అయిన్దయ్యా నాపని-[వెళ్ళిపోతాడు]
చం - అడ్డమైన వాడూ ,అది కనపడటం లేదు, ఇది కనపడటం లేదు అని నా దగ్గర కొస్తే నేనేం చెయ్యను? నా ఉద్యోగం మానుకొని ఈ ఉద్యోగం మొదలు పెట్టాలింక. వెధవ సంత -నే వెళ్లి సిగరెట్లు తెచ్చుకొంటా!ఇంకాసేపుంటే మళ్ళీ ఎవరేనా వస్తారు.త్వరగా. తలుపేసుకో నే వెళ్తున్నా .
[బయటకు వెళ్లి పోతాడు ]
ర-[స్వగతం] హమ్మయ్య ! మళ్ళీ ఎవరేనా ఏదైనా కనపడలేదు అంటూ వచ్చే లోపల నే వెళ్లి స్నానం చెయాలి.బాబూ !
[రమా దేవి కూడా వెళ్లి పొతున్ది.]
సమాప్తం
*******

Monday, March 25, 2013
కనిపించడం లేదు నాటిక రచన -రావూరు
నాటిక కనిపించడం లేదు రచన -రావూరు
******* *************** *************
గదిలో ఒక పక్కగా ఒక బల్ల కుర్చీ వుంటాయి . బల్ల మీద రెండు
మూడు పుస్తకాలు అస్తవ్యస్తంగా పడి వుంటాయి. కొంచెం వెనుకగా ఇంకో ప్రక్కన ఒక మంచం
దాని మీద పక్క వేసి వుంటాయి . మంచం కింద చిన్న పెట్టె వుంటుంది . ఎదురుగా ఒక గోడకు కాలెండర్ తగిలించి వుంటుంది . [చంద్రం లుంగీ బనీనుతో వుంటాడు . రమా దేవి సామాన్య మైన చీరలో మధ్య తరగతి గృహిణి లా వుంటుంది . ]
తెర లేచే సరికి చంద్రం ఆ బల్ల దగ్గర కూర్చుని ఏదో చదువుతూ వుంటాడు . తర్వాత మెల్లగా లేచి ఆబల్ల మీద సామాను అటూ ఇటూ సర్దుతూ వుంటాడు . విసుగు పుట్టింది .
చంద్రం - రమా!ఓ ! రమా! [ఘట్టిగా పిలుస్తాడు . జవాబు రాదు]
చం -ఇదో ప్రారభ్దమ్ -నాకేదయినా అవసర మైనప్పుడు ఈవిడ కూడా కంటిక్కనపడదు . రమా ! ఓ! రమా [ఘట్టిగా పిలుస్తాడు .]
రమాదేవి -[లోపల్నుంచి ]ఆ!ఆ!వస్తున్నానండీ!ఎందుకలా గావు కేకలు పెడతారు?స్నానం చేద్దామని వెళుతున్నాను . ఈవేళ మీ శెలవు కాదు గానీ నా పని తెమల నియ్యడం లేదు . పొద్దుటి నుంచీ చూస్తున్నాపనితరవాత పని చెపుతూనే వున్నారు . ఈవేళ నేను స్నానం చేసే గీత కనపడటం లేదు .
చం -మరేం ఫరవాలేదు ఒక్కరోజు స్నానం ఆలస్య మయితే ఏమీ మునిగిపోదు కానీ,ఇక్కడ పెట్టిన అగ్గిపెట్టె కానీ చూసావా?అది నాక్కావలసి నప్పుడు కాన పడదు. అయినా నా అగ్గిపెట్టె ముట్టు కో వద్దని ఎన్ని సార్లు చెప్పాను?
రమ -నా వంటింట్లో అగ్గిపెట్టె వేరే వున్దిగా. మీ సిగరెట్టు కంపు అగ్గిపెట్టె నా కెందుకండీ! ఇక్కడే ఎక్కడొ పడి వుంటుంది చోడండి.[అక్కడంతా వెతుకుతుంది . ఆ బల్ల మీద పుస్తకాల మధ్య నుంచి అగ్గి పెట్టె తీసి ఇస్తుంది . ]ఆ!ఇదుగోనండీ మీ అగ్గిపెట్టి , నెమ్మదిగా చూసుకొంటే అదే కనిపిస్తుంది . ఏదీ! మీదగ్గర ఆ ఆర్పే కనపడటం లేదు .
చం -ఆ!ఆ! సరేలే! ఇలాతే! [తీసుకొని సిగరెట్టూ పెట్టె కోసం చూస్తె అది కనపడదు . ]
చం- ఇక్కడ సిగరెట్టు పెట్టె ఏమయినది!ఇది వచ్చేటప్పటికి అది మాయ మైంది .
ర- ఎక్కడ పెట్టారు?
చం - హిమాలయాల మీద. ఎక్కడ పెడతాను ఇంట్లోతప్ప? ఆబల్లమీద సిగరెట్ పెట్టె పెట్టి ,అగ్గిపెట్టె వెతకడం ప్రారంభించా అడిదోరికింది,ఇది పొయిన్ది. ఏదీ కనబడదు ఈ ఇంట్లొ-
ర- నేను వెతుకుతా వుండండి .
చం- ఆ!వెతుకు,వెతుకు నీవి విశాల నేత్రాలుగా !
ర- ఇదుగో నండీ,దిండు కింద [దిండు కింద నించి తీసి ఇస్తున్ది.]
చం- దిండు క్రిందా?
ర- [నవ్వి] దిండుకింద సిగరెట్టు పెట్టే - ఈ పేరుతో ఒక నాటకం వ్రాసెయ్యండి.
చం - ఇందులో రెండు సిగరెట్లు వుండాలి. కనపడటం లేదే!
ర- అయ్యో!రామ! అవేమవుతాయండీ! మీరే కాల్చేసి వుంటారు .
చం- అవునే! నేనే కాల్చి మళ్ళీ వెతుక్కొంటున్నా!నాకు మతి మరుపు. ఎం చెయ్యమంటావు?
ర- లేకపోతే ఏమవుతాయండీ?
చం- సిగరెట్టు పెట్టెలోంచి పైకి వురికి కిటికీ లోంచి బయటికి పోయి వుంటాయి. మాయా బజారు సంసారం . ఆ చొక్కా ఇలాతే! ఓ అర్ధ రూపాయి పడేయ్ ,వెళ్లి తెచ్చు కొంటా![రమా దేవి చొక్కా తీసి ఇస్తున్ది.పెట్టె తెరవడానికి చూస్తె]
ర- అయ్యో! తాళం చెవి బల్ల మీద పెట్టానే! మీరేమైనా చూసారా?
చం- బాగున్ది. నన్నే అడగడం ప్రారంభించావ్? చూడు చూడు
ర- ఇందాక ఇక్కడే పెట్టానండీ! ఇంతలో ఏమైందీ! మీ చొక్కా జేబులో ఉందేమో చూడండి కొంచెం -
చం - నీకు కనబడని వన్నీ నా జేబులో వుంటాయా? ఇదేం గారడీ వాడి సంచీ అనుకొన్నావా?
ర- ఏమైంది మరి?వెతుకుతూ వుంటా ఈపూటకు వెళ్లి అప్పు తెచ్చుకోండి .
చం - అప్పా!అప్పిచ్చే వాడేక్కడా కనపడటం లేదు. ఎక్కడ తేను?
ర- ఎలాగండీ తాళం చెవి?ఏమైంది మరి? ఇక్కడే పెట్టా,నాకు బాగా జ్ఞాపకం వుంది .
చం -మరి వెతుకు వెతుకు [అటూ ఇటూ పచార్లు చేస్తూ వుంటాడు .
ర- నే వెతకలేనండీ -ప్రతిదీ వెతకట మే నయ్యె![కుర్చీలో కూర్చుంటుంది]
చం -[కోపంతో] ఎవడి కోసం వెతుకుతావే![దగ్గరకు వెడతాడు] ఒక్క చెంపకాయ వేస్తే-ఓసినీ ...... నీ మెళ్ళోగొలుసులొనే వుందే !పెట్టే తియ్యి తియ్యి త్వరగా
ర- అవునండోయ్ !ఇందాక పెట్టు కొన్నాను.{పెట్టెలో డబ్బులు తీసి ఇస్తుంది . ]
బయట నుంచి పిలుపు ------చంద్రం గారూ!
చం -నాగారాజుగారా? రండి రండి
నాగరాజు- చంద్రం గారూ పొద్దుటి నుంచీ మా అబ్బాయి కనపడటం లేదండీ!ఊరంతా వెతికి వెతికి వచ్చాను. ఎక్కడకు పోయాడో ఏమో మరి!
చం - మీ అబ్బాయి కనిపించడంలా? మా ఇంట్లో వస్తువులు కనపడక యాతన పదుతున్నాము. మీ ఇంట్లొ మనుషులే కనిపించడంలా ?
నాగ- వాడిని వెతుకుతానని వాళ్ళమ్మ వెళ్ళింది ,అదీ కనిపించడం లెదు. ఇల్లు తాళం వేసి వుంది .
చం - తాళం చెవి పోగొట్టుకొని వెతు క్కొంటొదో ఎమో-మరి [భార్య వంక చూచి నవ్వుతూ] ఆవిడ మెళ్ళోనె వుండి వుంటుంది ,పాపం చూసుకొని వుండదు.
ర- చాల్లెండి సరసాలు!ఆయన భార్యా ,పిల్లాడు కనబడక ఆదుర్దా పడుతుంటే
నాగ - అసలే సంసారానికి దారి కనబడక అవస్థ పడు తుంటే ఇంట్లో వాళ్ళూ కనబడక పోవడం వచ్చింది . ఓపక్క పొద్దుగూకు తోన్ది. చీకటి పడితే నాకు చూపు సరిగా కనపడదు ఎలా?తిరిగి తిరిగి జ్వరం వచ్చి నట్లు గా వుంది . ప్చ్ ప్చ్ మీ ఇంట్లో ధర్మా మీటరు గాని ఉందా?
చం - ఏమే! ఉందా?
ర- ఉండటానికి వుంది . నెల రోజుల నుంచీ కనిపించడం లేదు. ఎక్కడ పడ్డదో ఏమో?
చం - మాకు ఉండటానికి వస్తువులన్నీ వుంటాయి కానీఅవసరానికి కనిపించవు. ఇదో విచిత్ర మైన ఇల్లు.
సీతా పతి వస్తాడు
సీ -చంద్రం గారూ!అరె నాగరాజు గారు కూడా ఇక్కడె వున్నారే! మా కుక్క పిల్ల పొద్దుటి నుంచీ కనిపించడం లేదు ..... మీ ఇద్దరిలో ఎవరికైనా కనిపించిందా? రమా దేవి గారూ మీకైనా సరే!
నాగ- కుక్కను చూసి మూడు నెల్లయింది ..చూస్తె లాక్కొచ్చి మీ ఇంట్లొ పడెయ్యనూ !చూడండి మీకుక్క పిల్లను వెతకడంలో ఎక్కడైనా మా పిల్లవాడు గానీ, వాడి తల్లి గానీ కనిపించారా? చెప్పండి. వాల్లిద్ద్దరూ పొద్దుటి నుంచీ కనిపించడం లెదు.
సీ - మనుష్యుల కేమయ్యా ?కాస్సేపటికి వాళ్ళే వస్తారు. కుక్కపిల్ల నోరు లేనిది. ఎక్కడికి వెళ్లిందో? ఏమయ్యిందో? చూడాలి మరి, నే వెళ్ళోస్తా.
[సీతాపతి వెళ్ళిపోతాడు]
నాగ- నేనో వెళ్ళొస్తా. ఈప్రపంచలొ బతకడానికి దారి ఎక్కడా కనిపించడంలా! ధర్మం అంతకన్నా కనిపించడంలా! [నాగరాజు అక్కడ వున్న అయిదు రూపాయల నోటు జేబులో పెట్టు కొం టాడు. ] వెళ్ళొస్తా,వెతక్క పొతే పెళ్ళాం, పిల్లల్ని వదిలేసి ఊరుకొన్నాడు అంటారు. తిరగాలి తప్పదు మరి [-కొంచెం ఆగి]ఒకవేళ వాల్లోస్తే ఇంకా గంటా రెండు గంటల్లో వస్తానని చెప్పండి . [ఒకాలికి తొడుక్కో వలసిన చెప్పు మరో కాలికి తొడుగు తాడు]
చం - అదేమిటి? అలా తప్పుగా తొడుగు తున్నారు చెప్పులు?
