Monday, November 10, 2014

దోసెడు మల్లె మొగ్గలు

               దోసెడు మల్లె మొగ్గలు

             రావూరు రచన ఈ   క్రింది   లింక్  లో    చదవండి .

  http://tatavarty.com/gprasuna/Story_Dosedu%20Mallemoggalu.pdf

Sunday, November 9, 2014

వడగళ్ళు

             వడగళ్ళు                         రచన -రావూరు
            ఆమధ్య    ఎక్కడో చదివాను    ఒక జంట మొదటి రాత్రే   తగవు లాడుకొని   విడాకు  లిచ్చుకొన్నారని. "ఆదిలో   ఆనందం   పోయిన కొద్దీ  పోరు-అంతానికి   అంతులేని   వైరం. "అనే  సామెత వుంది మనకి. పైన చెప్పిన జంట ఈసామెతను కూడా  రూపు మాపి వేసారు.
          నిజానికి  ఆదిలో  ఆనందం  అనేది  అనుభవించ వలసిన  సుఖం. కొత్తలో దంపతులేమిటి,స్నేహితులేమిటి,పాలు పోసేవాళ్ళేమిటి,పని చేసేవాళ్ళెమిటి ,పక్క భాగం లో  వాళ్ళేమిటీ -"ఏదో అదృష్టం  వల్ల ఇలా  దగ్గర అయినాం"- అన్నంతగా   వ్యవహరిస్తారు. అసలా పలక రింపులేవేరు ఆప్యాయతలే వేరు   .........ఇన్నాళ్ళూ ఎక్కడున్నామో?...వీరిప్పుడు కనిపించారు.ముందే కనిపిస్తే ఎంత  హాయిగా గడి చేదో? అన్నంతగా  ప్రవర్తిస్తారు.
        సిగ్గులు,నిగ్గులు,మొగ్గులు-పొడి దగ్గులు
                     కొత్తగా  కాపురానికి వచ్చినప్పుడు పడుచు కత్తెలు  ఎంతో నమ్రతగా వుంటారు.భర్తతో    మాట్లాడడానికే సిగ్గు పడతారు.తమలో ఏవో అంతులేని నిగ్గులున్నయని చెప్పడానికిబదులు చేష్టల్లోకి   దిగుతారు. ప్రతి విషయం లో మొగ్గు చూపడానికి ప్రయత్నిస్తారు. పలకరించడానికి భయమన్నట్లుపొడి దగ్గులతో భర్త దృష్టిని ఆకర్షించుకొంటారు.క్రమ  క్రమంగా  మారిపోతుందా స్వరూపం .జారిపోతుందా  స్వభావం. కొత్తరూపం ధరిస్తారు.ఆమె సిగ్గు పడటం మానేస్తుంది. ఆమెను చేసుకొన్నందుకు భర్త సిగ్గు పడే పరిస్థితి కల్పిస్తుంది. ఆదిలో పొందిన  ఆనందానికి బదులు అంతులేని చింతలోపదతాడు భర్త అనిపించుకొన్న అదృష్ట హీనుడు.
            ఏ ఆఫీసుకో  బయలుదేరి భర్త వీధిలోకి వచ్చిన తర్వాత భార్యకు ఏదో జ్ఞాపకం వచ్చి " ఏమండోయ్ !మిమ్మల్నే! ఏమిటి గొర్రెలాగా  తలవంచుకుపోతారు వూరివెంట మీరు ---- ఊడలు దిగిన  మర్రిచెట్టులా  ఇంట్లో నేనూనా? పంచదార అయిపోయింది, చేతిసంచీ పట్టుకెళ్ళండి,మధ్యాన్నానికేలేదు......వంటిగంట కల్లా పంపాలి. "అని సంచీ  ఆయనకో అర్ధ గజం దూరంలో పడేట్టూ గిరాటు వేయడం జరుగుతుంది. వీధి భాగవతం కూడా దేనికని ఆయనగారా సంచీపుచ్చుకొని ,అలాటి ఇల్లాల్ని బహూకరించినందుకు   భగవంతుణ్ణి మెచ్చుకొని ఆయన గారు వెళ్ళి పోతారు. సాయంత్రం   ఇంటికి వచ్చిన  తర్వాత "దీనికి సానతం బుధ్ధి చెప్పాలి" అని మాత్రం మనసులో సణుగుతూ వెడతాడు.
                   కాపరానికి వచ్చింది నెల క్రింద- కసిరి కొట్టేది రోడ్డు మీద
                  "కాపురానికి వచ్చి నెలా పదిహేను రోజులు కాలేదు అప్పుడే కసిరి కొడుతోంది మొగుణ్ణీ ,అందులో నడి రోడ్డూ మీద" అని పక్క ఇళ్ళవాళ్ళు చెప్పుకోవడం జరుగుతుంది.  కలిసి మెలిసి  కాలం గడిపిన కొద్దీ మనస్సులు అర్ధం చేసుకోవడం, మమతలు వడపోసుకోవడం -అనుభవాలను గుండెల్లో రంగరించుకోవడం -ఆదర్శ జీవితంలో అడుగు పెత్తడం "జరుగుతుందంటారు పెద్దలు.ఆ సిధ్ధాంతాలు చాలావరకు   తారుమారైనాయి....మగవాళ్ళు మాత్రం  మారరూ !
                       "సాయంత్రం  ఇంటికి వచ్చినప్పటి నుంచీ  సమరం  ప్రారంభం ....బయట తిరిగినంత సేపు చిరునవ్వులు గుమ్మరిస్తారు...ముంగిట్లో అడుగు పెట్టేసరికి ముఖం ముడతలు పడుతుంది....అసలదోరకం ఫోజు వస్తుంది.రోజూ చేసే సంసారమే గనక అలవాటు అయిపోయింది ంకానీ -కొత్తగా చూస్తే కోపంలో  ఆ రూపం ఘోరమనుకోండి ......ఇంతా చేస్తే నే చేసిన  నేరమేమిటో అర్ధం కాదు.!అని కొందరు ఇల్లాళ్ళు గొడవ పడుతూ వుంటారు.
