Wednesday, November 12, 2014

చిన్ని చెంచు గేయం

           చిన్ని చెంచు     గేయం 
 ఎచటనే! ఎచటనే!
 ఎచటనే నా  చిన్ని చెంచు 
ఎందు దాగున్నావో 
ఎరిగింపవా  సుంత ..... 

మునిమాపు నీరెండ 
ముసుగుతాల్చిన సంధ్య 
కెదురెదురు  పరువెత్తి 
వేదికినానే నిన్ను ..... 

వనమెల్లా కన్నుగా 
మనసెల్ల నిన్నుగా 
సిరికన్న  మిన్నగా 
వెతికినానే నిన్ను ....
నా చిన్ని చెంచు .... 

జతగోరి ఒంటిని 
నిలిచినానే చెంచు 
చెంచు పల్లియ దరికి 
చేర వచ్చిన వేళ 
ఒరులు చూడక నన్ను 
కురుల గప్పిన ప్రేమ 
కరువాయె నా నేడు !

పోక మ్రానులనీడ 
టేకు ఆకుల లోన 
వెదురు పరమాన్నము 
వడ్డించి తినిపించు 
వలపు లేమాయెనే!

సెలయేటి దరిచేరి 
కనుసన్నలను  గీటి 
కలువ దొప్పల లోన 
ఇప్ప పూవులా తేనె 
దాహమిచ్చిన నాటి 
దయనేల మరచితే!

చెంచీత నవ్వులో 
మంచి ముత్తెపు వాన 
కురిసి వెలిసిన నాడు 
సరిరావు వెన్నెలలు 
సరిరావు సరిరావు 
సురలోక భోగాలు 

No comments:

Post a Comment