Sunday, February 24, 2013

మునిమాణిక్యం వారి ముత్యాల పంట

             మునిమాణిక్యం  వారి     ముత్యాల పంట 
         
                     సరస,సరళి సౌజ న్య     భావనల తో    నిండి  పండిన  స్త్రీ   మూర్తిని   నాయికగా   స్వీకరించి   కమనీయ  మైన     కాంతం    కధలు   సృష్టించిన    సిద్ధ  హస్తులు   శ్రీ   ముని   మాణిక్యం    నరసింహారావుగారు . కాంతం ఆంద్ర దేశం లో    ప్రతి   ఇంటా     సారస్వత     సేవ     చేసింది . ప్రతి గృహిణిని    పలకరించింది .  ప్రతి వారి  మనస్సులో    నవ్వులు చిలకరించింది . 
                        రాజ మహేంద్ర వరములో   ఒక మిత్రుని    కుమార్తె   పేరు    కాంత మట .నరసిమ్హా రావుగారు అక్కడికి       వెళ్లి నపుడు ఆ    మిత్రుడు     కుమార్తెను    మాటి మాటికి      కాంతం కాంతం అని పిలిచినప్పుడు -ఆ పేరు ఆయన కెంతో    బాగా     వున్నట్టు   తోచిందిట . ఆ పేరునే     కధలలో      నాయికకు ఉపయోగించడం     ప్రారంభించారట . తోలి సారిగా  "కాంతం"కదా వ్రాసిన శుభ  ముహూర్త మెట్టిదో     ఆ  పేరు తెలుగు   సారస్వతం లో     చిర  స్థాయిగా     నిలిచి పోయింది . 
                   కాంతం   కధలు ..... తెలుగు కద   రచనా    విధానంలో  -ఒక   వెన్నెల మలపు     కల్పించినాయి.   గార్హస్త్య జీవితం లో నుంచి   అతి సున్నిత మైన      సంఘటనలను ఎన్నుకొని   హాస్యాన్ని జోడించి ,   సభ్యతకు    భంగం   రాకుండా ,సౌజన్యత     తరిగి పోకుండా చిత్రించిన    కధలవి. "కాంతం చెప్పినట్లు"   అని  ప్రతి ఇంటా    సామెతలుగా చెప్పుకోవడం      సర్వ  సామాన్య  మైంది . 
                      కాంతం ఏదైనా గొప్ప  భావం  వెలి  బుచ్చిందని,సరసంగామాట్లాడిందని, సమస్యను చక్కగా    పరిష్కరించిందని ,అమాయకత్వంతో ,అనురాగంతో   పిల్లల పెంపకం కొన సాగించిందని-  కధల ద్వారా     వెలి బుచ్చడం తద్వారా    కాంతం హోదాను పెంచడం  శ్రీ    నరసింహారావు గారి     అభిలాష . కాంతాన్ని పొగుడుతుంటే     ముని  మాణిక్యం   వారు      చిన్డిన్చే    ముసిముసి  నవ్వులు-వారికి కలిగిన సంత్రుప్తికి ,శాంతికి చిహ్నాలుగా    కనిపించెవి. 
               బహుశ: తొ లి  సారిగా    హిందీ  లోకి     అనువదించ బడిన కధలు   కాంతం  కధలే  నెమో!  తర్వాత ఈ   కధలు  రష్యన్    మొదలైన  విదేశీ    భాషల్లోకి ,తమిళం,కన్నడం   మొదలైన  జాతీయ   భాషల్లోకి    అనువదించ   బడినాయి .
                "కాంతం     ప్రసన్న వదనం   నాకు   నిత్యం  గోచరిస్తూనే    వుంటుంది . మూగగా   వున్న  నాకేవో      భావాలు అందిస్తూనే    వుంటుంది . ఆ    ముసిముసి     నవ్వులలో   ముత్యాల   జల్లులు  కురుస్తూ వుండేవి .ఎక్కడ   ఏ    సందర్భంలో  స్త్రీ ని చూసినా  మా   కాంత మైతే  ఈ     సందర్భంలో,    ఈ    సన్నివేశంలో   ఎలా   మాట్లాడుతుంది? అని ఆలోచన   వస్తున్ది.  ఆ ఆలోచనలోంచి  ఒక కదా ఉత్పన్న మయెది. "అని చెప్పారాయన ఒకసారి. 