నాగ - ఏమిటో! మతి సరిగాలెదు. వస్తువులు సరిగా కనిపించడంలా {చెప్పులు సరిగా తొడుక్కొని] వస్తా మరి. [వెళ్లి పోతాడు ]
చం - పాపం పెళ్ళాం బిడ్డలు కనపడక ఆయన దిగులు పదుతున్నాదు.ఇలాతి సంసారాలు చెయ్యడం ఏంతో కష్టం
ర- పోనిద్దురూ! ఇంకోళ్ళ సంగతి మనకెందుకు గానీ,నే స్నానానికి వెళ్తున్నా
చం - సరేలే! తలుపేసుకో! నే వెళ్లి సిగరెట్లు తెచ్చుకొంటా!
ర- కానీయండి! అది లేనిదే గడిచే ఉపాయం కనిపించడంలా!
చం - ఏదీ! ఇక్కడ పెట్టిన అయిదు రూపాయల నోటు ఏమైంది?
ర- జేబులో చూసుకోన్నారా?
చం - లేదే![జేబులో చోసుకొంటాడు .]
ర- అప్పుడే ఎక్కడ పోయిందండీ ఖర్మ?ఎక్కడ పెట్టారు?
చం- ఇక్కడే!ఈబల్ల మీద.
ర- ఇంతట్లో ఏ నక్క ఎత్తుకుపొయిన్ దండీ !
చం - అంతా మిధ్యా ప్రపంచం లా వుంది .దగ్గర వస్తువులు కనిపించక పోవడ మేమిటి? ఒకటా? రెండా? అయిదు రోపాయలు.
ర- కొట్టిమీరన్నా వచ్చేది!
చం - చచ్చేది! అసలు నోటు నాకు ఇచ్చావా?
ర- ఇచ్చా కదండీ!
చం - పుచ్చుకొన్న మాట జ్ఞాపకం వున్ది. తలచుకొంటే భ్రమ లాగా వున్ది.
ర- భ్రమ అంటా రేమి టండీ శ్రమ పది సంపాదించుకొన్న సొమ్ము.ఇది ఆనాగారాజు పనే అయి వుంటుంది . ఉన్నంత సేపు ఆ బల్ల దగ్గరే తారత్లాదాదు.
చం - అందుకేకాబోలు వెళ్ళేటప్పుడు . అంత ఖంగారు పద్దాదు.
[ ఇంకా వుంది]
Saturday, March 2, 2013
రావురు కలం- అసలు నీకెమన్నా పిచ్చా?
రావూరు కలం - అసలు నీకేమన్నా పిచ్చా?
చాలా మంది ఊత పదాలు వాడుతూ వుంటారు. సంభాషణ మధ్యలో ఆపదాలు తమాషాగా అతు క్కొంటూ వుంటాయి . ....... మొజాయిక్ లో తెల్ల,నల్ల ,పచ్చ బిళ్ళ లల్లే !అసలా పదం లేందే వారికి సంభాషణే జరగదు.
మా వూళ్ళో ఒకాయన వుండే వాడు . ఆయనగారు ఏది మాట్లాడినా మధ్యలో ...ఏ మిటి !నీకు పిచ్చేమిటి? అనడం మామూలు . ఎంతటి వాళ్ళతో మాట్లాడుతున్నా హటాత్తుగా ఆమాట పది తీరవలసిందే! ఒకసారి భూమి శిస్తు కి సంబంధించిన కేసు వచ్చి తహసీల్ దారు దగ్గరికి వెళ్లాడాయన . తహసిల్ దారు అడిగాడట "నువ్వు అదనం గా శిస్తు కట్టాలి . నువ్వు పోరంబోకు కలుపుకొన్నట్లు రుజువైంది 'అన్నాడట .
ఈ పెద్ద మనిషి వెంటనే "నేనేమి పోరంబోకు కలుపుకొలెదు. సర్వే రాళ్ళు అలా అమ్మతల్లులల్లే ఉండగా నేనెలా కలుపుకొంటాను?మీరెలా ఒప్పుకొంటారు? అయినా మీకేమన్నా పిచ్చా?...... కరణం గారి లెక్కల్లో ఏదో తప్పుంది . లేకపోతె తరతరాలుగా మా వూళ్ళో "తీరువ బాకీ లేని దేవరయ్యా? అంటే ...తిరుపతయ్యె నని చెపుతారు. .......... మీకేమన్నా పిచ్చా?అన్నాడుట .
తహసిల్ దారుకి కోపం వచ్చి డ ఫేదార్? వంక చూచి "నాకు పిచ్చంటా డేమిటి ?బయటికి పంపు, తీరువ మూడు రెట్లు చేస్తున్నాను "అన్నాడట .
అది విన్న పెద్ద మనిషి "అదేమిటి? నేనే మన్నా నిపుడు? తీరువ కట్టక్కర లేదన్నాను . మూడు రెట్లంటా రేమిటి? మీకేమన్నా పిచ్చా?అన్నాడట .
అప్పుడా ఆఫీసరు గారికి తెలిసిందట అది అతగాడి ఊత పదమని.
వూళ్ళో ఎవరన్నా కనిపించి ..ఏ మీ తిరుపతయ్యా..కులాసా అంటే "ఆ.. కులాసే! కోడె దూడ నమ్మితే మూడొంద లొచ్చాయి. ... దాంతో ఒక పాడి గేదెని కొన్నాను. .... రెండు పూటలా పెరుగు పోసుకొంటున్నాము . నీకేమన్నా పిచ్చా? అనేవాడు .
"నువ్వు పెరుగు పోసుకొంటే మాకు ఫై చ్చేమి టయ్యా !....ఇంకొ గేదెని కొనుక్కో!వెన్న ముద్దలు కూడా మింగు .అని అవతల వాళ్ళ వెళ్లి పోయే వాళ్ళు .
ఒకసారి మా ఊరికో కొత్తల్లుడు వచ్చాడు . ప్రొద్దున అతడు చెరువు గట్టు మీద వుండగా ఈ ఊత పదం పెద్దమనిషి వెళ్ళా డు . వెళ్ళిన తర్వాత ఏదో పలకరించాలిగా "ఏం ఎప్పుడొచ్చారు?పది రోజులుంటారా! వానా కాలమేగా వుండిపో! మీ మామ మంచాడే! -ఏమిటి? వుంటావా ?అసలు నీకేమన్నా పిచ్చా!'అన్నాడు .
ఆ అల్లుడు ఖంగారు పడి తనకు పిచ్చి అని ఎవరు చెప్పారీయనకు? మా మామకు పడని వాళ్లె వరన్నా ఉన్నారేమో వూళ్ళో నని ,ఆ పెద్ద మనిషితో అన్నాడు " నాకు పిచ్చేమిటి? నాకేం లేదు . శుభ్రం గా వున్నా!మా పెదనాన్నకు కొంచెం పిచ్చి ఉండేదిట . ... ఆయన పోయాడు" అన్నాడు .
ఆ పెద్ద మనిషి పగల బడి నవ్వి " ఆ మాట చెప్పవేం! ఇంట ఆలస్యం గా చెప్పావెం! నీకేమన్నా పిచ్చా? అనుకొంటూ వెళ్లి పోయాడుట . ఆ కొత్తల్లుడికి నిజం గా పిచ్చెక్కి నంత పనయింది . తర్వాత గానీ తెలియ లేదు అది ఆయనకీ ఊత పదమని.
********************** 7-7 1979

Thursday, February 28, 2013
తెల్లవారినా.....
తెల్లవారినా ...........
తెల్లవారినా తెలియదాయనే
నల్లనయ్య నా చేరువ నుండగా తె
విడి విప్పిన నా కురులలోపల
దాగియుంటి నే సిగ్గు పొంగగా
నల్లనయ్య తన వల్లె వాటుతో
నన్ను కప్పేనే మొగ్గపోలిక తె
పిలపిల మని పిట్టల గుంపులు
పిలిచితివట భానుని తొలిగా
కలకలమను మా నవ్వుల
కలిసిపోయె నా రుతములు తె
తలుపు సందులను
ఎరుపు కాంతులేవో
ఎగప్రాకగా నే కాంచితి కానీ
నల్లనయ్య కౌస్తుభ మటు నిటు
ఊగిన దనుకొంటినే తె
అందని దొర నా సందిట
పొందికగా నమరి యుండ
తెలియునటే పొద్దుల హద్దులు
వినిపింపకు నాకిక సుద్దులు తె
***************************
తెల్లవారినా తెలియదాయనే
నల్లనయ్య నా చేరువ నుండగా తె
విడి విప్పిన నా కురులలోపల
దాగియుంటి నే సిగ్గు పొంగగా
నల్లనయ్య తన వల్లె వాటుతో
నన్ను కప్పేనే మొగ్గపోలిక తె
పిలపిల మని పిట్టల గుంపులు
పిలిచితివట భానుని తొలిగా
కలకలమను మా నవ్వుల
కలిసిపోయె నా రుతములు తె
తలుపు సందులను
ఎరుపు కాంతులేవో
ఎగప్రాకగా నే కాంచితి కానీ
నల్లనయ్య కౌస్తుభ మటు నిటు
ఊగిన దనుకొంటినే తె
అందని దొర నా సందిట
పొందికగా నమరి యుండ
తెలియునటే పొద్దుల హద్దులు
వినిపింపకు నాకిక సుద్దులు తె
***************************
Sunday, February 24, 2013
మునిమాణిక్యం వారి ముత్యాల పంట
మునిమాణిక్యం వారి ముత్యాల పంట
సరస,సరళి సౌజ న్య భావనల తో నిండి పండిన స్త్రీ మూర్తిని నాయికగా స్వీకరించి కమనీయ మైన కాంతం కధలు సృష్టించిన సిద్ధ హస్తులు శ్రీ ముని మాణిక్యం నరసింహారావుగారు . కాంతం ఆంద్ర దేశం లో ప్రతి ఇంటా సారస్వత సేవ చేసింది . ప్రతి గృహిణిని పలకరించింది . ప్రతి వారి మనస్సులో నవ్వులు చిలకరించింది .
రాజ మహేంద్ర వరములో ఒక మిత్రుని కుమార్తె పేరు కాంత మట .నరసిమ్హా రావుగారు అక్కడికి వెళ్లి నపుడు ఆ మిత్రుడు కుమార్తెను మాటి మాటికి కాంతం కాంతం అని పిలిచినప్పుడు -ఆ పేరు ఆయన కెంతో బాగా వున్నట్టు తోచిందిట . ఆ పేరునే కధలలో నాయికకు ఉపయోగించడం ప్రారంభించారట . తోలి సారిగా "కాంతం"కదా వ్రాసిన శుభ ముహూర్త మెట్టిదో ఆ పేరు తెలుగు సారస్వతం లో చిర స్థాయిగా నిలిచి పోయింది .
కాంతం కధలు ..... తెలుగు కద రచనా విధానంలో -ఒక వెన్నెల మలపు కల్పించినాయి. గార్హస్త్య జీవితం లో నుంచి అతి సున్నిత మైన సంఘటనలను ఎన్నుకొని హాస్యాన్ని జోడించి , సభ్యతకు భంగం రాకుండా ,సౌజన్యత తరిగి పోకుండా చిత్రించిన కధలవి. "కాంతం చెప్పినట్లు" అని ప్రతి ఇంటా సామెతలుగా చెప్పుకోవడం సర్వ సామాన్య మైంది .
కాంతం ఏదైనా గొప్ప భావం వెలి బుచ్చిందని,సరసంగామాట్లాడిందని, సమస్యను చక్కగా పరిష్కరించిందని ,అమాయకత్వంతో ,అనురాగంతో పిల్లల పెంపకం కొన సాగించిందని- కధల ద్వారా వెలి బుచ్చడం తద్వారా కాంతం హోదాను పెంచడం శ్రీ నరసింహారావు గారి అభిలాష . కాంతాన్ని పొగుడుతుంటే ముని మాణిక్యం వారు చిన్డిన్చే ముసిముసి నవ్వులు-వారికి కలిగిన సంత్రుప్తికి ,శాంతికి చిహ్నాలుగా కనిపించెవి.
బహుశ: తొ లి సారిగా హిందీ లోకి అనువదించ బడిన కధలు కాంతం కధలే నెమో! తర్వాత ఈ కధలు రష్యన్ మొదలైన విదేశీ భాషల్లోకి ,తమిళం,కన్నడం మొదలైన జాతీయ భాషల్లోకి అనువదించ బడినాయి .