                     ఒకాయన ఫించను పుచ్చునుకొని ఇంట్లోనే కుంటు కొంటూ తిరుగుతుతున్నాడు.ఓపిక తగ్గింది.వూపిరి హెచ్చింది.పది గంటల వేళ పంట్లాం వేసుకొని ఎక్కడో అక్కడ కొంత సేపు తిరిగిరాందే ప్రాణం వూరుకోదు.ఫలానా  పని అనిగానీ చోటు అని కూడా  విండదు కనుక --  ఎప్పుడు వచ్చేదీ ఆయనకు తెలియదు.ఒక్కొక్క రోజు రెండింటికి వచ్చి తిండి తినడం జరిగేది.
             అత్తిసరు నేవేస్తా!పచ్చడి నువ్వు నూరుకో!
                        " ఆయన   భార్యను బ్రతిమాలాడూ,కాస్త పది దంటలకే అన్నం పెట్టు-నీకు పుణ్యం వుంటుంది. ఆకలితొ తిరగ లేకుండా  వున్నాను."అని ఆవిడ వెంటనే జవాబు చెప్పింది - ఇప్పటికి నలభై ఏళ్ళనుంచి ,తెల్లరి లేచినప్పటినుంచీ పొయ్యి దగ్గర పొగలో పడి చాకిరీ చేసి పదింటికల్లా   వడ్డించాను.ఇక నా  వల్ల కాదు.వూరికేవున్న మనిషి వూరంతా  తిరగడమెందుకు? నన్ను ఉరుకులూ పరుగులూ తియ్యమనడమెందుకు ?నావల్లకాదు మహాప్రభో!.....వంటి గంటకు వండి పెడితే గొప్ప.అంది
                    ఓపిక విండటం లేదే!ఏదో పచ్చడి మెతుకులన్నా పెట్టవే! ఫినను దారుడికి అంతకన్నా ఎక్కువేమి పెడతావు?"అని ఆయన అభ్యర్ధన.
                ' మీకు ఓపిక తగ్గితే నాకు మాత్రం  తగ్గదా?నేనేమి పాషాణాన్నా!పచ్చడి మెతుకులు పెట్టడం మాత్రం తేలికేమిటి?  పోనీ  అత్తెసరు నేను పడేస్తాను....ఆ పచ్చడేదో మీరే నూరుకోండి. ...తినండి."అని ఆవిడగారి సలహా...
                              ఒకప్పుడు ఆవిడ సిగ్గులు ఒలక బోసి వుంటుంది.నిగ్గులు చూపించి వుంటుంది.ఆయన చూచిన ప్రతి చూపుకి మొగ్గి వుంటుంది. కాలం గదిచిన కొద్దీ  అలా  మారింది...ఈ తగవులో తప్పెవరిదో,ఒప్పెవరిదో -తీర్పు చెప్పడం కష్టం .నేర్పుతో నిభాయించుకు రావడమొక్కటే మార్గం.
                                వాడితో కాపురం కన్నా  వల్లకాటికి చేరడం మంచిది
           మా వూళ్ళో ఒక రైతు కుమార్తె వుండేది. ఆ అమ్మాయిని కోరికోరి వూళ్ళోనే వున్న మేనమామ కిచ్చి వివాహం చేసారు.ఆ అల్లుడు చాలా  సమర్ధుడు.మాటకారి మంచి నేర్పరి. అయితేనేం పెళ్ళయిన  ఆరు నెలల తరువాత ఆ అమ్మాయి అతడంటే ఇష్తం లేదని చెప్పి వచ్చి పుట్టింట్లో కూర్చోవడం ప్రారంభించింది.
                    ఎవరైనా  సలహా  చెప్ప డానికి వెడితే -మీరు చెప్పడం అనవసరం -వాడితో కాపురం కంటే వల్లకాటికి చేరడం సుఖం .......అవస్థలు పడేదానికి నాకు తెలుసా? మీకు తెలుసా వాడి సంగతి? అని ప్రశ్నించేది.వచ్చిన వాళ్ళు ఏమి చెప్పాలో తెలియక   వెళ్ళీ పోయే వారు.
             వూరి మధ్యలో గల  గుడి దగ్గర నిలబడి" స్వామీ! వాణ్ణి తెచ్చి కట్టిన వాడివి నువ్వు కనుక నీకు చెపుతున్నా,వాడితో నే కాపురం చెయ్యలేను.....ఎందుకింత ఘట్టిగా  చెపుతున్నానో నువ్వు గ్రహించు.....కావాలంటే వాణ్ణి పిలిచి నువ్వు అడుగు "అని ఏమేమో చెపుతూ  వుండేది. ఏదో చెప్పరాని బాధలు పడుతోందని కొంద్రూ,మతి చెడిందని కొందరు నిర్ణయించుకొని వూరుకొన్నారు.
              విచిత్ర మేమిటంటే....ఆరుగురు బిడ్డల తల్లి అయేదాకా  ఆవిడైలా  వాడితో  కాపురం   చెయ్యనని చెపుతూనే వుండేది. దానికి తగ్గట్టు ఎక్కువగా  పుట్టింటి వద్దే  కాలక్షేపం చేస్తూ వుండేది. దాంపత్యాలలో "వైరానికి" సంబంధించిన ఒక విచిత్ర ఊదంత మిది.
              అది మేం బతికి వున్నప్పటి ఫొటో
          ఒక రింటికి వెడితే గోడమీద వున్న దంపతుల ఫొటో చూపించిందా  ఇల్లాలు.ఎంతో అందం గా వున్నారని సంతోషించా. వెంఠనే ఆవిడ అన్నది "అది మేం బతికి వున్నప్పటి ఫొటో అని. మరి   ఆదాంపత్యమెలా   మారిపోయిందో,ఆమె ఎలాటి స్థితి లో కాపురం చేస్తొందో తెలుస్తుందామె  మాటవల్ల .
28-8-76
                     