                             ఆయన  గారెప్పు డైనా   హాస్యంగా    మాట్లాడుతున్నా,ఎవరితో నైనా    సాహిత్య పరమైన   ఘర్షణ     జరిగినా -అవతల  వారు "వుండండి,మీ   కాంతం   గారితో     చెపుతాను"అని హాస్యంగా    అంటూ వుంటారు .  నరసింహారావు  గారు   వెంటనే     నవుకొని "చెప్పండి_ఆవిడ      మీకేమి   జవాబు చెపుతుందో    నాకు తెలుసు. ....... నా విషయంలో    ఆవిడెప్పుడూ     గౌరవం గానే   వుంటుంది . అనేవారెంతో     ధీమాగా. ఇంటి   సంఘటనలనే    ఆయన గారు  కధలుగా  చిత్రించగలిగారు     కొన్నిసార్లు. 
                  కాంతం  ఆంద్ర దేశంలోని సామాన్య కుటుంబానికి చెందినా ఇల్లాలు .... ఆమె మనసెప్పుడూ తన ఇల్లు,పిల్లలు,ప్రియమైన భర్త ,మర్యాదగల    బంధువులు    .. వీరి  మీదనే     తిరుగుతూవుండేది ఆవిడకు    ఘట్టిగా      మాట్లాడటం     తెలుసునేమో గానీ  -గడుసరి తనం చెతకాదు.కొంచెం     సరసం     తెలుసునేమోగానీ , ఘనత   నాపాదించుకోవడం    తెలియదు.మోజులు     వెలిబుచ్చడం     తెలుసునేమో   గానీ,పోజులు     పెట్టడం     తెలియదు. ఆమె     ఏమి మాట్లాడినా   సంసార     పక్షం    గానే     వుంటుంది . ఒకప్పుడు భర్తతో    ఎదిరించి    మాట్లాడినా     అందులో ఏదో    ధర్మ మున్నట్లే    తోస్తుంది ఆమె     సాధు      స్వరూపం   సాహితీ పరుల    హృదయాలలో   చల్లటి మల్లె పందిరు లల్లుకొంది . నరసింహారావు గారి   కాంతం .... ఏదో   దూర తీరాల నుంచి   తెలుగు దేశానికి   సుగంధ   ద్రవ్యాలను    మోసుకు  వచ్చి పంచి పెట్టిన   పూల వాన. 
                              నరసింహారావు గారు   ఆదిలో  పద్య రచనకుఎక్కువ అభిలాష చూపుతూ    వచ్చారట . సాహితీ  సమితి  సభ్యులు   ,ఆసభ్యులకు  "అన్నగారు"  శ్రీ    శివ  శంకర శాస్త్రి   గారు  -ముని మాణిక్యం   వారితో    చెప్పారట ...... "చూడు నరసింహారావ్"నువ్వు కవిత్వం వ్రాయడం మాని    ,కధలు    వ్రాయడానికి పూనుకో .... నీ కలం కధల్లో   చురుకుగా      పరుగెత్తు తుంది అ ని సలహా చెప్పారట ."అన్నగారి"మాట ప్రకారం  ముని మాణిక్యం వారు కధారచన      ప్రారంభించారట .వీరు ప్రఖ్యాత     కదా   కారులు  కావడానికి   శ్రీ శివ శంకర శాస్త్రి గారి     ఆశీర్వాదం ఏంతో     తోడ్పడి   వుంటుంది . 
                          తోలి సారిగా వీరు    "ఉఫ్"  అనే కద   వ్రాసారట ఽఅ కద  అంతా   ఊహా గానం తో   నిండి వుంది . క్రమంగా    వారి కలం గార్హస్త్యజీవితం వేపు   మళ్ళింది . కాంతం    ప్రత్యక్షం    కావడం  తో కమనీయ  భావనలతో     నిండిన  కదా సాహిత్యం      సాక్షాత్కరించింది . కాంతం   మురిపాలు తిరి తీపి     వెన్నెలలు    కురిపించా  సాగాయి. 
                      మునిమాణిక్యం     వారి  కలం  కొంతకాలం    కాంతానికే అంకిత మయ్యింది . నేనూ-నా కాంతం ,కాంతం కైఫియత్ ,కాంతం కధలు,కాంతం కాపురం ,మొదలైన సంపుటా లెన్నో వెలిసినాయి.   అన్నిటిలో క్రొంగొత్త   కాంతులు     విరిసినాయి. 
                         నరసింహారావుగారు     నవలలు  వ్రాయడం లో  సిద్ధ హస్తు లనిపించు కొన్నారు. "వక్రరేఖ"  'అన్నయ మంత్రి "వంటి   చారిత్రాత్మక    నవలలు వ్రాసి మెప్పు పొందారు . వారి "తిరుమాళి గ "  సంసార జీవితాన్ని ఎంతో     చక్కగా     ప్రతి బింబించి నగోప్ప  సాంఘిక   నవల . 
