Sunday, April 3, 2016

కళాప్రపూర్ణ బిరుదు

   అంధ్ర  విశ్వ విద్యలయం వారు కళా ప్రపూర్ణ   బిరుదు ప్రదానం చెసి నప్పటి  సభలో శ్రీ రావురు వెంకట సత్యనారాయణ రావు  గారు.తదితర ప్రముఖులు  

Wednesday, November 12, 2014

చిన్ని చెంచు గేయం

           చిన్ని చెంచు     గేయం 
 ఎచటనే! ఎచటనే!
 ఎచటనే నా  చిన్ని చెంచు 
ఎందు దాగున్నావో 
ఎరిగింపవా  సుంత ..... 

మునిమాపు నీరెండ 
ముసుగుతాల్చిన సంధ్య 
కెదురెదురు  పరువెత్తి 
వేదికినానే నిన్ను ..... 

వనమెల్లా కన్నుగా 
మనసెల్ల నిన్నుగా 
సిరికన్న  మిన్నగా 
వెతికినానే నిన్ను ....
నా చిన్ని చెంచు .... 

జతగోరి ఒంటిని 
నిలిచినానే చెంచు 
చెంచు పల్లియ దరికి 
చేర వచ్చిన వేళ 
ఒరులు చూడక నన్ను 
కురుల గప్పిన ప్రేమ 
కరువాయె నా నేడు !

పోక మ్రానులనీడ 
టేకు ఆకుల లోన 
వెదురు పరమాన్నము 
వడ్డించి తినిపించు 
వలపు లేమాయెనే!

సెలయేటి దరిచేరి 
కనుసన్నలను  గీటి 
కలువ దొప్పల లోన 
ఇప్ప పూవులా తేనె 
దాహమిచ్చిన నాటి 
దయనేల మరచితే!

చెంచీత నవ్వులో 
మంచి ముత్తెపు వాన 
కురిసి వెలిసిన నాడు 
సరిరావు వెన్నెలలు 
సరిరావు సరిరావు 
సురలోక భోగాలు 

Monday, November 10, 2014

దోసెడు మల్లె మొగ్గలు

               దోసెడు మల్లె మొగ్గలు

             రావూరు రచన ఈ   క్రింది   లింక్  లో    చదవండి .