Friday, May 9, 2014

రాధవు కావు

                         రాధవు  కావు 

రాధవు కావు   నా హృదయ  రాగ మహోజ్వల    కావ్య గీతిలో 
సాధిక వీవు,నా ప్రణయి,  ఉర్వర  శర్వర   నిండి యున్నా ఆ 
రాధనవీవు,నా మురళి   గానములో   శృతి వీవుఅన్నిటన్ 
మాధవు కర్ధ  సంపదవు ,మానినివౌడువే !మంగళా కృతి !
రావూరు 
[ఇస్కాన్  వారి   సౌజన్యం తో ]

Friday, November 22, 2013

డా సి. నారాయణ రెడ్డి మానవత నారాధించే మధుర విపంచి

        మానవత నారాధించే   మధుర విపంచి
         డా సి. నారాయణ రెడ్డి 
{భాషా కుటీరం లో    రావూరు డా సి నారాయణ రెడ్డిగారికి సన్మానం చేసి  అభినందన సంచిక ప్రచురించింది అందులో రావూరు రచన .}
                 కాల పరిణామం లో సంవత్సరానికో వసంతం . కవికి జీవిత మంతా వసంతమే!అతని హృదయ ము ఆరామం .... భావాలు  పూల మొగ్గలు.శైలి పసిడి నిగ్గులు. ..... కావ్యాలు పొదరిళ్ళు -సందేశాలు పుప్పొళ్ళు. 
                సామాన్యం గా చెప్పుకోతగ్గ ఉపమానాలివి. కొందరు కవుల జీవితాలలో వసంతం ఒక పరువుగా వచ్చి మాయమవుతూ వుంటుంది . తిరిగి ఎప్పుడో చెప్పకుండా చివుళ్ళు పట్ట వచ్చు. ... వాటిలో ఒక మొగ్గ   తొంగి చూడవచ్చుఽవి గతించిన వసంతానికి   ఆనవాళ్ళుగా  నిలుస్తాయి...... మనల్ని పిలిచి అలనాటి చరిత్రను జ్ఞాపకం చే సుకొమ్మంటాయి. కాని,కాలాన్ని స్వంతం గా మలచుకొని -జీవితమంతా వసంతంగా మార్చుకోగల వారు కొద్ది మందే వుంటారు. 
                 ఆ   ఆరామంలో ఎన్ని కొత్త మొక్కలు వెలుస్తాయో,ఎన్ని విరులు విరుస్తాయో ,ఎంత మధుర మైన తేనె జల్లులు కురుస్తాయో-అంచనా వేయడం కశ్తమ్. ;అలా వేయబూనడం ఆ కవితా హృదయాన్ని వంచన చేయడమే అవుతుంది . 
               ఆయన చేతిలో   వంద కలాలు
            అలాటి అంచనాలను మించిన కవులలో  డా సి నారాయణ రెడ్డిగారొ కరు. చేతిలో వంద కలాలున్నట్లు ,తనలో అంతు లేని బలం వున్నట్లు ,ఆయన రచనలు సాగిస్తూ వుంటారు . కొత్తదనం చెడదు -మెత్తదనం పోదు. ..  వయసు అడ్డు రాదు-మనసు పస తప్పిపోదు ఆ ధునికాన్ధ్ర కవితా ప్రపంచంలో ఆయన ఒక స్థానం ఏర్పరుచుకొన్నారు. దానికి సుస్థి రత  కల్పించుకొన్నారు.
                        అటు సాహితీ రంగంలో ,ఇటు ఫిలిం ప్రపంచంలో ఆయన కవితలు పరుగులు తీస్తూనే వున్నాయి,సరస్వతి పాదాలకు గంధం పూస్తూనే వున్నాయి. .ఒక ప్ర క్క సన్మానాలు,ఒకప్రక్క  సత్కారాలు
ఒక ప్రక్క బహుమానాలు,ఒకప్రక్క కీర్తి తోరణాలు . ఆయన సవ్య సాచి అనిపించుకొన్నారు. భవ్య మనస్కుడని  అనిపించుకొన్నారు.
                      ఫిలిం రంగం లో ఆయన గేయరచయితగా "రికార్డు"నెలకొల్పు కొన్నారు". రెడ్డిగారి  పాట  లేందే ఫిలిం బయటికి రాదు-అసలు సెన్సారు ఆమోదించదు " అని హాస్యంగా అనుకోవడం కూడా కద్దు.రెడ్డి గారు వ్రాసినాన్ని ఫిలిం గేయాలు ఏభాషలో ఎవరు వ్రాసి వుండరు . అవి వెయ్యి ఏనాడో దాటి రెండో వెయ్యి నండుకోవడం కోసం ఉయ్యాలలూగుతూ ముందుకు ఉరుకు తున్నాయి. 
                విమానానిదే ఆలస్యం 
                 "గులేబ కావళి "  చిత్రం ద్వారా రెడ్డిగారు ఫిలిం పరిశ్రమకు పరిచయం అయారు. "నన్ను దోచుకొందు వటే " అన్న పాట వ్రాసిన వేళా విశేషం -అప్పటి నుంచీ  ఇప్పటి వరకు ఆయన కలం నిర్ఝరి లాగా పరుగెత్తుతూనే వుంది -వయ్యారాలు ఒలక బోస్తూనే వుంది . రెడ్డిగారివలె గేయ రచన చేయగల వారుండ వచ్చు కాని ఆయన కలం కల్పించిన వ్యామోహం ,మరొకరు కల్పించలెకపొయారు.హైదరాబాదులో నివాసం.మ దరా
సు లో కవితా విన్యాసం .విమానానిదే ఆలస్యంగానీ, కలానిది మాత్రం కాదు. 