"కాంతం ప్రసన్న వదనం నాకు నిత్యం గోచరిస్తూనే వుంటుంది . మూగగా వున్న నాకేవో భావాలు అందిస్తూనే వుంటుంది . ఆ ముసిముసి నవ్వులలో ముత్యాల జల్లులు కురుస్తూ వుండేవి .ఎక్కడ ఏ సందర్భంలో స్త్రీ ని చూసినా మా కాంత మైతే ఈ సందర్భంలో, ఈ సన్నివేశంలో ఎలా మాట్లాడుతుంది? అని ఆలోచన వస్తున్ది. ఆ ఆలోచనలోంచి ఒక కదా ఉత్పన్న మయెది. "అని చెప్పారాయన ఒకసారి.
ఆయన గారెప్పు డైనా హాస్యంగా మాట్లాడుతున్నా,ఎవరితో నైనా సాహిత్య పరమైన ఘర్షణ జరిగినా -అవతల వారు "వుండండి,మీ కాంతం గారితో చెపుతాను"అని హాస్యంగా అంటూ వుంటారు . నరసింహారావు గారు వెంటనే నవుకొని "చెప్పండి_ఆవిడ మీకేమి జవాబు చెపుతుందో నాకు తెలుసు. ....... నా విషయంలో ఆవిడెప్పుడూ గౌరవం గానే వుంటుంది . అనేవారెంతో ధీమాగా. ఇంటి సంఘటనలనే ఆయన గారు కధలుగా చిత్రించగలిగారు కొన్నిసార్లు.
కాంతం ఆంద్ర దేశంలోని సామాన్య కుటుంబానికి చెందినా ఇల్లాలు .... ఆమె మనసెప్పుడూ తన ఇల్లు,పిల్లలు,ప్రియమైన భర్త ,మర్యాదగల బంధువులు .. వీరి మీదనే తిరుగుతూవుండేది ఆవిడకు ఘట్టిగా మాట్లాడటం తెలుసునేమో గానీ -గడుసరి తనం చెతకాదు.కొంచెం సరసం తెలుసునేమోగానీ , ఘనత నాపాదించుకోవడం తెలియదు.మోజులు వెలిబుచ్చడం తెలుసునేమో గానీ,పోజులు పెట్టడం తెలియదు. ఆమె ఏమి మాట్లాడినా సంసార పక్షం గానే వుంటుంది . ఒకప్పుడు భర్తతో ఎదిరించి మాట్లాడినా అందులో ఏదో ధర్మ మున్నట్లే తోస్తుంది ఆమె సాధు స్వరూపం సాహితీ పరుల హృదయాలలో చల్లటి మల్లె పందిరు లల్లుకొంది . నరసింహారావు గారి కాంతం .... ఏదో దూర తీరాల నుంచి తెలుగు దేశానికి సుగంధ ద్రవ్యాలను మోసుకు వచ్చి పంచి పెట్టిన పూల వాన.
నరసింహారావు గారు ఆదిలో పద్య రచనకుఎక్కువ అభిలాష చూపుతూ వచ్చారట . సాహితీ సమితి సభ్యులు ,ఆసభ్యులకు "అన్నగారు" శ్రీ శివ శంకర శాస్త్రి గారు -ముని మాణిక్యం వారితో చెప్పారట ...... "చూడు నరసింహారావ్"నువ్వు కవిత్వం వ్రాయడం మాని ,కధలు వ్రాయడానికి పూనుకో .... నీ కలం కధల్లో చురుకుగా పరుగెత్తు తుంది అ ని సలహా చెప్పారట ."అన్నగారి"మాట ప్రకారం ముని మాణిక్యం వారు కధారచన ప్రారంభించారట .వీరు ప్రఖ్యాత కదా కారులు కావడానికి శ్రీ శివ శంకర శాస్త్రి గారి ఆశీర్వాదం ఏంతో తోడ్పడి వుంటుంది .
తోలి సారిగా వీరు "ఉఫ్" అనే కద వ్రాసారట ఽఅ కద అంతా ఊహా గానం తో నిండి వుంది . క్రమంగా వారి కలం గార్హస్త్యజీవితం వేపు మళ్ళింది . కాంతం ప్రత్యక్షం కావడం తో కమనీయ భావనలతో నిండిన కదా సాహిత్యం సాక్షాత్కరించింది . కాంతం మురిపాలు తిరి తీపి వెన్నెలలు కురిపించా సాగాయి.
మునిమాణిక్యం వారి కలం కొంతకాలం కాంతానికే అంకిత మయ్యింది . నేనూ-నా కాంతం ,కాంతం కైఫియత్ ,కాంతం కధలు,కాంతం కాపురం ,మొదలైన సంపుటా లెన్నో వెలిసినాయి. అన్నిటిలో క్రొంగొత్త కాంతులు విరిసినాయి.
నరసింహారావుగారు నవలలు వ్రాయడం లో సిద్ధ హస్తు లనిపించు కొన్నారు. "వక్రరేఖ" 'అన్నయ మంత్రి "వంటి చారిత్రాత్మక నవలలు వ్రాసి మెప్పు పొందారు . వారి "తిరుమాళి గ " సంసార జీవితాన్ని ఎంతో చక్కగా ప్రతి బింబించి నగోప్ప సాంఘిక నవల .
రావుగారు గుంటూరు జిల్లా లోని సంగం జాగర్ల మూడిలో 1898లో మధ్య తరగతి బ్రాహ్మణ కుటుంబం లో జన్మించారు. తండ్రి శ్రీ సూర్య నారాయణ గారు ఉపాధ్యాయ వృత్తిలో పేరు గడించారు . తల్లి రుక్మిణ మ్మగారు దైవ భక్తీ కల ఇల్లాలు.
నరసింహారావుగారు తెనాలి,విజయ నగరాలలో విద్యాభ్యాసం చెసారు. రాజ మహేంద్ర వరంలో బి,ఇ డి డిగ్రీ పుచ్చుకొన్నారు. మొదటభీమవరం లోని ఒక మిషనరీ స్కూలులో పనిచెసారు. తరువాత బందరు హిందూ హై స్కూలు లో చెరారు. ఉపాధ్యాయ పదవి అంతా అక్కడే జరిగింది . బందరులో వీరి రచనా వ్యాసంగం ఎక్కువగా కొన సాగిన్ది. ఉత్తమ కధకులుగా పేరు కీర్తులు సంపాదించారు . కృష్ణా పత్రిక దర్బారులో సభ్యులుగా వుంది,ప్రతి రోజు హాజరై నవ్వులందించేవారు .
తర్వాత హైదరాబాదులోని ఆకాశ వాణి కేంద్రంలో విద్యా శాఖలో అసిస్టెంట్ ప్రొఫెసరుగా చెరారు. అక్కడ నుంచి విర మించుకొన్న తరువాత ఆంద్ర సాహిత్య పరిషత్తు వారు నిర్వ హించే పండిట్ ట్రైనింగ్ సెంటర్ ప్రిన్సిపాల్ గా పని చెసారు.
శ్రీ రావుగారికి ఆంద్ర సారస్వత పరిషత్తు విశిష్ట సభ్యత్వ పదవి అందించి గౌరవించింది . అనేక సంస్థలు,సమాజాలు వీరిని ఉచిత రీతిని గౌరవించాయి .
రేడియోలో వారు అనేక హాస్య ప్రసంగాలు చెసారు. హాస్య నాటికలు వ్రాసారు. మద్రాసు రేడియో కేంద్రం స్థాపించిన కొత్తలో శ్రీ ముని మాణిక్యం నాటిక ఒకటి ప్రసార మైంది . అదే నేను మొదటగా రేదోయో నాటిక వినడం . అదే కేంద్రం నుంచి ప్రధమంగా ప్రసార మైన నాటిక అనేది నేను ఘట్టిగా చెప్పలేనుకానీ అదే ప్రదం హాస్య నాటికఅని తెలుసు.
ఆరోజుల్లో రేడియోలు కూడా తక్కువ. శ్రీ మునిమాణిక్యం వారు నాటిక వినడానికి ఎవరింట్లోనో ఏర్పాటు చేసి మా దర్బారీయులందరినీ తీసుకొని వెళ్ళా రు. నాకు బాగా జ్ఞాపకం ఆ నాటికలో పాల్గొన్న వారిలో ఒకాయన ఒక వాక్యం తప్పు చెప్పాడు . మునిమాణిక్యం వారు "అది కాదయ్యా నేను వ్రాసింది "అని కేక పెట్టా రు. మేమంతా నవ్వుకొన్నాము. కాతూరివారు "ఊరికే అలా కేకలు పెట్టకయ్యా! వాళ్లకు కోపం వస్తే చెక్కు పంపారు "అన్నారు మళ్ళీ నవ్వుకొన్నాము.
శ్రీ నరసింహారావు గారు ఏంటో కృషి చేసి "మన హాస్యం "అనే గ్రంధం వ్రాసారు. ఆ గ్రంధాన్ని గురించి మాట్లాడుతూ "ఇది నిజంగా శాస్త్రీయ గ్రంధం ,హాస్య రసానికి చెందిన ప్రధ మ శాస్త్రీయ గ్రంధం "అన్నారు.
ఈ గ్రంధంలో హాస్యంతో,చమత్కారంతో, హేళన -అవ హేళ నలతో గల వివిధ స్వరూపాల్ని చక్కగా చిత్రించారు. ఎన్నో చక్కటి ఉదాహరణలిచ్చారు . ఇది వారు చేసిన ఉత్కృష్ట సేవ అని చెప్ప వచ్చు.
నరసింహారావుగారు మెత్తని హృదయం కలవారు. మిత్రులంటే ఎంతో ఆశక్తి. అదితి మర్యాదలలో అందే వేసిన చెయి. సాహితీ రంగం లో పందెం వేసి పరుగులు తీసిన వ్యక్తి. కదా ప్రపంచంలో ఒక యుగానికి నాంది గీతం .

Wednesday, February 20, 2013
హాస్య రస సింధువు:సాహిత్య బంధువు శ్రీమొక్కపాటి నరసిం హ శాస్త్రి
హాస్య రస సింధువు: సాహిత్య బంధువు
శ్రీ మొక్కపాటి నరసింహ శాస్త్రి
తెలుగు సారస్వతానికి కొత్త వన్నె చిన్నెలు దిద్దగాలవారెందరో బయలుదేరారు .వారు అనేక సాహిత్య శాఖల్లో నూతనత్వం కల్పించి చైతన్య స్రవంతి గా రూపొందించ గలిగారు. .
అలాంటి సాహిత వేత్తలలో హాస్యరస పోషణకు పూనుకొన్న వారిలో శ్రీ మొక్కపాటి వారికిగొప్ప స్థానం లభించింది . "పిలక"అనే వ్యాసం తో ప్రారంభ మైన వారి హాస్య రచన అనేక రీతులుగా,అనేక శా ఖలుగావిస్తరించి,విరితోటగా అవతరించింది .శాస్త్రి గారు అనేక కధలు,నాటికలు, వ్యాసాలూ వ్రాసారు. వారు వ్రాసిన "బారిస్టరు పార్వతీశం"అన్నిటా తలమానికంగా నిలిచినది . తెలుగు హాస్య రస సాహిత్యం లోనే "బారిస్టరు పార్వతీశం"ఒక ఉన్నత స్థానాన్ని అలంకరించింది . అందలి హాస్యం ఎందరి హృదయాలనో కదిలించి నవ్వించింది .మొ.క్క పాటి వారి పార్వతీశం,గురజాడ వారి గిరీశం చెట్టా పట్టాలు వేసుకొని నవ్వుతూ,నవ్విస్తూ సంచ రించడం సాగించారు సాహిత్యక వీధుల్లొ.ఇంకా ఆజంట నవ్వుల పంటలు పండిస్తూనే వున్నారు .వీరిద్దరూ డాన్ క్విక్ సాట్ -ఫాల్ స్టా పులతో బంధుత్వం కలుపుకో గాలిగా రంటే అతిశయోక్తి ఎంత మాత్రం లెదు. పారవ తీశం వెండి తెరమీదకు కూడా ఎక్కాడు .పాఠకుల హృదయాలలో నక్కినక్కి అదను దొరికి నప్పుడల్లా నవ్విస్తూ వుంటాడు ."బారిస్టరు పార్వతీశం" రెండు,మూడు భాగాలుకూడా వెలువడి నాయి. "అతనినింకా సరి అయిన గమ్యానికి చేర్చ లేదు .దాన్ని గురించి ఆలో చిస్తున్నాను"అన్నారు శ్రీ శాస్త్రి గారు. .శాస్త్రి గారి నాటికలలో కూడా చక్కని హాస్యం గొచరిస్తుంది .