  http://tatavarty.com/gprasuna/Story_Dosedu%20Mallemoggalu.pdf

Sunday, November 9, 2014

వడగళ్ళు

             వడగళ్ళు                         రచన -రావూరు
            ఆమధ్య    ఎక్కడో చదివాను    ఒక జంట మొదటి రాత్రే   తగవు లాడుకొని   విడాకు  లిచ్చుకొన్నారని. "ఆదిలో   ఆనందం   పోయిన కొద్దీ  పోరు-అంతానికి   అంతులేని   వైరం. "అనే  సామెత వుంది మనకి. పైన చెప్పిన జంట ఈసామెతను కూడా  రూపు మాపి వేసారు.
          నిజానికి  ఆదిలో  ఆనందం  అనేది  అనుభవించ వలసిన  సుఖం. కొత్తలో దంపతులేమిటి,స్నేహితులేమిటి,పాలు పోసేవాళ్ళేమిటి,పని చేసేవాళ్ళెమిటి ,పక్క భాగం లో  వాళ్ళేమిటీ -"ఏదో అదృష్టం  వల్ల ఇలా  దగ్గర అయినాం"- అన్నంతగా   వ్యవహరిస్తారు. అసలా పలక రింపులేవేరు ఆప్యాయతలే వేరు   .........ఇన్నాళ్ళూ ఎక్కడున్నామో?...వీరిప్పుడు కనిపించారు.ముందే కనిపిస్తే ఎంత  హాయిగా గడి చేదో? అన్నంతగా  ప్రవర్తిస్తారు.
        సిగ్గులు,నిగ్గులు,మొగ్గులు-పొడి దగ్గులు
                     కొత్తగా  కాపురానికి వచ్చినప్పుడు పడుచు కత్తెలు  ఎంతో నమ్రతగా వుంటారు.భర్తతో    మాట్లాడడానికే సిగ్గు పడతారు.తమలో ఏవో అంతులేని నిగ్గులున్నయని చెప్పడానికిబదులు చేష్టల్లోకి   దిగుతారు. ప్రతి విషయం లో మొగ్గు చూపడానికి ప్రయత్నిస్తారు. పలకరించడానికి భయమన్నట్లుపొడి దగ్గులతో భర్త దృష్టిని ఆకర్షించుకొంటారు.క్రమ  క్రమంగా  మారిపోతుందా స్వరూపం .జారిపోతుందా  స్వభావం. కొత్తరూపం ధరిస్తారు.ఆమె సిగ్గు పడటం మానేస్తుంది. ఆమెను చేసుకొన్నందుకు భర్త సిగ్గు పడే పరిస్థితి కల్పిస్తుంది. ఆదిలో పొందిన  ఆనందానికి బదులు అంతులేని చింతలోపదతాడు భర్త అనిపించుకొన్న అదృష్ట హీనుడు.
            ఏ ఆఫీసుకో  బయలుదేరి భర్త వీధిలోకి వచ్చిన తర్వాత భార్యకు ఏదో జ్ఞాపకం వచ్చి " ఏమండోయ్ !మిమ్మల్నే! ఏమిటి గొర్రెలాగా  తలవంచుకుపోతారు వూరివెంట మీరు ---- ఊడలు దిగిన  మర్రిచెట్టులా  ఇంట్లో నేనూనా? పంచదార అయిపోయింది, చేతిసంచీ పట్టుకెళ్ళండి,మధ్యాన్నానికేలేదు......వంటిగంట కల్లా పంపాలి. "అని సంచీ  ఆయనకో అర్ధ గజం దూరంలో పడేట్టూ గిరాటు వేయడం జరుగుతుంది. వీధి భాగవతం కూడా దేనికని ఆయనగారా సంచీపుచ్చుకొని ,అలాటి ఇల్లాల్ని బహూకరించినందుకు   భగవంతుణ్ణి మెచ్చుకొని ఆయన గారు వెళ్ళి పోతారు. సాయంత్రం   ఇంటికి వచ్చిన  తర్వాత "దీనికి సానతం బుధ్ధి చెప్పాలి" అని మాత్రం మనసులో సణుగుతూ వెడతాడు.