                       ఇన్ని పాటలు వ్రాసినా -కొద్ది ప్రొడ్యుసర్ల బులపాటానికి వదిలితే -అన్నిటిలో భావ గాంభీర్యం ,భాషా సౌందర్యం,తొణికిస లాడుతోనే వుంటాయి . భావనా,చిత్రణా లేని గేయం ,సంపాదనా ,సౌజన్యం లేని భర్త వలె  పేలవం కాక తప్పదు. రెడ్డి గారు ప్రతి పాటలో తమ సహజ ప్రతిభను  వెలారుస్తూ వుంటారు. ..... పన్నీటి దీపాలు వెలిగిస్తూనే వుంటారు .
                   మల్లియలారా-మాలికలారా 
                    మౌనముగా నున్నారా...... 
                     మా కథ విన్నారా ?
       -వంటి అతి మధుర మైన గేయాలు వందల కొలది వున్నాయి. 
                 "పోలేవునీవు 
                 రాలేను నేను 
                 నీదారిలోనే నే 
                 నిలిచినాను -
     -వంటి భావ పూరిత మైన పాటలు ఎన్నో వున్నాయి. ఇలాటి వన్నీ ఏరితే ఏటి వొడ్డు  కోయిల గుంపులు ఒక్కసారిగా గొంతెత్తి కుహుకుహు  ధ్వానాలు చేసినట్లుంటుంది . ఇలాంటివెన్నో...... 
                    ఒక్క "ఏకవీర"చిత్రానికి  మాత్రంసంభాషణ 
లు వ్రాసారు . "సంభాషణలు వ్రాయాలనే కోరిక నాకు లేదు..... అదొక ప్రత్యేక కృ షి -తీరిక వుండాలి." అన్నారాయన  ఒకసారి .పాటలు వ్రాసి కెంపులు,పచ్చలు 
విసిరినట్లు విసిరి రావడం ఆయన అలవర్చుకొన్న విద్య.
               గ్రంధ రచనలో రెడ్డిగారు సిద్ధ హస్తులు .ఇప్పటికీ ఇరవై పైగా గ్రంధాలు వెలువడినాయి .ఆన్నిటిలోఏదో ప్రత్యేకత .... ఏదో ఉద్విగ్నత ..... ఉజ్వలత 
వచన కవితలో కొత్త పరవళ్ళు దిద్దింది వారి కలం .ఆపరవళ్ళలొ పాఠక లోకం మునిగి ముచ్చటలు పడుతూ వుంటుంది. రేడియో నాటికలకు జీవం పోసిన వారిలో వీరొకరు . 
             గేయ ప్రపంచానికి రత్న కిరీటం 
                       హిందీ,అరవం ,మరాఠీ ,వంగ భాషలలో కూడా ఏకవీ ఫిలింలకు ఇన్ని గేయాలు వ్రాసి వుండరు. అలాగే ఘంటసాల వారివలె ఏనేపథ్య గాయకుడు అన్ని పాటలు పాడి వుండడు . ఆ విధంగా ఒకరు ఫిలిం గేయ ప్రపంచానికి,మరొకరు సంగీత ప్రపంచానికి రత్న కిరీటాలు
గా అవతరించారు . ఇద్దరికీ జోహార్లు చెప్పక తప్పదు. 
                   సామాన్యంగా సరస్వతి చోటు చేసుకొన్న వీటిలో లక్ష్మి ప్రవేశించ దు . కవి ఎంత భోగలాలసుడో అంత చింతా క్రాంతుడుగా  వుండాలని ఆమె సంకల్ప మెమో!నారయణ రెడ్డి గారి విషయంలో ఇద్దరు సఖ్యత పడ్డారు . ఆయన ఇంట చెమ్మ చెక్క లాడుతూ వుంటారు. అందుకనే  ఆయన్ని "ఆంద్ర రవీంద్రుడు "అనాలనిపిస్తుంది . 
                వేములవాడ ప్రాంతం లోని హనుమాజీ పేటలో సింగిరెడ్డి వారింట జన్మించిన ఒక లేత మనసు,భీమేశ్వరాలయ ప్రాంగణం లో వలయాలుగా తిరిగే గానాలలో నుంచి సరిగమలు సంతరించుకొని .వాటి మీద సాహిత్యపు రజను జల్లుకొని ,తెలుగుతల్లి మెడలో వెలలేని హారాలు వెయ్యాలని కళలు గని -నేటికి డా నారాయణ రెడ్డి గా మారాడు . 
                       రెడ్డి రాజుల శౌర్యాన్ని ,ఆంధ్రుల వీరత్వాన్ని ,అమర కవుల భావనా పటిమను ,తెలుగు కవుల రచనా నైపుణ్యాన్ని ,ఆధునికుల ప్రగతి శీలతను పూల సజ్జలాంటి ఒజ్జల హృదయం ,సజ్జనులకు కానుకగా అమరే సౌజన్యం -ఆయన జీవితం లో ఇంద్ర ధనుస్సు లాగా ఒళ్ళు విరుచుకొన్నాయి-ఒంపులు దిద్దుకొన్నాయి. 
                     ఎన్నో చెప్పడం కంటే ఒక చిన్న మాట చాలుఈయన్ని గురించి అ దే ఆయన  జీవిత చరిత్ర లాంటి గ్రంధమవుతుంది . ఏమిటా ఒక్క మాట?....... "మానవత నారాధించే మధుర విపంచి -శ్రీనారాయణ రెడ్డి ". 
          ***********************************    
   