మొక్కుబడి-అభ్యుదయం
********************
మొక్కుబడి అనే నాటికలో వెంకటేశ్వర ప్రభువుపై భార్యకు గల విశ్వాసం -భర్తకు ఆ విశ్వాశం మీద అవిశ్వా సమ్. ఈనాతికలో చక్కగా వర్నించారు.విశ్వాసాలకు గలవిలువను,భక్తిని నిరూపించడంలో ఈనాటిక ఫల శృతి నందుకొం ది అభ్యుదయంలో మానవత్వానికి,యాంత్రిక యుగానికి ఏర్పడిన సంఘర్షణ చిత్రించబడింది ంఒదతి ప్రపంచ యుద్ధాన్ని ఆధారం చేసుకొని ఈ నాటిక వ్రాయ బడింది .దీనిలొ చక్కనినాతకీయతా,సంభాషణా పటిమా గొచరిస్తున్ది. రంగ స్థలానికి అనువైన నాటిక ఇది. ఎప్పటికి సరిపోయే సందేశం వుంది
పెద్దమామయ్య
అసాధారణ సమావేశం
*******************
పెద్ద మామయ్యా అంటే వూరి పెద్దఽతని మాటకు తిరుగులెదు. కానీ అతన్ని మోసం చేసి ఒక పెళ్లి చేసిన వృత్తాంతం ఈ నాటికలో వస్తువు. చక్కని హాస్యం తో నిండి వుంది నాటిక ఎవోఘన కార్యాలు చేయాలని ఏర్పాటైన సంఘాన్ని గురించిన గాధ . అసాధారణ సమావెశమ్. సమావేశం ఏర్పాటు చెయ్యడం, సభ్యులు ఎవరి గొడవలో వారు పడటం ,కార్య దర్శి గల్లంతులో పడటం చిత్రించారు శ్రీ శాస్త్రి గారు.వివిధ వ్యక్తుల మన స్తత్వాలు హాస్యరస ధోరణిలో వర్ణించ బడి నాయి.
వారసత్వం_పాతివ్రత్యం
*****************
వెంకట్రావు అనే పెద్దమనిషి భార్యకు బ్రహ్మచారి మేనమామ ఒకడుంటా డు .వెంకత్రావు ఆఅస్థి కోసం తాపత్రయ పదతాడు .బ్రహ్మ చారి \బ్రతికుండగానే ఆస్తి తీసుకోవాలని ప్రయత్నిస్తాడు . అవసరమైతే ఆబ్రహ్మ చారిణి తామే పోషిస్తామంటాడు . అలాపోషించక తప్పలెదు. కనీబ్రహ్మ చారి అంతకుముందే దివాలా తీసాడు .వెంకత్రావుకి మిగిలింది చాకిరీ మాత్రమె!
పాతివ్రత్యం మం చి సమస్య గల నాటిక. నాగరిక లక్షణాలు కల ఒక యువకుడు వివాహ మాడ తాడు .భార్య అమాయకురాలు. పూర్వ కాలపు మనిషి .ఆవిడ లొ నాగరిక లక్షణాలు కల్పించ లెకపొతాడు భర్త. అతనిలోగల నాగరికతా పిపాస వదల లెదు. అందువల్ల పరకీయతకు లోబడతాడు .ప్రాక్పశ్చిమ సంస్కృతుల సంఘర్షణ ఈ నాటికలో చక్కగా రూపొందించ బడింది .
శాస్త్రి గారు"కన్నవి,విన్నవి"అనే పేరుతొ వారి కధలను రెండు సంపుటాలుగా ప్రచురించారు. వీటిలో పద్దెనిమిది కధలున్నాయి. సాంఘిక,రాజకీయ,మత ,సాంస్కృతిక సమస్యలు వీటిలో కానీ పిస్తాయి. వీటి అన్నింటిలో సున్నిత హాస్యం గొచరిస్తుంది .
నేను మా ఆవిడ-
బండ సుబ్బుడు
*************
ఒక పెద్దమనిషి బజారులో తనని అందరూ ముఖం మీద పోగతం వాళ్ళ తను గొప్ప వాణ్ణని విర్ర వీగుతాడు . భార్య మాత్రం ఆ విషయం అంగీకరించదు. అంతటితో ఊరుకోక వట్టి పనికి మాలిని మనిషి అని కూడా అంటుంది ఆయనకు కోపం వస్తుంది .అంత టితో ఆవిడగారికి స్వతంత్ర మివ్వడమే పొరపా టంటారు .ఇక్కడ చాలా హాస్య ప్రధానమైన సంభాషణ జరుగుతుంది . "బండ సుబ్బుడు"తన బరువు తగ్గడాని కి మందు పుచ్చుకొంటాడు .పలుచటి మనిషిగా మారిపొతాడు గాలిలొ ఎగిరిపోకుండా బరువుగల సూట్లు కుట్టించుకొంటాడు ఆ సూటులో దాచిన సీసాలవల్ల దాని బరువు మరింత అయి అతణ్ణి భూమిమీద నిల బెడు తుంది .
లాభ సాటి బేరం
అగ్ని పరీక్ష.
*********
లాభసాటి బేరం ఏంటో హాస్యం కల కధానిక. ఒక బడాయి కో రు పెద్ద మనిషి మీసాలు పందెం లో పణం పెట్ట బడ్డాయి అ వి ఒకరు గెలుచుకొన్నారు. ఆ సమయంలో ఆ మీసాల రాయుడొక సంగీత కచేరీకి వెడుతూ వుంటాడు. అప్పుడు వాళ్ళు ఒక వైపు మీసం మాత్రం తీసుకొని తక్కింది తరువాత అంటారు .ఈ దుస్థితి లోంచి తప్పించుకోడానికి ఆతడు -పణం పెట్టిన మొత్తానికి రెట్టింపు డబ్బు ఇవ్వడానికి అంగీకరించి మీసాన్ని రక్షించు కొంటా డు.
గాజులపాలెం గాంధీ
ఆకాశ సౌధాలు
************
గాంధీజీని అనుకరించాలని ప్రయత్నించే అవక తవకల వ్యక్తులపైన వ్యంగ రచన ఇది. గాంధీజీ రాజకోటలో ఉప వాసం వున్నా సమయంలో వ్రాసారీకధ. ఆ రోజుల్లో ఎవరూ కట్నాలు తీసుకోరాదనీ,అలా తీసుకొంటే తానూ ఆమరణాన్తరమ్ నిరాహార దీక్ష వహిస్తానని గాజుల పాలెం గాంధీ శపథం చెశాదు.
రాజాజీ అమ్మకం పన్ను విధించిన సందర్భంలో శాస్త్రి గారు వ్రాసిన వ్యంగ రచన ఆకాశ సౌధాలు . శాస్త్రిగారా సందర్భంలో కొన్ని కొత్త పన్నులు సూ చించారు. సముద్ర తీరంలో పడుచు వాళ్ళ వెంట పడేవారి మీదా ,మీసాలూ గడ్డాలూ ఉన్నవారి మీదా, పాశ్చాత్య దుస్తులు ధరించే స్త్రీల మీద, లావుపాటి వాళ్ళ మీదా,పన్నులు వెయ వచ్చు నన్నారు. అయితే కొన్ని కొన్ని షరతులు పెట్టారు. గడ్డాల మీద పన్నులు వెయ్యాలి గానీ ముస్లిం గడ్డాల మీద వెయకూడదు .లావు వాళ్ళమీద వెయ్య వచ్చుగానీ కవులూ,గాయకులూ, నటీనటులు అయితే వదిలి వెయ్యాలి. ఇలా ఏంతో హాస్యం కల్పించారీ కధలొ.
మా బావు మరిది పెళ్లి
రంగ గ్రామ సింహ రత్తయ్య
***********************
మా బావుమరిది పెండ్లి అనేది మరో కధ. పెండ్లి కూతురి తండ్రి పారే కష్టాలూ,తరువాత తాల్చే అవతారం ,వగైరాలు అందులో వర్ణించ బద్దాయి. ఒక యువకుడు నటుడుగా మారి ఆ కధను నిత్య జీవితంలో
కూడా ప్రతిబింబింప చేయాలని తాపత్రయ పడటం ఆ సంభాషణలతో ,పోజులతో ఇంట్లో వాళ్ళను దుంప తెమ్పటం ఈ కధలో గల హాస్యమ్. పద్మ వదిన,అగ్ని పరీక్ష, న్యాయం అనే కధలు వ్రాసారు. ఆంద్ర ప్రదేశ్ సాహిత్య అకాడెమీ కానీ,ప్రభుత్వం కానీవీరి రచనల్లో వీరి హాస్యాన్ని మూట కట్టి దాచడం అవుసరమ్.
శాస్త్రి గారు,శిల్ప సౌందర్యం హాస్యరసం అనే గ్రదాలు వ్రాస్తున్నారు. అవి కూడా త్వరలో వెలువడ కలవు.శాస్త్రి గారు హాస్యరస సింధువు,గొప్ప సాహిత్య బన్ధువు.
ప్రపంచం లోవున్న రసమంతా కలిపితే హాస్యపు విలువకు తక్కువే అవుతున్దిఽన్నరొక రచయిత.శాస్త్రి గారి హాస్యం మనకు అమూల్య సంపద ..
[ఇది మొక్కపాటి వారు జీవించి వుండగా రావూరుగారు వ్రాసిన వ్యాసం,ఆంద్ర ప్రభలో ప్రచురిత మయింది .సంవత్సరం తెలియదు.]

Sunday, February 17, 2013
ఎర్రమబ్బు
ఎర్రమబ్బు
ఎర్రమబ్బుల చాటు మాటున
ఏడు గుర్రాల రధము నెక్కి
సూర్య దేవుడు బయలు దేరాడు.
తూర్పు దిక్కున వెలుగు తోచింది.
ప్రకృతి అంతా సొగసు పరిచింది
ఎంత అందము ప్రకృతి నోదిగెను!
ఎంత గానము ప్రకృతి సాగెను !
పసిడి లేళ్ళ వి పరుగులెత్తెను
చిలుక గుంపులు రెక్కవిసరెను
ఎర్రమబ్బుల చాటు మాటున
ఏడు గుర్రాల రధము నెక్కి
సూర్య దేవుడు బయలు దేరాడు.
తూర్పు దిక్కున వెలుగు తోచింది.
ప్రకృతి అంతా సొగసు పరిచింది
ఎంత అందము ప్రకృతి నోదిగెను!
ఎంత గానము ప్రకృతి సాగెను !
పసిడి లేళ్ళ వి పరుగులెత్తెను
చిలుక గుంపులు రెక్కవిసరెను
Tuesday, January 15, 2013
ఉర్వి-ఉయ్యాల
ఉర్వి -ఉయ్యాల
ఉర్వి యంతా పెద్ద ఉయ్యాల గాగ
తారాధ్వమే తళుకు చాందినీ గాగ
దిశలెల్ల దిగజారు జలతారు తెరలుగా
నాలుగూ ధర్మాలు బలమైన త్రాళ్ళుగా
ఊగుతున్నాడమ్మ ఊగుతున్నాడు
ఉయ్యాలలో స్వామీ ఊగుతున్నాడు
లోకాల పుణ్యమే పులిగోరుకాగా
మునుల స్తోత్రంబులే మొల త్రాడు కాగా
ముజ్జగంబుల సౌరు కాలి గజ్జేలుగా
జ్యోతిర్లతా వళులు చేతి వత్తులుగా
కళ్యాణ గానమే కక్కుటుంగ రమన
ఊగుతున్నా డమ్మ -ఊగుతున్నా డు
తోరంపు ఆత్మలే హారతులు పట్టా
వేదాంత వాసనలు దిశలెల్ల చుట్ట
మూలంపు టమ్మయె ముంగురులు ముట్ట
చైత్రాంగనలె వచ్చి చేక్కిళులు ముట్ట
ఊగుతున్నాడమ్మ ఊగుతున్నాడు
జడదారు లెల్లరు పడతులై వచ్చి
పంతాలతో తొట్టి ప్రక్కలను జేరి
కోటి కోయిల లట్లు గొంతు సవరించి
డోల నే ఊపగా జోలలే పాడగా
ఊగుతున్నా డమ్మ -ఊగుతున్నా డు
అమల మందాకినీ గలగలల ఓలే
ఎందుకయ్యా స్వామీ అన్ని కిలకిలలు
పాపాల కొండ ల్లు పడతన్ను రీతి
ఎందుకయ్యా స్వామీ కాలి సాముల్లు
బంగారు శంఖులో ఉంగ నే తెచ్చి
అల్లదె వచ్చినది అమ్మ యశోద
అందుకా నా స్వామీ అరమోడ్పు కనులు
ఎవరు నేర్పారయ్య ఈ కొంటి పనులు ?