                   కాపరానికి వచ్చింది నెల క్రింద- కసిరి కొట్టేది రోడ్డు మీద
                  "కాపురానికి వచ్చి నెలా పదిహేను రోజులు కాలేదు అప్పుడే కసిరి కొడుతోంది మొగుణ్ణీ ,అందులో నడి రోడ్డూ మీద" అని పక్క ఇళ్ళవాళ్ళు చెప్పుకోవడం జరుగుతుంది.  కలిసి మెలిసి  కాలం గడిపిన కొద్దీ మనస్సులు అర్ధం చేసుకోవడం, మమతలు వడపోసుకోవడం -అనుభవాలను గుండెల్లో రంగరించుకోవడం -ఆదర్శ జీవితంలో అడుగు పెత్తడం "జరుగుతుందంటారు పెద్దలు.ఆ సిధ్ధాంతాలు చాలావరకు   తారుమారైనాయి....మగవాళ్ళు మాత్రం  మారరూ !
                       "సాయంత్రం  ఇంటికి వచ్చినప్పటి నుంచీ  సమరం  ప్రారంభం ....బయట తిరిగినంత సేపు చిరునవ్వులు గుమ్మరిస్తారు...ముంగిట్లో అడుగు పెట్టేసరికి ముఖం ముడతలు పడుతుంది....అసలదోరకం ఫోజు వస్తుంది.రోజూ చేసే సంసారమే గనక అలవాటు అయిపోయింది ంకానీ -కొత్తగా చూస్తే కోపంలో  ఆ రూపం ఘోరమనుకోండి ......ఇంతా చేస్తే నే చేసిన  నేరమేమిటో అర్ధం కాదు.!అని కొందరు ఇల్లాళ్ళు గొడవ పడుతూ వుంటారు.
                     ఒకాయన ఫించను పుచ్చునుకొని ఇంట్లోనే కుంటు కొంటూ తిరుగుతుతున్నాడు.ఓపిక తగ్గింది.వూపిరి హెచ్చింది.పది గంటల వేళ పంట్లాం వేసుకొని ఎక్కడో అక్కడ కొంత సేపు తిరిగిరాందే ప్రాణం వూరుకోదు.ఫలానా  పని అనిగానీ చోటు అని కూడా  విండదు కనుక --  ఎప్పుడు వచ్చేదీ ఆయనకు తెలియదు.ఒక్కొక్క రోజు రెండింటికి వచ్చి తిండి తినడం జరిగేది.
             అత్తిసరు నేవేస్తా!పచ్చడి నువ్వు నూరుకో!
                        " ఆయన   భార్యను బ్రతిమాలాడూ,కాస్త పది దంటలకే అన్నం పెట్టు-నీకు పుణ్యం వుంటుంది. ఆకలితొ తిరగ లేకుండా  వున్నాను."అని ఆవిడ వెంటనే జవాబు చెప్పింది - ఇప్పటికి నలభై ఏళ్ళనుంచి ,తెల్లరి లేచినప్పటినుంచీ పొయ్యి దగ్గర పొగలో పడి చాకిరీ చేసి పదింటికల్లా   వడ్డించాను.ఇక నా  వల్ల కాదు.వూరికేవున్న మనిషి వూరంతా  తిరగడమెందుకు? నన్ను ఉరుకులూ పరుగులూ తియ్యమనడమెందుకు ?నావల్లకాదు మహాప్రభో!.....వంటి గంటకు వండి పెడితే గొప్ప.అంది
                    ఓపిక విండటం లేదే!ఏదో పచ్చడి మెతుకులన్నా పెట్టవే! ఫినను దారుడికి అంతకన్నా ఎక్కువేమి పెడతావు?"అని ఆయన అభ్యర్ధన.