                       


                   
                       









  
                               

Wednesday, March 27, 2013

కనిపించడం లేదు నాటిక రచన రావూరు

        కనిపించడం    లేదు              నాటిక                                                        రచన-   రావూరు

ర- మా  ఫ్రెండ్      రాధ    వస్తూంది . పొద్దున్నే   ఆవిడకేమి     కనపడటం     లేదో!రా ..రాదా ! రా.... రా ఏమిటివాళ
పొద్దున్నే    వచ్చావ్ !
రాధ- రమా   మీ     ఇంట్లో      స్పోర్ట్స్   వరల్డ్ పుస్తకం తెచ్చారా?
ర -తేవడం    తెచ్చారు  గానీ   తర్వాత మళ్ళీ      కంటికి       కనకనబడ లెదు.
రా- అయ్యో! ఏమయింది     మరి?
చం - మా ఇంట్లో దెయ్యాలూ     భూతాలూ      తిరుగుతున్నాయి     రాధగారూ!మా ఇంట్లో   ఎవస్తువూ    కనబడటం    లెదు.
రా- మీ వస్తువుల సంగతి      నాకెందుకు   గానీ      స్పోర్ట్స్     వరల్డ్     కనిపిస్తే ఒమాటివ్వు
ర -క్రికెట్  మాచ్   విశేషాల  కోసమేనా?   నీకింకా   ఈ పిచ్చి     వదిలే      దారి   కనబటం   లేదు    రాధా!
[రాధ  నవ్వి      వెళ్లి     పోతుంది . ]
ర- ఇన్ని కబుర్లు చెపుతున్ది.పుస్తకమ్ మటుకు   కొని    చదవదు. మన తెలుగు    వాళ్ళల్లో   పుస్తకాలు కొని చదివే    వాళ్ళే     కనబడటం     లేదు. .
చం - ఓహో!సుందరమా!రా!రా!
సుం - మా  నాన్న గాని ,మా     అమ్మ   గాని       కనిపించారా  మీకు?
చం - మీ    నాన్న   వచ్చి వెళ్ళా  దిప్పుడే     మీ  అమ్మ    కనిపించలా !   ఇక్కడ పెట్టిన   అయిదు రూపాయల నోటు     కనిపించడంలా !
సుం -నిన్నటి నుంచీ     పంజాబ్ లో   ముగ్గురు   ఎమ్ ఎల్ ఏ లు కనిపించడం    లేదట!మరో  రాష్ట్రం   లో మంత్రి  వర్గ   నిర్మాణానికి     మార్గమే   కనిపించడం    లేదట!
చం - బాబూ !కనిపించడం లేదు      గొడవలు     చెప్పకు. ప్రాణం విసిగి పొతొన్ది. కనిపించేవేవైనా    వుంటే  చెప్పు. 5రూపాయలు     కనిపించడం లా!సంసారం చేసే      మార్గం    కనిపించడంలా-
సుం - పొద్దుటి నుంచి   ఓ మిత్రుదికోసం   తిరిగా     ఎక్కడా       కనిపించడంలా,    ఇంటికివస్తే   అమ్మా,నాన్నా   కనిపించలా!
చం - మరి ఎం కనిపించిందోయ్    నీకు?కనిపించిందోకటి      చెప్పు?
సుం - [నవ్వుతూ]  కనిపించినవి      చెప్పమన్నారా!కోపంతో   వున్నా  మీరు, మీ వెనక   నవ్వుతున్న    మీ  భార్య .
చం- ఇదేనా   కనిపించింది   నీకు.చాల్లె! ఇక్కడినుంచి    బైటకు   పద   మున్దు. ఊ ....ఊ నడు      అవతలకు            .కనిపించదంలా ,కనిపించడంలా-  ఒకటే     కాకి గోల కనిపించేది    ఒకటే   మాయ=కలియుగ    మాయ.
ర- ఆ!మీవన్నీ   సొద్యాలు.
చం - నీ  కన్నీ   మంగళ      వాద్యాలు.
కాక పొతే    ఏమిటండీ!అగ్గిపెట్టె,సిగరెట్టూ  పెట్టె   కనిపించనంత   మాత్రాన ఏమీ   కనిపించలేదంటారేం !వాటి   మాటవదిలి   మీకు     ఇంకేం     కనిపించలేదో చెప్పండి,వెతికి తెస్తాను.
చం- కనిపించనివి చెప్పాలా!చెప్పనా?   కోప్పడవు కదా?  నీలో    పతి  భక్తీ- నాలో      అనురక్తి.
ర- నా      పాటి భక్తీ కెమండోయ్ .నెను మీతో    చెప్పకుండా   ఎప్పుడైనా    గడప    దా టానా ?
చం-గడప దాటలేదులే!   ఇంట్లో     వుండీ      గడి   దాటేవాళ్ళు   లేరూ!
ర- ఆ గళ్ళ సంగతి    నాకు     తెలియదు . ఇళ్ళల్లో   కూడా   గళ్ళుంటాయా!
చం- ఉండవూ   మరి,విచిత్ర      దాంపత్యాలలో      వింత   ముళ్ళు     చాలా    వుంటాయి-
   [బయటనుంచి,చంద్రం   గారూ!  అనిపిలుపు]
చం- కనక బ్రహ్మం    గారా!రన్ది.... రండి,కోర్చోండి.
కన -  ఎంత     విచిత్రం గా     వుందయ్యా!ప్రపంచం?
చం-    మీకూ    అలాగే      వుందీ !ఏమిటో      చెప్పండి      కొంచెమ్.
కన -ఏం     చెప్పను?   అవతల    ఆడ పిల్ల  కూడావుంది
చం- ఫర్వాలేదు,చెప్పండి ,మీరనుకున్నంత  గాభరా  ఏమీ   లేదు.
కన -    ప్లీడర్    కోటేశ్వర   రావుగారి    అబ్బాయి  ,ఆర్నెల్ల  నుంచీ      కనపడటం     లేదట!బంధువులందరికీ   ఉత్తరాలు   వ్రాసారుట !  పత్రికలలో      ఫోటోలు కూడా    వేశారుట !
ర- ఎన్నేళ్ళవాడు?
కన -కనిపించకుండా   వెళ్ళె  ఈడే   కానీ.......
చం- ఏమిటి   కానీ     అంటున్నారు?
కన -వట్టి      నత్తి   సన్యాసి.ఎవర్నెనా    పలక రించడానికి       పది   నిముషాలు       పడుతున్ది..    అలాటిది  ఆడపిల్లని-