ఉంగ కాదది స్వామీ అమ్మలో బెంగ
పుప్పొడి గంధాలు కుప్ప పడే నవిగొ!
నలుగు పెట్టగ వచ్చే వెలుగైన ఉషసి
పన్నీటి మున్నీరు ప్రవహించే నదిగొ!
బొబ్బ పోయగా వచ్చే తొలిప్రొద్దు కన్నె!
మంద హాసమే కాని, తొందరే లేదు
తొట్టె లోపలే నీకు పట్టమా స్వామీ?
ఉర్వి యంతా పెద్ద ఉయ్యాల గాగ
తారాధ్వమే తళుకు చాందినీ గాగ
దిశలెల్ల దిగజారు జలతారు తెరలుగా
నాలుగూ ధర్మాలు బలమైన త్రాళ్ళుగా
ఊగుతున్నాడమ్మ ఊగుతున్నాడు
ఉయ్యాలలో స్వామీ ఊగుతున్నాడు
లోకాల పుణ్యమే పులిగోరుకాగా
మునుల స్తోత్రంబులే మొల త్రాడు కాగా
ముజ్జగంబుల సౌరు కాలి గజ్జేలుగా
జ్యోతిర్లతా వళులు చేతి వత్తులుగా
కళ్యాణ గానమే కక్కుటుంగ రమన
ఊగుతున్నా డమ్మ -ఊగుతున్నా డు
తోరంపు ఆత్మలే హారతులు పట్టా
వేదాంత వాసనలు దిశలెల్ల చుట్ట
మూలంపు టమ్మయె ముంగురులు ముట్ట
చైత్రాంగనలె వచ్చి చేక్కిళులు ముట్ట
ఊగుతున్నాడమ్మ ఊగుతున్నాడు
జడదారు లెల్లరు పడతులై వచ్చి
పంతాలతో తొట్టి ప్రక్కలను జేరి
కోటి కోయిల లట్లు గొంతు సవరించి
డోల నే ఊపగా జోలలే పాడగా
ఊగుతున్నా డమ్మ -ఊగుతున్నా డు
అమల మందాకినీ గలగలల ఓలే
ఎందుకయ్యా స్వామీ అన్ని కిలకిలలు
పాపాల కొండ ల్లు పడతన్ను రీతి
ఎందుకయ్యా స్వామీ కాలి సాముల్లు
బంగారు శంఖులో ఉంగ నే తెచ్చి
అల్లదె వచ్చినది అమ్మ యశోద
అందుకా నా స్వామీ అరమోడ్పు కనులు
ఎవరు నేర్పారయ్య ఈ కొంటి పనులు ?
ఉంగ కాదది స్వామీ అమ్మలో బెంగ
పుప్పొడి గంధాలు కుప్ప పడే నవిగొ!
నలుగు పెట్టగ వచ్చే వెలుగైన ఉషసి
పన్నీటి మున్నీరు ప్రవహించే నదిగొ!
బొబ్బ పోయగా వచ్చే తొలిప్రొద్దు కన్నె!
మంద హాసమే కాని, తొందరే లేదు
తొట్టె లోపలే నీకు పట్టమా స్వామీ?
Tuesday, January 1, 2013
చిరు చిరు మొగ్గల
చిరు చిరు మొగ్గల
రాధ-చిరు చిరు మొగ్గల చిలి పి తెరలలో
చిటికెలు వేయుచు, చిలిపిగా బ నవ్వుచు
వడి వడిగా వచ్చెను వసంతరాగం
ఎవరి కోసమీ సుమ భోగం !
కృష్ణ -పిల పిల గాలుల పుప్పొడి దోగ
ఈలలు వేయుచు ఎదలను దోచుచు
ఆమని రాత్రుల యామిని రాగా
ఎవరికోసమీ అనురాగం!
రాధ-ఎవరి కోసమీ సుమ భోగం!
కృష్ణ-ఈఅనురాగమ్-ఈ సుమ భోగం !
రాధ -పూల తోటలో-కాలి బాటలో
మురిపించేడు నీ మురళి పాటలో
తూగిన నా ఎద -ఊయెల లూగగా
ఎన్ని నాళ్ళ దీ సహయోగం
కృష్ణ-ఎవరి కోసమీ సుమ భోగం!
యమునా తీరమున మురళి గానమున
కనులరమూయుచు కాలువలు దూ యుచు
మయూరివలె నీ వయారి నాట్యం
ఎవరికోసమాహ్వానము?
రాధ -ఎన్ని నాళ్ళ దీ సహయోగం!
మరచిన తలపులు పరుగిడి రాగా
విరిసిన వలపులు పరువము దోగా
మధుర భావనలు మనసున దోగా
ఎవరి కోసమీ మధుమాసం
కృష్ణ-అంతులేని సహవాసం
రాధా-ఆరిపోని చిరు హాసం
రాధ-చిరు చిరు మొగ్గల చిలి పి తెరలలో
చిటికెలు వేయుచు, చిలిపిగా బ నవ్వుచు
వడి వడిగా వచ్చెను వసంతరాగం
ఎవరి కోసమీ సుమ భోగం !
కృష్ణ -పిల పిల గాలుల పుప్పొడి దోగ
ఈలలు వేయుచు ఎదలను దోచుచు
ఆమని రాత్రుల యామిని రాగా
ఎవరికోసమీ అనురాగం!
రాధ-ఎవరి కోసమీ సుమ భోగం!
కృష్ణ-ఈఅనురాగమ్-ఈ సుమ భోగం !
రాధ -పూల తోటలో-కాలి బాటలో
మురిపించేడు నీ మురళి పాటలో
తూగిన నా ఎద -ఊయెల లూగగా
ఎన్ని నాళ్ళ దీ సహయోగం
కృష్ణ-ఎవరి కోసమీ సుమ భోగం!
యమునా తీరమున మురళి గానమున
కనులరమూయుచు కాలువలు దూ యుచు
మయూరివలె నీ వయారి నాట్యం
ఎవరికోసమాహ్వానము?
రాధ -ఎన్ని నాళ్ళ దీ సహయోగం!
మరచిన తలపులు పరుగిడి రాగా
విరిసిన వలపులు పరువము దోగా
మధుర భావనలు మనసున దోగా
ఎవరి కోసమీ మధుమాసం
కృష్ణ-అంతులేని సహవాసం
రాధా-ఆరిపోని చిరు హాసం
Sunday, September 16, 2012
Monday, September 10, 2012
nagali-nakshatraalu
రేడియో నాటిక నాగలి -నక్షత్రాలు రచన
కీ శే రావూరు వెంకట సత్య నారాయణ రావు
మాధవ్-దివ్య ప్రభాతం శాంతా!
శాంత -బియ్యపు గింజలు స్వామీ !
మా- శుభోదయం శాంతా!
శాం -నిజమేస్వామీ!......ఇంట్లో బియ్యపు గింజలు లేవు......పిల్లలు ఎనిమిదింటికల్లా బడికి వెళ్ళాలి.
మా -ఏం అయిపోయినాయా?డబ్బాలో లేవా?
శాం -డబ్బాలోనా?........అది నాకంటే సిగ్గుపడి కొట్టుకొంటున్నది.అన్నదానానికి హస్తం జాచి నట్లుగా బియ్యంతో నిండి వున్నప్పుడా పాత డబ్బా పకపకలాడుతువుంది........అయిపోయినప్పుడు గిల గిలా కొట్టుకొంటున్నది.
[డబ్బా సందడి]
శాం -అలా చెవులు మూసుకొంటారేం?
మా-ఏం చెయ్యను మరి? ఇటు పిట్టల కల కలారవాలు కమ్మటి గానం వినిపిస్తుంటే,ఆనందంతో వింటున్నాను .......
వెనక ఈ డబ్బాల సంద డి ఏమిటి?
శాం -ఆడబ్బా మన బిడ్డల కోసం తాపత్రయ పడుతోంది.కడుపునిండా అన్నం పెట్టి,చక్కగా ముస్తాబు చేసి బిడ్డల్ని ముద్దులాడుతున్నప్పుడు వారి పకపకల ముందు ఈ పిట్టల కలకలారవాలెంత స్వామీ!
మా-అప్పుడే ఆగిన్డెం డబ్బా!
శాం -ఒకసారి హెచ్చరించింది....వూ రుకొన్ది .మీ భావ లహరికి అడ్డం రావడం దానికి మాత్రం ఇష్టమా?ఇంత సంభాషణ దేనికి? మనకు కావలసింది బియ్యపు గింజలు.......ఈ రోజుకో ఆరు దోసిళ్ళు,ఆరు దోసిళ్ళు......
ఈ రోజుకో ఆరు దోసిళ్ళు మాత్రమె!అంతే! రేపటి మాట ఆ పరమాత్మునికి ఎరుక .అదుగో పెద్దవాడు కదులు తున్నాడు పక్కమీంచి........లేవగానే "అమ్మా! వంట త్వరగా చెయ్యి........లేకపోతె బళ్ళో లేటు మార్కు పడుతున్దంటాడు .
మా-శాంతా పక్కింట్లో పట్రా
శాం- పక్క ఇంట్లోనా?ఇంకా ప్రజలు కంటి తలుపులే తెరవ లేదు,ఇంటి తలుపులెం తెరుస్తారు?ఎవరు బియ్యం కొలిచి నా కొంగులో పోస్తారు?అయినా ఇది మొదటి సారి కాదుగా!
మా-బాధ పడకు శాంతా!.......కొంచెం కూడా బియ్యం పిల్లలకు కూడా సరిపోవా?
శంఉండండి చూచి - వచ్చి చెపుతా ఎన్ని వున్నాయో!
మా-నా జీవిత మంతా నక్షత్రాల వంక చూడడం తోనే సరి పోయింది.కవనాల లోంచి వీచే మలయ పవనాలతోనే జీవితం హాయిగా నడిచి పోతున్దనుకోన్నాను. ఒక్కసారి నేలవంక చూడ లేదు.
శాం- ఇరవై ఆరు,ఇరవై ఏడు,ఇరవై ఎనిమిది ,ఇరవై తొమ్మిది పైన అర ముఫ్ఫయి గింజలకు అర తక్కువ.
మా-ఏం లెక్క అది శాంతా?
శాం- బియ్యపు గింజలు....డబ్బాచుట్టూ పడ్డవి-అంచున అతుక్కున్నవి ఏరి తెచ్చి లేక్కపెడుతున్నాఅర తక్కువ ముఫ్ఫయి .....అక్షింతలకే చాలవు,భక్షణ కేం సరిపోతాయి?
మా-శాంతా! ఈ జ్ఞానోదయం చాలు.....ఇంకా ఎక్కువ చెప్పక్కర్లా....గింజలు లెఖ్ఖ పెట్టి ,పంజరంలో వున్న చిలకను బాకుతో పొడిచినట్లు నా హృదయాన్ని పొడవకు శాంతా!నిత్య జీవితాన్ని అర్ధం చేసు కొంటానిక బియ్యపు గింజల్లో కల జీవ శక్తినే కాదు వేదాంత రహస్యాన్ని కూడా అర్ధం చేసుకొంటాను.శాంతా!ఈ నాటినుంచీ నిత్య జాగారం చేసి ఓగిర సమస్య తే ల్చుకొంటాను.నువ్వు లోపలి వెళ్లి పొయ్యి రాజేసి ఎసరు పెట్టు.......ఎలాగోలా బియ్యం తెస్తాను.బియ్యపు గింజల కోసం మన నేయ్యాన్ని దూరం చేసుకో లేను శాంతీ!
శాం- నేనెప్పుడూ మీ చరణ దాసినే!పసికందుల పోషణ సమస్య.....నన్ను కర్తవ్యతా మూదురాల్ని చేస్తుంది...అలాటి సమయంలో నేను మాట్లాడే మాటలను దూషణలు గా భావించ కండి. ....మీ పాదాలకు నమస్కరిస్తాను.
మా-శాంతా!నీ చిత్త స్థైర్యాన్ని పోగొట్టిన నేరాన్ని అంగీకరిస్తున్నాను.నీ నేత్రాలలో ఇదివరకు విర బూసిన కాంతులు క్రమంగా వెలిసి పోయినందుకు కారణం నేనే!శాంతా!దూరతీరాలనుంచి తరలి వచ్చే ముర్ముర తరంగాలవంటి నీ సన్నటి ఎలుగును మార్చి వేసిన నేరం కూడా నాదే!
శాం-నేరాల మాట దేనికి లెండి.సంతానాన్ని సంతోషంగా పెంచాలేకపోతున్నచింత ఒక్కటితప్ప......నాకేం లోపంవుంది!