                ' మీకు ఓపిక తగ్గితే నాకు మాత్రం  తగ్గదా?నేనేమి పాషాణాన్నా!పచ్చడి మెతుకులు పెట్టడం మాత్రం తేలికేమిటి?  పోనీ  అత్తెసరు నేను పడేస్తాను....ఆ పచ్చడేదో మీరే నూరుకోండి. ...తినండి."అని ఆవిడగారి సలహా...
                              ఒకప్పుడు ఆవిడ సిగ్గులు ఒలక బోసి వుంటుంది.నిగ్గులు చూపించి వుంటుంది.ఆయన చూచిన ప్రతి చూపుకి మొగ్గి వుంటుంది. కాలం గదిచిన కొద్దీ  అలా  మారింది...ఈ తగవులో తప్పెవరిదో,ఒప్పెవరిదో -తీర్పు చెప్పడం కష్టం .నేర్పుతో నిభాయించుకు రావడమొక్కటే మార్గం.
                                వాడితో కాపురం కన్నా  వల్లకాటికి చేరడం మంచిది
           మా వూళ్ళో ఒక రైతు కుమార్తె వుండేది. ఆ అమ్మాయిని కోరికోరి వూళ్ళోనే వున్న మేనమామ కిచ్చి వివాహం చేసారు.ఆ అల్లుడు చాలా  సమర్ధుడు.మాటకారి మంచి నేర్పరి. అయితేనేం పెళ్ళయిన  ఆరు నెలల తరువాత ఆ అమ్మాయి అతడంటే ఇష్తం లేదని చెప్పి వచ్చి పుట్టింట్లో కూర్చోవడం ప్రారంభించింది.
                    ఎవరైనా  సలహా  చెప్ప డానికి వెడితే -మీరు చెప్పడం అనవసరం -వాడితో కాపురం కంటే వల్లకాటికి చేరడం సుఖం .......అవస్థలు పడేదానికి నాకు తెలుసా? మీకు తెలుసా వాడి సంగతి? అని ప్రశ్నించేది.వచ్చిన వాళ్ళు ఏమి చెప్పాలో తెలియక   వెళ్ళీ పోయే వారు.
             వూరి మధ్యలో గల  గుడి దగ్గర నిలబడి" స్వామీ! వాణ్ణి తెచ్చి కట్టిన వాడివి నువ్వు కనుక నీకు చెపుతున్నా,వాడితో నే కాపురం చెయ్యలేను.....ఎందుకింత ఘట్టిగా  చెపుతున్నానో నువ్వు గ్రహించు.....కావాలంటే వాణ్ణి పిలిచి నువ్వు అడుగు "అని ఏమేమో చెపుతూ  వుండేది. ఏదో చెప్పరాని బాధలు పడుతోందని కొంద్రూ,మతి చెడిందని కొందరు నిర్ణయించుకొని వూరుకొన్నారు.
              విచిత్ర మేమిటంటే....ఆరుగురు బిడ్డల తల్లి అయేదాకా  ఆవిడైలా  వాడితో  కాపురం   చెయ్యనని చెపుతూనే వుండేది. దానికి తగ్గట్టు ఎక్కువగా  పుట్టింటి వద్దే  కాలక్షేపం చేస్తూ వుండేది. దాంపత్యాలలో "వైరానికి" సంబంధించిన ఒక విచిత్ర ఊదంత మిది.
              అది మేం బతికి వున్నప్పటి ఫొటో
          ఒక రింటికి వెడితే గోడమీద వున్న దంపతుల ఫొటో చూపించిందా  ఇల్లాలు.ఎంతో అందం గా వున్నారని సంతోషించా. వెంఠనే ఆవిడ అన్నది "అది మేం బతికి వున్నప్పటి ఫొటో అని. మరి   ఆదాంపత్యమెలా   మారిపోయిందో,ఆమె ఎలాటి స్థితి లో కాపురం చేస్తొందో తెలుస్తుందామె  మాటవల్ల .
28-8-76
                     