చం- అలాగా!     అయినా    పలక రించా డం     దేనికి.పావు ఠా ఉ   కాగితం   తీసుకొని   గుండెలు   చీల్చుకొంటూ  నాలుగు  ముక్కలు     వ్రాస్తేవెతుక్కొంటూ     వచ్చే    వాళ్ళున్నారు. వాడికి   నత్తి   అయితేనేం  -మొత్తం   ఆస్తికి    వాడిగా    వారసుడు.
ర- ఇంకేమండీ !అన్నం  నీళ్ళకు కరువుండదు,కొన్నన్ని    చీరలు  కోన వచ్చు.
చం- పిల్లాడు   కనపడ లేదని    ఆయన అంటుంటే      వాళ్ళ   సంసార     స్వరూప మంతా    వర్ణిస్తావేమిటేనువ్వు?
ర-ఆ!    కనపడక      ఎక్కడికి వెడతాడు? ఏకన్నె    పిల్లనో    వెతుక్కొంటూ   వుంటాడు.
కాన- ఏం   వెతుక్కొడమో!ఏమిటో!అనుకూల     దాంపత్యాలు   ఎక్కడా      కనపడటం    లేదమ్మా!
చం- ఎక్జాం పుల్      కావాలంటే    మా   అడ్రెస్ ఇవ్వండి.
కాన- ఇంకో     విచిత్రం  ఏమిటంటే   ఈతడు     వెళ్ళిన  రోజు     కాకుండా  ఆ కిందటి రోజునుంచి    వాళ్ళింట్లో     అయిదు   వందల   రూపాయలు      కనిపించడం లేదట.
చం- అలాగా!కనిపిస్తే     అబ్బాయి   కనిపించ   వచ్చు   గానీ  అయిదువందల రూపాయలు  కనిపించడం     అబధ్ధమ్. ఇందాక   ఇక్కడ పెట్టిన   అయిదు   రూపాయలు     కనిపించడం    లేదు. మా   ఇద్దరి   కళ్ళూ     కలిసి  నాలుగు   కళ్ళు . అందులో కొంచెం  పెద్దా- చిన్నా     వున్నయనుకోండి.   మా  ఆవిడవి     విశాల నేత్రాలు మరి.
కన - ఇవన్నీ    కనపడక   పోయినా     ఫర్వాలేదు.ఎవ్వరికీ     ఏదారీ     కనిపించని   రొజులివి.  మా  పెద్దాడికిన్త వరకు     ఉద్యోగం      గీత   కనిపించలా!మా   చిన్నాడికి     పదో   క్లాసు   పాసయ్యే      మార్గం   కనిపించడమ్లా! మా  మరదలికి   మగ సంతాన   భాగ్యం   ఇంతవరకు   కనిపించలా-
ర- బాగున్ది  మీ    కింకే మి    కనిపించలేదు?
కాన- ఏమి చెప్పను?నేను వ్రాసిన   "కనిపించని   దైవం'"   అనే వ్యాసాలు        వేసే   పత్రిక   కనిపించడం  లేదుఇన్తవరకు. .   అన్నీ     చెదలు పట్టి  పోతున్నాయ్ .
ర- అయ్యో     పాపం!దైవానికి సంబంధించిన      వ్యాసాలే   అచ్చు   పడటంలా?
చం- ఏమిటే!   నీ  ఆశ్చర్యం?ఈమధ్య   దేవాలయాల్లో   దేముళ్ళే     కనపడటం లా-కొందరు   దేముళ్ళ  మేడల్లో     నగలు   కనిపించడమ్లా.
కన -అసలు  ప్రపంచం   సరిగా   నడిచే   మార్గం     కనిపించడంలా-
ర-  కలికాలం    కదండీ!అన్నట్లు    మొన్న ఒక  ఆవిడకి     పున్నమి  నాడు   వెన్నెలే  కనిపించలేదట!ఆకాశం  మీద   బండి    చక్రం   లా  వున్నా  చంద్రు డే    కనిపించాలేదుట!
కన -ఇది    మరీ     ఆశ్చర్యం    గా   వుండే!సరేమరి,ఇహ     నే వెళ్ళోస్తా.
                               [లేచి      బయటకు   వెళ్లి పొతాదు.]
చం -   అమ్మయ్య    వదిలాడు-ఆ చిల్లర   డబ్బులుంటే    చూడు,వెళ్లి సిగరెట్లు     తెచ్చుకొన్తా.
ర- ఇప్పుడెక్కడ     కనపదతాయండేఏ-అప్పు తెచ్చుకోక-
[చంద్రం గారు     చంద్రం    గారు  -అనిపిలుస్తూనే  బయట నుంచి కనక బ్రహ్మం  లోపలకు వస్తాడు]
చం - ఏమిటీ?   ఏమైందీ?
కన - వాకిట్లో పెట్టిన   సైకిలు    కనబడడం    లేదండీ!ఎలాగండీ?     ఖర్మ !- విచారించ  కండి .కనపదని    జాబితాలో    వ్రాసుకొండి .
కన -ర్యాలీ     సైకిలండీ!   చాలా  ఖరీదు.  కొంచెం    వెతికి   పెట్టండి   బాబూ!
చం- నేనా!  వెతికి పెట్టేదా! భలేవారు   మీరు.
కన -   కానని వాని  నూతగొని ,కానని   వాడు
          విశిష్ట     వస్తువున్   , కానని  భంగి
       అలా అయిన్దయ్యా  నాపని-[వెళ్ళిపోతాడు]
చం - అడ్డమైన    వాడూ  ,అది     కనపడటం లేదు,   ఇది      కనపడటం    లేదు  అని   నా  దగ్గర  కొస్తే  నేనేం   చెయ్యను?     నా   ఉద్యోగం     మానుకొని   ఈ ఉద్యోగం     మొదలు   పెట్టాలింక. వెధవ సంత -నే     వెళ్లి సిగరెట్లు    తెచ్చుకొంటా!ఇంకాసేపుంటే      మళ్ళీ     ఎవరేనా     వస్తారు.త్వరగా. తలుపేసుకో నే వెళ్తున్నా .
                     [బయటకు    వెళ్లి పోతాడు ]
ర-[స్వగతం]   హమ్మయ్య !  మళ్ళీ  ఎవరేనా    ఏదైనా    కనపడలేదు  అంటూ   వచ్చే లోపల   నే వెళ్లి   స్నానం  చెయాలి.బాబూ !
                 [రమా దేవి     కూడా     వెళ్లి పొతున్ది.]
                         సమాప్తం
                         *******