              రావుగారు    గుంటూరు   జిల్లా  లోని  సంగం  జాగర్ల మూడిలో  1898లో  మధ్య తరగతి బ్రాహ్మణ    కుటుంబం లో    జన్మించారు. తండ్రి శ్రీ    సూర్య నారాయణ గారు    ఉపాధ్యాయ వృత్తిలో     పేరు గడించారు . తల్లి రుక్మిణ మ్మగారు  దైవ భక్తీ కల    ఇల్లాలు. 
         నరసింహారావుగారు  తెనాలి,విజయ నగరాలలో     విద్యాభ్యాసం  చెసారు. రాజ మహేంద్ర వరంలో  బి,ఇ డి డిగ్రీ      పుచ్చుకొన్నారు. మొదటభీమవరం లోని ఒక మిషనరీ     స్కూలులో పనిచెసారు. తరువాత బందరు   హిందూ హై స్కూలు లో   చెరారు. ఉపాధ్యాయ పదవి అంతా   అక్కడే  జరిగింది . బందరులో వీరి రచనా    వ్యాసంగం    ఎక్కువగా     కొన సాగిన్ది. ఉత్తమ కధకులుగా     పేరు  కీర్తులు   సంపాదించారు . కృష్ణా పత్రిక దర్బారులో సభ్యులుగా  వుంది,ప్రతి రోజు హాజరై   నవ్వులందించేవారు .  
         తర్వాత హైదరాబాదులోని  ఆకాశ వాణి  కేంద్రంలో   విద్యా శాఖలో   అసిస్టెంట్   ప్రొఫెసరుగా    చెరారు.  అక్కడ నుంచి విర మించుకొన్న    తరువాత  ఆంద్ర సాహిత్య పరిషత్తు     వారు  నిర్వ హించే పండిట్ ట్రైనింగ్   సెంటర్  ప్రిన్సిపాల్ గా  పని చెసారు. 
                  శ్రీ    రావుగారికి ఆంద్ర సారస్వత పరిషత్తు విశిష్ట సభ్యత్వ పదవి  అందించి గౌరవించింది . అనేక సంస్థలు,సమాజాలు వీరిని ఉచిత   రీతిని గౌరవించాయి . 
                 రేడియోలో     వారు అనేక   హాస్య ప్రసంగాలు చెసారు. హాస్య  నాటికలు   వ్రాసారు. మద్రాసు రేడియో    కేంద్రం స్థాపించిన కొత్తలో శ్రీ   ముని  మాణిక్యం   నాటిక  ఒకటి   ప్రసార మైంది . అదే నేను   మొదటగా   రేదోయో నాటిక      వినడం . అదే కేంద్రం నుంచి ప్రధమంగా    ప్రసార మైన నాటిక  అనేది   నేను ఘట్టిగా  చెప్పలేనుకానీ   అదే ప్రదం   హాస్య    నాటికఅని   తెలుసు. 
               ఆరోజుల్లో   రేడియోలు కూడా తక్కువ. శ్రీ  మునిమాణిక్యం వారు నాటిక  వినడానికి  ఎవరింట్లోనో    ఏర్పాటు చేసి   మా  దర్బారీయులందరినీ తీసుకొని వెళ్ళా రు. నాకు బాగా జ్ఞాపకం ఆ  నాటికలో పాల్గొన్న   వారిలో ఒకాయన ఒక   వాక్యం   తప్పు   చెప్పాడు . మునిమాణిక్యం   వారు "అది కాదయ్యా  నేను వ్రాసింది "అని కేక పెట్టా రు.   మేమంతా నవ్వుకొన్నాము. కాతూరివారు "ఊరికే    అలా  కేకలు    పెట్టకయ్యా! వాళ్లకు కోపం    వస్తే    చెక్కు    పంపారు "అన్నారు మళ్ళీ    నవ్వుకొన్నాము. 
                          శ్రీ  నరసింహారావు గారు ఏంటో  కృషి చేసి "మన హాస్యం "అనే గ్రంధం    వ్రాసారు. ఆ గ్రంధాన్ని గురించి  మాట్లాడుతూ "ఇది నిజంగా  శాస్త్రీయ   గ్రంధం ,హాస్య రసానికి చెందిన  ప్రధ మ     శాస్త్రీయ  గ్రంధం  "అన్నారు. 
                          ఈ గ్రంధంలో   హాస్యంతో,చమత్కారంతో, హేళన -అవ హేళ నలతో గల వివిధ స్వరూపాల్ని  చక్కగా  చిత్రించారు.  ఎన్నో చక్కటి ఉదాహరణలిచ్చారు . ఇది వారు చేసిన   ఉత్కృష్ట    సేవ అని   చెప్ప వచ్చు.  
                 నరసింహారావుగారు మెత్తని హృదయం  కలవారు. మిత్రులంటే ఎంతో   ఆశక్తి. అదితి   మర్యాదలలో    అందే వేసిన చెయి. సాహితీ  రంగం లో పందెం   వేసి  పరుగులు    తీసిన   వ్యక్తి. కదా ప్రపంచంలో ఒక     యుగానికి   నాంది   గీతం . 
                              



No comments:

Post a Comment