Friday, May 9, 2014

రాధవు కావు

                         రాధవు  కావు 

రాధవు కావు   నా హృదయ  రాగ మహోజ్వల    కావ్య గీతిలో 
సాధిక వీవు,నా ప్రణయి,  ఉర్వర  శర్వర   నిండి యున్నా ఆ 
రాధనవీవు,నా మురళి   గానములో   శృతి వీవుఅన్నిటన్ 
మాధవు కర్ధ  సంపదవు ,మానినివౌడువే !మంగళా కృతి !
రావూరు 
[ఇస్కాన్  వారి   సౌజన్యం తో ]

Friday, November 22, 2013

డా సి. నారాయణ రెడ్డి మానవత నారాధించే మధుర విపంచి

        మానవత నారాధించే   మధుర విపంచి
         డా సి. నారాయణ రెడ్డి 
{భాషా కుటీరం లో    రావూరు డా సి నారాయణ రెడ్డిగారికి సన్మానం చేసి  అభినందన సంచిక ప్రచురించింది అందులో రావూరు రచన .}
                 కాల పరిణామం లో సంవత్సరానికో వసంతం . కవికి జీవిత మంతా వసంతమే!అతని హృదయ ము ఆరామం .... భావాలు  పూల మొగ్గలు.శైలి పసిడి నిగ్గులు. ..... కావ్యాలు పొదరిళ్ళు -సందేశాలు పుప్పొళ్ళు. 
                సామాన్యం గా చెప్పుకోతగ్గ ఉపమానాలివి. కొందరు కవుల జీవితాలలో వసంతం ఒక పరువుగా వచ్చి మాయమవుతూ వుంటుంది . తిరిగి ఎప్పుడో చెప్పకుండా చివుళ్ళు పట్ట వచ్చు. ... వాటిలో ఒక మొగ్గ   తొంగి చూడవచ్చుఽవి గతించిన వసంతానికి   ఆనవాళ్ళుగా  నిలుస్తాయి...... మనల్ని పిలిచి అలనాటి చరిత్రను జ్ఞాపకం చే సుకొమ్మంటాయి. కాని,కాలాన్ని స్వంతం గా మలచుకొని -జీవితమంతా వసంతంగా మార్చుకోగల వారు కొద్ది మందే వుంటారు. 
                 ఆ   ఆరామంలో ఎన్ని కొత్త మొక్కలు వెలుస్తాయో,ఎన్ని విరులు విరుస్తాయో ,ఎంత మధుర మైన తేనె జల్లులు కురుస్తాయో-అంచనా వేయడం కశ్తమ్. ;అలా వేయబూనడం ఆ కవితా హృదయాన్ని వంచన చేయడమే అవుతుంది . 
               ఆయన చేతిలో   వంద కలాలు
            అలాటి అంచనాలను మించిన కవులలో  డా సి నారాయణ రెడ్డిగారొ కరు. చేతిలో వంద కలాలున్నట్లు ,తనలో అంతు లేని బలం వున్నట్లు ,ఆయన రచనలు సాగిస్తూ వుంటారు . కొత్తదనం చెడదు -మెత్తదనం పోదు. ..  వయసు అడ్డు రాదు-మనసు పస తప్పిపోదు ఆ ధునికాన్ధ్ర కవితా ప్రపంచంలో ఆయన ఒక స్థానం ఏర్పరుచుకొన్నారు. దానికి సుస్థి రత  కల్పించుకొన్నారు.
                        అటు సాహితీ రంగంలో ,ఇటు ఫిలిం ప్రపంచంలో ఆయన కవితలు పరుగులు తీస్తూనే వున్నాయి,సరస్వతి పాదాలకు గంధం పూస్తూనే వున్నాయి. .ఒక ప్ర క్క సన్మానాలు,ఒకప్రక్క  సత్కారాలు
ఒక ప్రక్క బహుమానాలు,ఒకప్రక్క కీర్తి తోరణాలు . ఆయన సవ్య సాచి అనిపించుకొన్నారు. భవ్య మనస్కుడని  అనిపించుకొన్నారు.
                      ఫిలిం రంగం లో ఆయన గేయరచయితగా "రికార్డు"నెలకొల్పు కొన్నారు". రెడ్డిగారి  పాట  లేందే ఫిలిం బయటికి రాదు-అసలు సెన్సారు ఆమోదించదు " అని హాస్యంగా అనుకోవడం కూడా కద్దు.రెడ్డి గారు వ్రాసినాన్ని ఫిలిం గేయాలు ఏభాషలో ఎవరు వ్రాసి వుండరు . అవి వెయ్యి ఏనాడో దాటి రెండో వెయ్యి నండుకోవడం కోసం ఉయ్యాలలూగుతూ ముందుకు ఉరుకు తున్నాయి. 
                విమానానిదే ఆలస్యం 
                 "గులేబ కావళి "  చిత్రం ద్వారా రెడ్డిగారు ఫిలిం పరిశ్రమకు పరిచయం అయారు. "నన్ను దోచుకొందు వటే " అన్న పాట వ్రాసిన వేళా విశేషం -అప్పటి నుంచీ  ఇప్పటి వరకు ఆయన కలం నిర్ఝరి లాగా పరుగెత్తుతూనే వుంది -వయ్యారాలు ఒలక బోస్తూనే వుంది . రెడ్డిగారివలె గేయ రచన చేయగల వారుండ వచ్చు కాని ఆయన కలం కల్పించిన వ్యామోహం ,మరొకరు కల్పించలెకపొయారు.హైదరాబాదులో నివాసం.మ దరా
సు లో కవితా విన్యాసం .విమానానిదే ఆలస్యంగానీ, కలానిది మాత్రం కాదు. 