మా-వెళ్ళు నిప్పు రాజేసి ఎసరు పెట్టు
శాం- అలాగే!
మా-ఈనాడు అర్ధం చేసుకొన్నాను....జీవిత రహస్యం.ఈ కవిత్వాలకు,కళలకు ,శాస్త్రాలకు, చర్చలకూ,పదవులకూ,ప్రాబల్యానికి వెనుక అసలు వేదాంతం ఒకటి వుంది.అది ఆహారానికి చెందిన వేదాంతం ,అత్యద్భుత వేదాంతం.ఆహార సమస్య తే లందే...విహారాలు లేవు,వినోదాలు లేవు.మానవుడికి అసలు ప్రగతే లేదు.
.......ప్రాబల్యం లేదు...ఆహార సమస్య ప్రప్రధమ సోపానం ...దీన్ని పరిష్క రించే మార్గం చూడాలి ముందు.....ప్రస్తుతం ఈనాటి పరిష్కార మార్గం ఆలోచించాలి.బియ్యం....ఆరు దోసిళ్ళ బియ్యం..ఎలాగోలా సంపాదించాలి .తప్పక సంపాదించి......ఆ....ఉపాయం తట్టింది.ఆకలికి కవిత్వానికి చాలా దూరం.భాషా వైదుష్యానికి జీవిత పోషణకు పొంతన కుదరదు.ఉపాయం దొరికింది....వెళ్లి బియ్యం తేవాలి.
**************************************** తక్కినది రేపు
నాగలి -నక్షత్రాలు రచన
రావూరు
రాయలు-అమ్మా!అమ్మా!
శాం -ఇలా వంటింట్లోకిరా౧
రా- ఓ అప్పుడే వంట చేస్తున్నావే! రోజూ ఇలాచేయ్యమ్మా!చప్పునబడికి వెడతాను.
శాం-అలాగేరా!.......అలాగే! {గాద్గాత్యం తో} నువ్వు ముఖం కడుక్కో .కాసిని పాలున్నాయి తాగుడువుగాని....
రా- నేను ముఖం కడుక్కొని వస్తా..
శాం- పొయ్యిమీద గిన్నె చూచి పొంగి పోయాడు బిడ్డ.....ఎసట్లో బియ్యం ఎక్కడున్నాయో తెలియక కొట్టుకొంటూ న్నానని వాడికేమి తెలుసు? ఆయన సావిట్లో లేరు.........ఆయన కవితా హృదయానికి నేనో కారు మబ్బునయాను.
ఎక్కడికెళ్ళారో ఏమో! ********************
మా-అదికాదు షావుకారుగారూ.. ఇవి చాలా విలువైన గ్రంధాలు...వీటిని వాచస్పత్యా లంటారు...అన్ని మాటలకు అర్దాలుంటాయి దీనిలో......వీటిని మీదగ్గరున్చుకొని నాకో ముఫ్ఫయి దోసిళ్ళ బియ్యమియ్యండి. అయిదురోజులు వస్తాయి.ఎంత అవుతుందో చెప్పండి.తర్వాత సొమ్ము తెచ్చి ఇచ్చి ఈ గ్రంధాలు తీసుకొంటాను.
షావుకారు -వీటినేం అంటారూ?
మా-ఇంగ్లీషులో డి కష్టనరీ లంటారు....
షా -డిక్ష్టనరీలు మాకెందుకు!డి టేక్తివు లయితే చదువుకోడానికి ఇచ్చి రోజుకో పావలా అద్దె సంపాదించు కో వచ్చు.....వడ్డీ అన్నా గిడుతూ ఉంటింది.తూనిక్కి ఇస్తే ఇయ్యి లేకపోతె తీసుకెళ్ళు.
మా-తూనిక్కా?వీటిని చించి పొట్లాలు కడతారా?
షా-అమ్మే వస్తువు మీద ఆరా లెండు కయ్యా?కావాలంటే తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకొని పసుపు,కుంకుమ తో పూజ చెయ్యి....నే వద్దన్నానా!
మా- {బాధతో} నిజమే! అలా చేయ వలసిన గ్రంధాలే ఇవి...లక్ష్మిని రప్పించడం చేత .....సరస్వతిని దూరం చేసుకో వలసి వస్తోంది.అక్షర జ్ఞానం తెలిసిన వాడెవడూ ఇలాటిపని చెయ్యడు.
షా- బాగానే వుంది.....ప్రొద్దున్నే వచ్చి దుకాణం దగ్గర కళ్ళ నీళ్ళే మిటయ్యా?పుస్తకాలు పట్టుకెళ్లు.
ఆరు దోసిళ్ళ బియ్యం ........ఆరు దోసిళ్ళ బియ్యం
మా-శాంతా {అరుస్తాడు}
షా- శాంత ఎవరయ్యా ఇక్కడ? శాంతాలేదు గీంటా లేదు. దిక్కుమాలిన సంత తెచ్చి పెట్టావు దుకాణం దగ్గర .పైగా ఆ పిచ్చి చూపులేమిటి? మతి చెడింది గావునను......అవతల కెళ్ళు బయూ ....కావాలంటే నీకో బీడీ ముక్క ఇస్తాను
మా- తూచుకోండి పుస్తకాలు...ఎన్ని బియ్యం వస్తాయో ఇవ్వండి...త్వరగా ఇవ్వండి.
షా-అలా అన్నావు బాగుంది.రాళ్ళు చూసుకో.....తూకం చూసుకో...దగా మా వంశం లో లేదు.ఓ దమ్మిడీ పోయినా ఇష్టమే!
మా-అత్తలు చిన్చేస్తారేం?
షా-ఏం చేయ్యమన్నావు?అవే అర కిలో వున్నాయి.
ఎందుకు పనికొస్తాయి?ఈగల్ని తోలుకోవాలి...పట్టు చూసుకో పద్నాలుగు అణాలు....బియ్యం పట్టు.
మా-ఈసంచీలో పొయ్యండి..ఎన్ని..
షా-సరిగ్గానే పోస్తున్నా ....ఇంకో చారెడు వేస్తాలేపైన పట్టెడన్నం ఒకళ్ళకి పెట్టమన్నారు పెద్దలు.....పెట్టి చుట్టాలోచ్చారనుకోవాలి.
మా-=ఇవి ఎన్ని దోసిళ్ళ వుతాయ్ ?
షా-ఇంటికి పట్టుకెళ్లు పెద్ద పళ్ళెంలో పోసి లెక్కపెడుతూ మీడంపతులు తలంబ్రాలోసుకు చూడండి ...లెక్క చూసుకోవచ్చు.చక్కగా సంబరాలు పడొచ్చు.
మా-తలంబ్రాలు సంబరాలు "సిరిలేనివాడా!సిగ్గుపడతానికికూడా సిగ్గు పడతా వెందుకు''?అంటుంది సంఘం
షా-కవిత్వంలాగా వుండే!...ఇంకేం?నీబోటి వాళ్లకు నిత్య కళ్యాణ మేలే ....వెళ్ళు .
మా-పచ్చ తోరణం మాట మరిచిపోయారేం?
*************************
నాగలి-నక్షత్రాలు రచన -రావూరు
{౩} {ఒక బియ్యం ఫాక్టరీ కూస్తుంది బిగ్గరగా....లారీల హారన్లు మ్రోగుతూ వుంటాయి .పదేళ్ళ పిల్ల గావురుమని ఏడుస్తూ వుంటుంది.}
ఒక వ్యక్తి - ఏమిటమ్మా! బియ్యం ఒలకబోసుకోన్నావుగా!అయ్యో! అన్నీ బురదలో కూడా పడిపోయాయి.
పిల్ల-బియ్యం....బియ్యం...{ఏడుస్తుంది}
లారీల హారన్
డ్రైవర్ -తప్పుకోండి......తవ్వెడు బియ్యానికేమిటా గోల! తప్పుకొండిలారీ వెళ్ళాలి.
వ్య-డ్రైవరు గారూ!తవ్వెడు బియ్యం ఎక్కడి నుంచి వస్తాయి బీద వాళ్లకి?......అవి ఒక పూట రెండు మూడు
ప్రాణాలు నిల బెడతాయి.
డ్రై-సరేలే! తప్పుకొండయ్యా! ఎనిమిది ట్రిప్పులు తిరగాలి ,ఎనిమిది వేల బస్తా రవాణా ఈ వారం లో
హారన్ కొడుతూ వుంటాడు.
మరో వ్యక్తీ -ఎనిమిది వేల బస్తాల రవాణా!ఇక్కడ బీద కొంపల్లో తవ్వెడు బియ్యానికి లేదు గతి .
పిల్ల-నాబియ్యం ....నా బియ్యం........అమ్మ నన్ను కొట్టి చంపుతుంది.
వ్య -ఏడవకు తల్లీ!ఎలాగో అలా నేను బియ్యం తెచ్చి ఇస్తాలే! ఏడవకు.
మవ్య- దగ్గరలో బియ్యం షా పులన్నా లేవు.ఫాక్టరీ ఆయన్ని అడుగుదామొక శే రు బియ్యం ఇస్తాడేమో !
వ్య -పద .....
మా వ్య -ఏమండీ!పాపం ఆ అమ్మాయి బియ్యం బురదలో పోసుకుంది .ఒక శేరు బియ్యం ఇవ్వండి ఏడుస్తోంది.
యజమాని-ఏడిస్తే బియ్యం వస్తాయా?కన్నీళ్ళతో కష్టాలు గడుస్తాయా? మేమూ చాలా కష్టాల్లో వున్నాం .
మొన్న అరవై బస్తాల బియ్యం ముక్కి పోయినాయని అవి తింటే ప్రజలకు జబ్బులోస్తాయని ఆఫీసరు గారు తగుల బెట్టించారు.
వ్య- బస్తాల లెఖ్ఖ దేనికయ్యా?ఒక్క శేరు బియ్యం పొయ్యి......ఎసంచీ చాటు నైనా వుంటాయి.......నీకు పుణ్యం వుంటుంది.
య-పుణ్యమా? పుణ్యానికి పొతే పెళ్ళాం మెళ్ళో పుస్తెలు కూడా మిగలవు.ఇవి బియ్యమయ్యా బియ్యం ......ఇసక కాదు.
వ్య-ఇంత కష్టం గా మాట్లాడుతున్నావే! పోనీ డబ్బులిస్తాం .
య-వుంచు వుంచు లేకపోతె ముడుపు కట్టు.....
మా వ్య-తిరిగి తిరిగి మిల్లు చక్రాలన్నా అరుగుతాయి కాని వీళ్ళ మనసులు కరగవు .కొని ఇద్దాం రండి.
పిల్ల-అ మ్మా[ఏడుస్తుంది]
అమ్మ- ఏమిటే! అలా ఏడుస్తున్నావు?
ఫై-బియ్యం బురదలో.....
అ -ఓసి నీదుంప తెగా!.....నోటికాడ బియ్యం బురదలో పోశా వుటే![రెండు కొడుతుంది,పిల్ల గావురుమని ఏడుస్తుంది.]
అ- ఎరక్కపోయి నిన్ను పంపానే!ఎసట్లో పోద్దామని ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నా.ఇంత అన్నం తిని రిక్షా వేసుకు పోతానని మీ అయ్యా కూర్చున్నాడు.తిని పనిలోకి వెడదామని నీ అన్న కూర్చున్నాడు.దిక్కుమాలిన దానా!నోతోకాడ కూడు తీసావుటే!.......[ఇంకో రెండు కొడుతుంది,పిల్ల గోల పెట్టి ఏడుస్తుంది.]
మాధవ్ -ఎందుకమ్మా అలా కోడతావ్?
అ -కొట్టాలా-చీల్చాలా?బియ్యం బురదలో పోసింది.గింజ దొరక్క గిజగిజలాడే రోజులు .
మా-పోయ్యాలని పోస్తుండా!ఏదో చిన్నతనం...
అ-చిన్నతన మేమిటి?అది మాత్రం అన్నం తినడంలా!బియ్యం విలువ తెలియద్దూ!
మా-తినేవాల్లందరికి తెలుస్తుందాఅమ్మా?నేను నలభై ఎల్ల నుంచి తింటున్నానుఇవాళే తెలిసిందివాటి విలువ.నా సంచీలో బియ్యం వున్నాయి.....కొన్ని తీసుకో అమ్మా!ఆ అమ్మాయిని కొట్టకు.
[అన్నపూర్ణ కావిడి గంటలు మొగి స్తూఒక బిక్షకుడు వస్తాడు.]