Monday, March 25, 2013

కనిపించడం లేదు నాటిక రచన -రావూరు



 నాటిక                                 కనిపించడం   లేదు                               రచన -రావూరు
*******                             ***************                             *************

                               గదిలో     ఒక       పక్కగా     ఒక      బల్ల      కుర్చీ     వుంటాయి . బల్ల మీద     రెండు
మూడు    పుస్తకాలు    అస్తవ్యస్తంగా      పడి       వుంటాయి. కొంచెం     వెనుకగా  ఇంకో ప్రక్కన  ఒక మంచం
దాని మీద      పక్క వేసి      వుంటాయి . మంచం కింద      చిన్న    పెట్టె     వుంటుంది .  ఎదురుగా  ఒక     గోడకు   కాలెండర్      తగిలించి      వుంటుంది . [చంద్రం    లుంగీ      బనీనుతో       వుంటాడు . రమా దేవి    సామాన్య    మైన        చీరలో     మధ్య తరగతి     గృహిణి    లా      వుంటుంది . ]
                            తెర లేచే సరికి    చంద్రం     ఆ    బల్ల      దగ్గర     కూర్చుని    ఏదో     చదువుతూ   వుంటాడు . తర్వాత     మెల్లగా     లేచి   ఆబల్ల    మీద      సామాను    అటూ  ఇటూ    సర్దుతూ    వుంటాడు . విసుగు పుట్టింది .
చంద్రం -    రమా!ఓ !  రమా! [ఘట్టిగా    పిలుస్తాడు . జవాబు    రాదు]
చం -ఇదో     ప్రారభ్దమ్ -నాకేదయినా      అవసర మైనప్పుడు      ఈవిడ     కూడా   కంటిక్కనపడదు . రమా !  ఓ!    రమా [ఘట్టిగా    పిలుస్తాడు .]
రమాదేవి -[లోపల్నుంచి ]ఆ!ఆ!వస్తున్నానండీ!ఎందుకలా     గావు కేకలు    పెడతారు?స్నానం చేద్దామని     వెళుతున్నాను . ఈవేళ     మీ శెలవు     కాదు  గానీ       నా     పని      తెమల నియ్యడం   లేదు . పొద్దుటి నుంచీ    చూస్తున్నాపనితరవాత     పని     చెపుతూనే     వున్నారు . ఈవేళ    నేను     స్నానం చేసే    గీత   కనపడటం    లేదు .
చం -మరేం    ఫరవాలేదు     ఒక్కరోజు   స్నానం    ఆలస్య మయితే   ఏమీ     మునిగిపోదు   కానీ,ఇక్కడ పెట్టిన   అగ్గిపెట్టె     కానీ     చూసావా?అది నాక్కావలసి   నప్పుడు    కాన పడదు.   అయినా   నా    అగ్గిపెట్టె    ముట్టు కో వద్దని   ఎన్ని సార్లు     చెప్పాను?
రమ -నా    వంటింట్లో     అగ్గిపెట్టె      వేరే   వున్దిగా. మీ సిగరెట్టు  కంపు    అగ్గిపెట్టె    నా    కెందుకండీ!   ఇక్కడే ఎక్కడొ   పడి వుంటుంది  చోడండి.[అక్కడంతా     వెతుకుతుంది . ఆ బల్ల  మీద    పుస్తకాల   మధ్య నుంచి అగ్గి పెట్టె  తీసి   ఇస్తుంది . ]ఆ!ఇదుగోనండీ    మీ    అగ్గిపెట్టి , నెమ్మదిగా     చూసుకొంటే     అదే    కనిపిస్తుంది . ఏదీ!  మీదగ్గర     ఆ  ఆర్పే     కనపడటం   లేదు .
చం -ఆ!ఆ!  సరేలే!  ఇలాతే! [తీసుకొని సిగరెట్టూ పెట్టె   కోసం  చూస్తె   అది   కనపడదు . ]
చం-  ఇక్కడ    సిగరెట్టు   పెట్టె     ఏమయినది!ఇది వచ్చేటప్పటికి      అది  మాయ మైంది .
ర-   ఎక్కడ పెట్టారు?
చం - హిమాలయాల మీద. ఎక్కడ పెడతాను  ఇంట్లోతప్ప?   ఆబల్లమీద    సిగరెట్  పెట్టె    పెట్టి ,అగ్గిపెట్టె   వెతకడం   ప్రారంభించా   అడిదోరికింది,ఇది పొయిన్ది.    ఏదీ    కనబడదు   ఈ    ఇంట్లొ-
ర-   నేను    వెతుకుతా    వుండండి .
చం- ఆ!వెతుకు,వెతుకు       నీవి     విశాల నేత్రాలుగా  !
ర- ఇదుగో నండీ,దిండు   కింద [దిండు కింద నించి తీసి ఇస్తున్ది.]
చం-    దిండు   క్రిందా?
ర-  [నవ్వి]  దిండుకింద     సిగరెట్టు పెట్టే -   ఈ     పేరుతో   ఒక     నాటకం     వ్రాసెయ్యండి.
చం -  ఇందులో   రెండు   సిగరెట్లు    వుండాలి. కనపడటం  లేదే!
ర- అయ్యో!రామ!  అవేమవుతాయండీ!    మీరే     కాల్చేసి  వుంటారు .
చం-  అవునే!  నేనే   కాల్చి  మళ్ళీ  వెతుక్కొంటున్నా!నాకు మతి మరుపు.   ఎం చెయ్యమంటావు?
ర- లేకపోతే   ఏమవుతాయండీ?
చం- సిగరెట్టు    పెట్టెలోంచి   పైకి వురికి   కిటికీ   లోంచి    బయటికి    పోయి    వుంటాయి. మాయా బజారు  సంసారం . ఆ   చొక్కా   ఇలాతే! ఓ అర్ధ రూపాయి  పడేయ్ ,వెళ్లి   తెచ్చు కొంటా![రమా దేవి    చొక్కా   తీసి ఇస్తున్ది.పెట్టె   తెరవడానికి    చూస్తె]
ర- అయ్యో!   తాళం చెవి   బల్ల మీద పెట్టానే! మీరేమైనా   చూసారా?
చం-   బాగున్ది.    నన్నే  అడగడం   ప్రారంభించావ్?  చూడు చూడు
ర- ఇందాక     ఇక్కడే    పెట్టానండీ!   ఇంతలో    ఏమైందీ!   మీ    చొక్కా  జేబులో    ఉందేమో     చూడండి    కొంచెం -
చం - నీకు కనబడని వన్నీ   నా   జేబులో   వుంటాయా? ఇదేం   గారడీ   వాడి   సంచీ    అనుకొన్నావా?
ర- ఏమైంది మరి?వెతుకుతూ వుంటా  ఈపూటకు    వెళ్లి అప్పు తెచ్చుకోండి .
చం - అప్పా!అప్పిచ్చే    వాడేక్కడా      కనపడటం    లేదు. ఎక్కడ  తేను?
ర- ఎలాగండీ తాళం చెవి?ఏమైంది మరి?   ఇక్కడే పెట్టా,నాకు   బాగా     జ్ఞాపకం   వుంది .
చం -మరి     వెతుకు   వెతుకు   [అటూ ఇటూ    పచార్లు చేస్తూ   వుంటాడు .
ర-   నే వెతకలేనండీ -ప్రతిదీ   వెతకట మే నయ్యె![కుర్చీలో   కూర్చుంటుంది]
చం -[కోపంతో]   ఎవడి  కోసం     వెతుకుతావే![దగ్గరకు వెడతాడు]    ఒక్క   చెంపకాయ     వేస్తే-ఓసినీ ...... నీ   మెళ్ళోగొలుసులొనే    వుందే !పెట్టే తియ్యి   తియ్యి     త్వరగా
ర- అవునండోయ్ !ఇందాక పెట్టు కొన్నాను.{పెట్టెలో   డబ్బులు     తీసి    ఇస్తుంది . ]
                       బయట    నుంచి     పిలుపు ------చంద్రం గారూ!
చం -నాగారాజుగారా?   రండి   రండి