                       ఇన్ని పాటలు వ్రాసినా -కొద్ది ప్రొడ్యుసర్ల బులపాటానికి వదిలితే -అన్నిటిలో భావ గాంభీర్యం ,భాషా సౌందర్యం,తొణికిస లాడుతోనే వుంటాయి . భావనా,చిత్రణా లేని గేయం ,సంపాదనా ,సౌజన్యం లేని భర్త వలె  పేలవం కాక తప్పదు. రెడ్డి గారు ప్రతి పాటలో తమ సహజ ప్రతిభను  వెలారుస్తూ వుంటారు. ..... పన్నీటి దీపాలు వెలిగిస్తూనే వుంటారు .
                   మల్లియలారా-మాలికలారా 
                    మౌనముగా నున్నారా...... 
                     మా కథ విన్నారా ?
       -వంటి అతి మధుర మైన గేయాలు వందల కొలది వున్నాయి. 
                 "పోలేవునీవు 
                 రాలేను నేను 
                 నీదారిలోనే నే 
                 నిలిచినాను -
     -వంటి భావ పూరిత మైన పాటలు ఎన్నో వున్నాయి. ఇలాటి వన్నీ ఏరితే ఏటి వొడ్డు  కోయిల గుంపులు ఒక్కసారిగా గొంతెత్తి కుహుకుహు  ధ్వానాలు చేసినట్లుంటుంది . ఇలాంటివెన్నో...... 
                    ఒక్క "ఏకవీర"చిత్రానికి  మాత్రంసంభాషణ 
లు వ్రాసారు . "సంభాషణలు వ్రాయాలనే కోరిక నాకు లేదు..... అదొక ప్రత్యేక కృ షి -తీరిక వుండాలి." అన్నారాయన  ఒకసారి .పాటలు వ్రాసి కెంపులు,పచ్చలు 
విసిరినట్లు విసిరి రావడం ఆయన అలవర్చుకొన్న విద్య.
               గ్రంధ రచనలో రెడ్డిగారు సిద్ధ హస్తులు .ఇప్పటికీ ఇరవై పైగా గ్రంధాలు వెలువడినాయి .ఆన్నిటిలోఏదో ప్రత్యేకత .... ఏదో ఉద్విగ్నత ..... ఉజ్వలత 
వచన కవితలో కొత్త పరవళ్ళు దిద్దింది వారి కలం .ఆపరవళ్ళలొ పాఠక లోకం మునిగి ముచ్చటలు పడుతూ వుంటుంది. రేడియో నాటికలకు జీవం పోసిన వారిలో వీరొకరు . 
             గేయ ప్రపంచానికి రత్న కిరీటం 
                       హిందీ,అరవం ,మరాఠీ ,వంగ భాషలలో కూడా ఏకవీ ఫిలింలకు ఇన్ని గేయాలు వ్రాసి వుండరు. అలాగే ఘంటసాల వారివలె ఏనేపథ్య గాయకుడు అన్ని పాటలు పాడి వుండడు . ఆ విధంగా ఒకరు ఫిలిం గేయ ప్రపంచానికి,మరొకరు సంగీత ప్రపంచానికి రత్న కిరీటాలు
గా అవతరించారు . ఇద్దరికీ జోహార్లు చెప్పక తప్పదు. 
                   సామాన్యంగా సరస్వతి చోటు చేసుకొన్న వీటిలో లక్ష్మి ప్రవేశించ దు . కవి ఎంత భోగలాలసుడో అంత చింతా క్రాంతుడుగా  వుండాలని ఆమె సంకల్ప మెమో!నారయణ రెడ్డి గారి విషయంలో ఇద్దరు సఖ్యత పడ్డారు . ఆయన ఇంట చెమ్మ చెక్క లాడుతూ వుంటారు. అందుకనే  ఆయన్ని "ఆంద్ర రవీంద్రుడు "అనాలనిపిస్తుంది . 
                వేములవాడ ప్రాంతం లోని హనుమాజీ పేటలో సింగిరెడ్డి వారింట జన్మించిన ఒక లేత మనసు,భీమేశ్వరాలయ ప్రాంగణం లో వలయాలుగా తిరిగే గానాలలో నుంచి సరిగమలు సంతరించుకొని .వాటి మీద సాహిత్యపు రజను జల్లుకొని ,తెలుగుతల్లి మెడలో వెలలేని హారాలు వెయ్యాలని కళలు గని -నేటికి డా నారాయణ రెడ్డి గా మారాడు . 
                       రెడ్డి రాజుల శౌర్యాన్ని ,ఆంధ్రుల వీరత్వాన్ని ,అమర కవుల భావనా పటిమను ,తెలుగు కవుల రచనా నైపుణ్యాన్ని ,ఆధునికుల ప్రగతి శీలతను పూల సజ్జలాంటి ఒజ్జల హృదయం ,సజ్జనులకు కానుకగా అమరే సౌజన్యం -ఆయన జీవితం లో ఇంద్ర ధనుస్సు లాగా ఒళ్ళు విరుచుకొన్నాయి-ఒంపులు దిద్దుకొన్నాయి. 
                     ఎన్నో చెప్పడం కంటే ఒక చిన్న మాట చాలుఈయన్ని గురించి అ దే ఆయన  జీవిత చరిత్ర లాంటి గ్రంధమవుతుంది . ఏమిటా ఒక్క మాట?....... "మానవత నారాధించే మధుర విపంచి -శ్రీనారాయణ రెడ్డి ". 
          ***********************************