బిక్షువు-అయ్యా! మీరాగండి......నా అన్నపూర్ణ కావిడిలో బియ్యం వున్నాయి.....ఇవి పోస్తాను ఆ తల్లికి ....మీరు చూస్తే పిల్లలుగల తండ్రి లాగా వున్నారు.మీరవి ఇంటికి తీసుకెళ్లండి.
మా-నువ్వు ఇంటింటికి తిరిగి సంపాదించుకొని వుంతావవి.మళ్ళీ ఎక్కడ తిరగ్గలావ్?
బి-నే పుట్టింది తిరగాడానికే! ఇంటింటికి ఇన్ని బియ్యపు గింజలు,ఇంటింటిముండు దీవెనల గంటలు.......నా అన్నపూర్ణ కావిడి అక్షయం గా వుంటోంది ఇంత వరకు.పది గుమ్మాలకొక గుమ్మంలో నయినా దాన హస్తాలు ముందుకు సాగుతూనే వున్నాయ్.మరేం ఫరవాలేదు.నా బియ్యం పోస్తాను ఇదుగో అమ్మా తీసుకో![ఫాక్టరీ కూస్తుంది బిగ్గరగా]
మా వ్య -ఆ యజమానికన్నా ఈ సాదువులో ఎక్కువ త్యాగం వుంది.సిరి ఎక్కువయిన కొద్దీ త్యాగం తరుగుతున్దంటారు పెద్దలు.
బి- ఇందులో త్యాగామేముంది బాబూ!పది ఇళ్ళ దానం.ఈ పుణ్యమా తల్లులకు దక్కుతుంది.
పి-తాతా!తాతా!
బి-నా కాళ్ళకు మొక్కుతావు దేనికితల్లీ!నే చేసింది ఏముందీ!కాసిని బియ్యపు గిజలు.....లే తల్లీ!
మా-తాతా!కాసిని బియ్యపు గింజలు అంటున్నావ్ !వాటిలో ఎంత జీవ శక్తి వుంది?ఎంత వేదాంతం దాగివుంది?
ఈ రోజే ఆ పరి శీలన ప్రారంభించాను.కాసిని బియ్యపు గింజలు......లోక కళ్యాణ మంతా వెతిలోనే వుంది.
అ-తాతా!నీ బియ్యం తీసుకో ....నేను కోపం తో బిడ్డను కొట్టాను.దరిద్రం లో వున్నా బాధ అది తాతా!....నీ బియ్యం నువ్వు తీసుకో!
బి-అదేమిటమ్మా!నా బియ్యమేమిటి?నీ బియ్యమేమిటి?ఆ బియ్యం అవుసరం వున్నవి.నాకు తొందర లేదు.తీసుకెళ్ళు....నా కూతురు లాటి దానివి.
[ఫాక్టరీ కూత పెడుతుంది.]
బి-వీధి వీధినా ఫాక్టరీలు కూత పెట్టాలి.ఇంటింటా బియ్యం కుప్పలు పడాలి.
[గంట మ్రోగిస్తూ వెళ్లి పోతాడు.]
[4 నాగలి -నక్షత్రాలు రచన-రావూరు
aమా- శాంతా!ఇవుగో బియ్యం ....త్వరగా అన్నం వండు.
శాం-ఎలాతెచ్చారో! మిమ్మల్ని తిప్పలు పెడుతున్నాను.
మా-కాదు...కాదు....దారిలో పెడుతున్నావు.తరవాత మాట్లాడదాం,త్వరగా వంట చెయ్యి.
శీను-నాన్నగారూ..
మా-ఏమిటి బాబూ!
శీ -అమ్మకానికి పర్యాయపదమేమిటి!
మా-అమ్మకానికా!పర్యాయ పదమా?
శీ- లేదాండీ ....
మా-ఉన్నాయ్.విక్రయం ,ఆత్మ హత్య
శీ-ఆత్మ హత్య కూడావుందా నాన్నగారూ!
కొన్నికొన్ని సందర్భాలలో నాయనా!ఆత్మ ధనాన్ని అమ్ముకొన్నపుడు అది ఆత్మ హత్యే అవుతుంది.....అయినా ఈమాట నీకు వద్దులే!
శీ-వ్యధ అంటే ఏమిటి నాన్నగారూ?
మా-వ్యధ అంటే వేదన నాయనా,మనో వేదన
శీ-ఏమిటి నాన్నగారూ అంత బాధ పడుతున్నారు ఇవాళ? పత్రికకి పంపిన వ్యాసం ఏదైనా తిరిగి వచ్చిందా?
మా-లేదునాయానా వ్యాసం తిరిగిరాలేదు.......గ్రాసవాసో దైన్యత్వం లోచిక్కిన జీవి మనో వేదన నాయనా [తెప్పరిల్లి]శీనూ వ్యాసాల సంగతి,గ్రాసాల సంగతి నీకెందుకులే గాని..... చక్కగా స్నానం చేసి, అన్నం తిని బడికేల్లిపో నాయనా
శీ-అలాగే నాన్నగారూ!వెడుతున్నా.
మా-దోసెడు బియ్యం[బయటనుంచి మాధవరావుగారూ అనికేక]
మా-ఎవరూ? రండి రండి....గోపాలం గారా !
గోపాలం -నేనే!ఉంటారో లేదో అనుకొంటూ వచ్చా!ఒకటే అనుమానం నాకు మాధవరావుగారూ-ప్రతిదానికీ అనుమానమే!
మా-అసలు బ్రతుకే అనుమానం ....అందులో అనేక రకాల అవమానాలు {నవ్వుతాడు]
గో-కవులుమీరు,మాల గుచ్చినట్లు మాట్లాడుతారు.....మాకలారావుమాటలు .
మా-మీరు శాస్త్రజ్ఞులు లోకానుభవం కలవారు.అనేక సత్యాలు సూత్రా ప్రాయం గా తెలుసు మీకు.
గో-వాటిలో ఏంటో సంతృప్తి వున్నా మాట నిజమే!కానీ దేశం సుభిక్షం గా లేదన్నచింత తప్పడం లేదు.
ముఖ్యం గా పంటల మాట ఆలోచించండి.
మా-ప్రస్తుతం నేను వారి పంటను గూర్చి పరిశోధన చేయ తలిచాను.ఆహారం తర్వాతనే అన్ని సమస్యలు .ఏనాడు పుట్టిందో వరిపంట.
గో-వేదకాలం నుంచి వుంది పురాణాల్లో వుంది.ఆ కాలం లో రాజులు, ఋషులు వ్యవసాయం చేసేవారు.జనక మహర్షి గొప్ప రైతు,వసిష్టుడూ నాగలి చేత పట్టాడుట.ఎన్ని పదవులున్నా,ఎంత అధికారం వున్నా,భూదేవిని కొలవడంలో వున్నా శాంతి మరో దాంట్లో లేదు మాధవరావుగారూ.
మా-ప్రతి వ్యక్తీ వ్యవసాయం చేయ్యాలంటారా?
గో-స్వయం సమృద్ధి అనే విషయం మీద నీనొక గ్రంధం వ్రాస్తున్నాను.అందులో పోతనగారి మీద పది పద్యాలు కావలిసి మీదగ్గరకోచ్చాను.ఈనాటి ప్రపంచానికి ఆయన ఆదర్శ మూర్తి.భూదేవిని ఆశ్రయించి ,జీవితానికి కావలసిన ప్రశాంతిని సంపాదించి ,ఆ ప్రశాంతత లోనుంచి పవిత్రమైన కవిత్వం వ్రాసి పునీతుడయాడు
మా-అవును...ఆహారం కోసం పరుల నాశ్రయించ వలసి వస్తే ఆయన ఆ పరమ పవిత్ర మైన భాగవతాన్ని అనువదించ కలిగే వారు కాదు.అనువదించినా ఆ కవిత్వమలా అమల మందాకినీ ప్రవాహంలాగా వచ్చి వుండేది కాదు.
గో-మనమేనని విద్యలు నేర్చినా ,ఎంత విజ్ఞానం సంపాదించినా ...కడుపు నింపుకొన్న తర్వాతనే వాటి సోంపు తెలిసేది.వాయుభక్షణ,జలభాక్షణతో జీవిన్చాలెం మనం .వినండి ఒక జానపద గేయం లో ఎం వుందో....
పాతొడ్లు దంచాను
బానలో పోసాను
కొత్తోడ్లు దంచాను
కుండలో పోసాను
అటుకుల్లు దంచాను
అటికలో పోసాను
ఎపొద్దు లెటుపొతే
నాకేమీ!
ఏ సుద్దు లెటు చెపుతే
నా కేమీ!
గిన్నెల్లో అన్నమ్ము
వెన్నెల్లో విందులు
ఎన్నెన్ని పకపకలో
ఎన్నెన్ని చక చకలో
మా-గోపాలం గారూ....గొప్ప పాత వినిపించారు.జీవిత ధర్మం అంటా అందులో ఇమిడి వుంది. నిత్యం ఆహారాన్వేషణ కోసం బయలుదేరే జీవులకి ఎం స్థిమితం వుంటుంది?"గిన్నెల్లో అన్నమ్ము,వెన్నెల్లో విందులు,ఎన్నెన్ని పకపకలో, ఎన్నెన్ని చక చకలో"అలాటి జీవితం కావాలి గోపాలంగారూ!
గో-కావాలంటే ఎందుకురాదూ? నా ఆశయం చెప్పమన్నారా?ప్రతి కుటుంబం కనీసం అయిదెకరాల వ్యవసాయం చేయాలి.అక్కడితో బియ్యపు గింజలు వెతుక్కోవడమనే సమస్య తీరుతుంది.
శీ-నానా అన్నం తిన్నాను...క్యారియర్ తీసుకు బడికి వెడుతున్నాను.
మా-మంచిది బాబూ బళ్ళో అన్నం పారేయ్యకున్డాతిను.
శీ- పారేయ్యను నాన్నగారూ .....అమ్మచెప్పింది......పిల్లల్ని పెంచేది అమ్మా,నాన్నా కాదు అన్నమేఅని.
గో-అమ్మా,నాన్నలిని పెంచింది ,పెంచేది కూడా అన్నమే!....ఈ విషయమే మాట్లాడుతున్నాం.
మా-నువ్వు వెళ్లిరా నాన్నా!గపాలం గారు ఏదో చెపుతున్నారు.
గో-ప్రతి కుటుంబానికి ఇల్లెంత అవుసరమో పొలం కూడా అంటే అవుసరం.కుటుంబం లో కనీసం ఒక్కదయినా వ్యవసాయం చేయాలిందరికీ సరిపోయే ధాన్యం పండించాలి."నాలుగెకరాల పొలం ,నట్ట నడుమ ఒకపాక" ఇది నా స్వప్నం.
మా-అలాటి అదృష్టం నా బోటి వాళ్లకు పడుతున్దంటారా?
గో-మీబోటి కవులు "సుజలాం,సుఫలాం.అంటూ ముందుగా దిగాలి రంగం లోకి.భూమాత లోగల కరుణను ,ప్రకృతిలో గల ఆనందాన్ని మీరనుభావించ లేకపోతె ఎవరనుభ విస్తారు? నాగలి చేత పట్టాలి.....నవ్వుతూ పొలం దున్నాలి.....అలాటి అపర పోతనాలు ఎందఱో కావాలి మనకు.
మా-నేను వ్యవసాయం చెయ్యాలంటే కౌలుకి భూమి దొరుకుతుందా?ఎవరేనా ఇస్తారా?
గో-ప్రస్తుతం నేనిప్పిస్తాను.రామా పురంలో దాసు తాత అనే రైతు వున్నాడు.అతనికి చాలా పొలం వుంది.మీబోటి కొత్త రైతుల్ని పిలిపించి పొలం కౌలుకి ఇస్తాడు.వ్యవసాయం స్వయం గా దగ్గర వుండి నేర్పుతున్నాడు.
మా- తప్పక వెడతాను.
గో-పోతన గారి మీద పద్యాలు వ్రాసి ఇచ్చి వెళ్ళండి.మీకూ కొంత ఉత్సాహం వస్తుంది.అన్నట్లు మీరు తరవాత ప్రభుత్వానికి అర్జీ పెట్టుకొంటే భూమి వారే ఇస్తారు.ప్రస్తుతం వ్యవసాయానికి ఋణం ఇస్తారు.
మా-గోపాలం గారూ!మీరు నాకు అలాటి సహాయం చెయ్యాలి.మీ ఎదుట ప్రమాణం చేస్తున్నాను.నేను తప్పకుండా రైతునవుతానని.
గో-మీరు వెళ్ళిన తరువాత మరికొందర్ని కూదాపిలిపించి తీసుకు వెళ్ళండి.
మా-తప్పకుండా!పోతన మీది పద్యాలు కావాలన్నారు కదూ!ఒక్కటి ఆశువుగా చెప్తాను.తక్కినవి తర్వాత వ్రాసి పంపుతాను.
మా-పంట పోలమ్ములోఎడద
పండిన,నిండిన,భక్తీ భావముల్
మింటిని తాకగా,హలము
మేదిని దూయుచు,పోయు కొండ్రల న్
జంటగా కిన్నె రాంగనలు
స్వాగత గీతము లాల పింపగా
పంట వలన్తి చిర్నగవు
పండెను,పోతన గుండె నిండగాన్
గో- చాలా బాగుంది.మీగుండే కూడా ఆ ధాన్య లక్ష్మి చిర్నగవుతో నిండాలి.మీరు తప్పక వెళ్లి దాసు తాతను కలుసుకోండి.
మా-అలానే!నాలుగెకరాలడుగుతాను.నడుమనో మంచె వేసుకొంటాను.హలాన్నీ,కాలాన్నీ నడిపిస్తాను.ఆహార సమస్య తీర్చుకొంటాను.
గో-మంచిది. నేను రేపు కనిపిస్తాను.
*************************[ఇంకావుంది]
. నాగలి-నక్షత్రాలు.
రచన -రావూరు
దాసు-ఈ కొబ్బరి నీళ్ళు తాగండి మాధవరావుగారూ!ఆ గట్టు మీద చెట్లు ఆరూ గంగా ఫలాలే!ఆ మూడు మామిడి చెట్లు రసాలు.చివురాకు నమిలితేనే చెడ్డతీపి . .......ఇంకో బోళ్ళం కొట్టమన్నారా
మా-చాలు దాసు తాతా!ఏంటో తియ్యగా వుందీ నారికేళ తీర్ధం.మీ ఆతిధ్యానికి ఏంటో సంతోషం .
దా-మా ఆతిధ్య మేమిటి?ఇదంతా భూదేవి ఆతిధ్యం.ఆతల్లి కడుపు చలవ. తన సంతానాన్ని సంతోషం గా పెంచాలని ఆ తల్లి ఎన్ని తంటాలు పడుతుందో చెప్పలేం .మొక్క నువ్వు పాటు తక్కిన పోషణ అంటా నేను చూసుకొంతానీక్కావలసిన ఫల సాయమిస్తా ను అంటుందా తల్లి .మొక్కేయ్యడం చేతకాక,మొక్కడం చేతకాక బీద వాళ్ళం అయిపోతే ఆ తల్లెం చేస్తుంది."అడగందే అమ్మయినా పెట్టదనే"శాస్త్రం,అసలు భూదేవి నుంచే వచ్చిందంటారు. మీరు కవులన్నారు,నేనేదో చెప్పేస్తున్నా మార్చే దేమన్నా వుంటే మార్చండి.
మా-ఎంత మాట దాసుతాతా! నువ్వు మాట్లాడే ప్రతి మాటలో కవిత్వం వుంది. అద్భుత మైన కవిత్వం.గ్రామాలింత సుందరం గా ఉంటాయనీ ,ఇక్కడ ఇంట ఆతిధ్యం ఉంటుందనీ తెలియదు.
దా-నిజమే మాధవరావుగారూ!మంచి గ్రామం వంచిన పళ్ళ కొమ్మ లాటిది.చాలా మందికి గ్రామాలంటే అభిమానం పోయింది.అందువల్ల ఇలా మ్రోడులయిపోతున్నాయి.మీబోతివారు చేరితే మళ్ళీ చిగురిస్తుంది.
"చిగిర్చిన చెట్టుమీద వగలమారి కోయిలా!వచ్చే పోయే వారిమీద విసరకే నీపాట రాయిలా"అంటారు ఇక్కది పెద్దలు.అంటే ఏమిటో తెలుసా?మీకు తెలియ కుండా ఉంటుందా?కవులన్నారుకదా!
మా-ఆ మాట నిజమే కానీ ......అసలు నువ్వు చెప్పే అర్ధమేమిటో తెలుసుకోవాలని వుందితాటా!
దా- మా అర్ధం చెప్పమన్నారా?చెట్టు చిగిరిస్తే వగలమారి కోయిల పాటలువిసురుతుంది. ఆపాట వూళ్ళో కాపుర ముండే వాళ్లకి ఉషారుగానే వుంటుంది.అందుకని దాన్ని రెట్టించి పాత కచ్చేరీ పెట్టిస్తారు.పోరుగూరునుంచి దారిన పోయే వాళ్లకి చెడ్డ చిక్కుగా వుంటుంది.తెలిసిందా బాబూ!ఇంతకీ నే చెప్ప
వచ్చిందేమిటంటే వూరు బాగుపడితే చాలదు. వూళ్ళో వుండాలి.దానిలో వున్నా సంతోషం అంటా పంచుకోవాలి. చాలా మంది పొలాలు కొంటారు ......మేం బస్తీల్లో వుంటాం అంటారు......అలాటి వాళ్ళు రైతు లనిపించుకోరు బాబూ!.....రాజులనిపించుకొంటారు తెలిసిందా?
మా-తెలిసింది తాతా! రాజుకీ రైతుకీ చాలా తేడావుంది......రైతు అనుభవించే సుఖం రాజెం అనుభవిస్తాడు?
డా-అంతేమరి....ఈ నాలుగెకరాలు మీకిస్తాను,,,ఈ చెట్లన్నీ మీవే.....గట్టుమీద పాదులెట్టు కొంటారో ,పశువులకు పసరికే పెంచు కొంటారో....అంతా మీ ఇష్టం ,మీకేప్పుడే అవుసరం వచ్చినా నన్ను పిలవండి. ..ఒక ఏడాది గడిస్తే మీరే నాకు నేర్పుతారు వ్యవసాయం ......మాట చాలా?కాగితం కావాలా?
మా-తాతా!కాగితమా!అంట మాట అనకు,నీ మాట కోటి విలువ .కొద్దిరోజుల్లో వచ్చి కాపురం పెడతాను.
తాత- ముందు ఊళ్ళోకి రండి.ఒక నెల దాకా మిమ్మల్ని ఇంట్లో వుండనియ్యము.[తాత నవ్వుతాడు]
మా- ఎందుకని?
దా-ఎవరైనా కొత్తగా ఊళ్ళోకి వస్తే తలోరోజు భోజనానికి పిలవందే వదల్రిక్కడ.అది ఆచారం .ఆనెలా మీ ఇల్లు విడిదే !
మా-అన్నిరోజులు ఆతిధ్యమా?నింపాలి'అని.
మా-అలాగాతాతా బాగుంది నువ్వు చెప్పిన మాట. తాతా!ఇలాటి ఆచారాలన్నీ నువ్వు చెపుతూ వుండాలి.నువ్వే నా గురువు.
దా- [పకపక నవ్వి]ఒక కవిగారికి గురువు నయ్యా నాన్న మాట!ఓ!ఎన్నో ఆచారాలు చెపుతా.ఎన్నెన్నో చెపుతా.సామెతలు చెప్తా,సరసాలు చెప్తా,తిన్నగావిని, తీరుగా ఆలోచస్తా నంటే.
మా-అలాగే తాతా !
దా-రాబడి తిరిగొ ద్దం గట్టు వెంట.ఆ! పాల పిట్ట ఎగిరింది మన తల మీదుగా మంచి ముహూర్తం.
మా- పాల పిట్ట ఎగిరితే మంచిదా తాతా!
దా-ఇంకా అడుగుతారేమిటి?ఏంటో మంచిది..పంట కోసం బయలుదేరే వాళ్ళ పైన పాల పిట్ట ఎఅగారాలి.ప్రేమకోసం బయలు దేరి వెళ్ళే వాళ్ళ పై రామ చిలుక ఎగరాలి.సిరి కోసం బయలు దేరే వాళ్ళ ముందుగా నక్క పరుగెత్తాలి....చాలా వున్నాయి రండి.ప్రదక్షిణం చేద్దాం..
*****************************
[గుళ్ళో గంటలు మ్రోగుతూ వుంటాయి.లోపల మంత్రాలు వినిపిస్తూ వుంటాయి.]
దా-రండి,ఇది మా వెంకటేశ్వర స్వామీ గుడి.ప్రదక్షిణం చెయ్యండి.
మా-అలాగే శాంతా...శీనూ రండి.
ఒక రైతు -మంచి అకవిత....వ్యవసాయం మీద మనసు తిరిగిందిట.మన వూరు వచ్చేసాడు.
మరో రైతు-దాసు తాత ఉన్నాడుగా! ఎంతమంది నైనా రప్పిస్తాడు.
ఇంకోరైతు-మన వూరు గొప్పదైపోవాలి.
మా-రండి లోపలోకి వెడదాం.[గంటల చప్పుడు]
శాంత-ప్రభూ!ఏడుకొండల వాడా!నీదే భారం.
మా- మాకాధారం నీవే ప్రభూ!
[గంటల మ్రోతలు]
దా-ఈ ఇల్లు మీకోసం ఏర్పాటు చేసాం.వసతులన్నీ వున్నాయి.ఇవ్వాళ మీరందరూ మా ఇంటికి రావాలి.
మరొకరు-రేపు మా ఇంటికి
మరొకరు -ఆ మర్నాడు మా ఇంటికి.
దా-ఆ మర్నాటికి ఎవరూ పిలవక్కర్లా...గుళ్ళో సంతర్పణ ......ఆ రోజుకు అక్కడే మాధవయ్యగారూ!
షా-తాతా! నువ్వు గుడికి ధర్మ కర్తవా?
దా-ఆ గుడికి అంటే రాళ్ళకు....మనందరికీ ధర్మ కర్త అక్కడున్నాడు.నరుడు,అందులో నావంటి వాడెం ధర్మ కర్త తల్లీ!
మా-ఈ తాత మనబోటి వాళ్లకు జీవన దాత.రేపటినుంచీ హలం పట్టి పొలం దున్నటా.పిల్లల కంచాలలో కి మల్లెపువ్వుల లాటి బియ్యం పండిస్తా.నాగలి-నక్షత్రాలు.నాగలి చాలులో నే నక్షత్రాలు మొలిపిస్తా
దా-ఎన్నిరోజులు...ఇంటికో రోజు !మరి దీంట్లో ఒక తమాషా లేదూ మీతో వూరందరికీ పరిచయం కావాలికదా!అందరూ వచ్చి మీ ఇంటిమీద పడకుండా వుంటారు.....ఎవరింటికి వెళ్ళినపుడు వారితో పరిచయం చేసుకోవచ్చు.కలుపు మొక్కలుంటే ఏరేసుకో వచ్చు ....ఇది ఈనాటి ఆచారం కాదు...మన దేశం లో ఆచారాలు పుట్టి ఊళ్ళు తరవాత పుట్టాయి.ఈ సంగతి తెలియక చాలా మంది ఆచారాల్ని ఎక్కిరించి ఎండు పుల్ల లాగా త్రుంచి అవతల పారేస్తున్నారు.
మా- మంచి మాట చెప్పావుతాతా.మీ ఆచారాలన్నిటినీ శిరసా వహిస్తాను.జీవితాన్ని మీ పద్ధతి లోనే మలుచుకొంటాను.
దా-మంచిది బాబూ!మీరు కవులన్నారు గనుక గ్రామంలో వాళ్లకి మన ఆచారాల మీద,పైరుల మీదా,పంటల మీదా,మంచిమంచి పాటలు వ్రాసి ఇవ్వండి.అందరి చేతా పాదిద్దాం.వూళ్ళో,గుళ్ళో,చేను గట్టు మీదా,చెరువు దిబ్బమేదాఎక్కద పడితే అక్కడ మనకు పాటలు వినిపించాలి.
మా--అలాగే తాతా!పోతన్నగార్ని తలుచుకొని చేత నైనంత కవిత్వం వ్రాస్తాను
దా-[నవ్వి]ఈ కాలానికి మీరే పోతన్నగారు.మరి వెడదాం ఊళ్ళోకి ....నాలుగెకరాల చుట్టూ ఒకసారి తిరిగి వెడదాం ...రైతు రోజూ అలా పంట పొలానికి ప్రదక్షిణ చేయాలి....అప్పుడు భూమాత అనుకొంటుంది"నన్ను నమ్ముకొన్న నరుణ్ణి సంతోష పెట్టాలి,వడ్ల గంపలతో అతని కొంప
నింపాలి అనుకొంటుంది.
మా-అలాగా తాతా !నువ్వు చెప్పిన మాట.ఇలాటి ఆచారాలన్నీ నువ్వు చెపుతూ వుండాలి.నువ్వే నా గురువు.
దా-అలాగే