నాగరాజు- చంద్రం గారూ    పొద్దుటి   నుంచీ    మా  అబ్బాయి      కనపడటం  లేదండీ!ఊరంతా    వెతికి వెతికి వచ్చాను. ఎక్కడకు పోయాడో ఏమో    మరి!
చం - మీ  అబ్బాయి కనిపించడంలా?  మా  ఇంట్లో వస్తువులు   కనపడక      యాతన    పదుతున్నాము. మీ ఇంట్లొ   మనుషులే    కనిపించడంలా ?
నాగ- వాడిని వెతుకుతానని     వాళ్ళమ్మ   వెళ్ళింది ,అదీ    కనిపించడం లెదు.    ఇల్లు    తాళం  వేసి  వుంది .
చం - తాళం   చెవి  పోగొట్టుకొని     వెతు క్కొంటొదో   ఎమో-మరి [భార్య వంక చూచి  నవ్వుతూ] ఆవిడ మెళ్ళోనె    వుండి     వుంటుంది ,పాపం  చూసుకొని  వుండదు.
ర- చాల్లెండి  సరసాలు!ఆయన భార్యా   ,పిల్లాడు   కనబడక     ఆదుర్దా పడుతుంటే
నాగ -  అసలే సంసారానికి     దారి కనబడక     అవస్థ  పడు తుంటే  ఇంట్లో  వాళ్ళూ కనబడక పోవడం  వచ్చింది . ఓపక్క పొద్దుగూకు తోన్ది. చీకటి పడితే    నాకు   చూపు   సరిగా  కనపడదు   ఎలా?తిరిగి   తిరిగి    జ్వరం   వచ్చి నట్లు గా   వుంది . ప్చ్     ప్చ్   మీ    ఇంట్లో     ధర్మా   మీటరు  గాని     ఉందా?
చం - ఏమే!  ఉందా?
ర- ఉండటానికి   వుంది . నెల రోజుల  నుంచీ    కనిపించడం    లేదు. ఎక్కడ   పడ్డదో   ఏమో?
చం - మాకు ఉండటానికి     వస్తువులన్నీ    వుంటాయి కానీఅవసరానికి   కనిపించవు. ఇదో     విచిత్ర మైన    ఇల్లు.
          సీతా    పతి     వస్తాడు
సీ -చంద్రం గారూ!అరె   నాగరాజు గారు    కూడా    ఇక్కడె    వున్నారే!   మా      కుక్క పిల్ల   పొద్దుటి నుంచీ     కనిపించడం  లేదు ..... మీ ఇద్దరిలో     ఎవరికైనా      కనిపించిందా? రమా   దేవి గారూ     మీకైనా    సరే!
నాగ- కుక్కను చూసి     మూడు    నెల్లయింది  ..చూస్తె    లాక్కొచ్చి     మీ    ఇంట్లొ     పడెయ్యనూ !చూడండి   మీకుక్క పిల్లను   వెతకడంలో   ఎక్కడైనా    మా   పిల్లవాడు గానీ,   వాడి  తల్లి గానీ   కనిపించారా?  చెప్పండి. వాల్లిద్ద్దరూ     పొద్దుటి నుంచీ     కనిపించడం    లెదు.
సీ    - మనుష్యుల  కేమయ్యా ?కాస్సేపటికి     వాళ్ళే   వస్తారు. కుక్కపిల్ల నోరు  లేనిది. ఎక్కడికి వెళ్లిందో?  ఏమయ్యిందో?  చూడాలి మరి, నే వెళ్ళోస్తా.
   [సీతాపతి     వెళ్ళిపోతాడు]
నాగ- నేనో   వెళ్ళొస్తా.   ఈప్రపంచలొ     బతకడానికి     దారి     ఎక్కడా     కనిపించడంలా!   ధర్మం అంతకన్నా    కనిపించడంలా!  [నాగరాజు   అక్కడ వున్న   అయిదు    రూపాయల    నోటు    జేబులో    పెట్టు కొం  టాడు. ] వెళ్ళొస్తా,వెతక్క పొతే     పెళ్ళాం, పిల్లల్ని     వదిలేసి   ఊరుకొన్నాడు    అంటారు. తిరగాలి   తప్పదు మరి [-కొంచెం   ఆగి]ఒకవేళ    వాల్లోస్తే    ఇంకా   గంటా   రెండు    గంటల్లో   వస్తానని   చెప్పండి . [ఒకాలికి తొడుక్కో వలసిన   చెప్పు   మరో     కాలికి తొడుగు   తాడు]
చం - అదేమిటి?   అలా     తప్పుగా    తొడుగు తున్నారు  చెప్పులు?
నాగ - ఏమిటో!   మతి సరిగాలెదు. వస్తువులు    సరిగా  కనిపించడంలా     {చెప్పులు సరిగా  తొడుక్కొని]    వస్తా  మరి.  [వెళ్లి పోతాడు ]
చం - పాపం పెళ్ళాం  బిడ్డలు   కనపడక   ఆయన   దిగులు    పదుతున్నాదు.ఇలాతి   సంసారాలు    చెయ్యడం ఏంతో    కష్టం
ర-  పోనిద్దురూ!  ఇంకోళ్ళ   సంగతి    మనకెందుకు    గానీ,నే స్నానానికి   వెళ్తున్నా
చం - సరేలే!  తలుపేసుకో!   నే వెళ్లి సిగరెట్లు     తెచ్చుకొంటా!
ర- కానీయండి!   అది లేనిదే గడిచే   ఉపాయం   కనిపించడంలా!
చం - ఏదీ!   ఇక్కడ   పెట్టిన     అయిదు   రూపాయల    నోటు   ఏమైంది?
ర- జేబులో   చూసుకోన్నారా?
చం - లేదే![జేబులో చోసుకొంటాడు .]
ర- అప్పుడే ఎక్కడ పోయిందండీ     ఖర్మ?ఎక్కడ పెట్టారు?
చం- ఇక్కడే!ఈబల్ల మీద.
ర- ఇంతట్లో     ఏ నక్క   ఎత్తుకుపొయిన్ దండీ !
చం - అంతా     మిధ్యా   ప్రపంచం   లా  వుంది .దగ్గర   వస్తువులు      కనిపించక పోవడ   మేమిటి?  ఒకటా?  రెండా?     అయిదు   రోపాయలు.
ర- కొట్టిమీరన్నా    వచ్చేది!
చం - చచ్చేది!  అసలు   నోటు     నాకు ఇచ్చావా?
ర- ఇచ్చా కదండీ!
చం - పుచ్చుకొన్న   మాట    జ్ఞాపకం   వున్ది. తలచుకొంటే       భ్రమ     లాగా  వున్ది.
ర- భ్రమ     అంటా   రేమి టండీ శ్రమ   పది   సంపాదించుకొన్న     సొమ్ము.ఇది   ఆనాగారాజు  పనే   అయి   వుంటుంది . ఉన్నంత   సేపు    ఆ   బల్ల    దగ్గరే    తారత్లాదాదు.
చం - అందుకేకాబోలు     వెళ్ళేటప్పుడు .   అంత   ఖంగారు    పద్దాదు.
                                                                                                         [  ఇంకా   వుంది]    




Saturday, March 2, 2013

రావురు కలం- అసలు నీకెమన్నా పిచ్చా?

    రావూరు    కలం -    అసలు     నీకేమన్నా   పిచ్చా?

             చాలా మంది   ఊత   పదాలు   వాడుతూ వుంటారు. సంభాషణ  మధ్యలో   ఆపదాలు     తమాషాగా  అతు క్కొంటూ      వుంటాయి . ....... మొజాయిక్ లో   తెల్ల,నల్ల ,పచ్చ    బిళ్ళ లల్లే !అసలా  పదం లేందే   వారికి    సంభాషణే    జరగదు. 
                                     మా  వూళ్ళో ఒకాయన      వుండే   వాడు . ఆయనగారు     ఏది    మాట్లాడినా  మధ్యలో ...ఏ మిటి !నీకు    పిచ్చేమిటి? అనడం     మామూలు . ఎంతటి     వాళ్ళతో     మాట్లాడుతున్నా  హటాత్తుగా     ఆమాట     పది  తీరవలసిందే!  ఒకసారి  భూమి  శిస్తు కి సంబంధించిన      కేసు వచ్చి  తహసీల్ దారు     దగ్గరికి   వెళ్లాడాయన . తహసిల్ దారు    అడిగాడట "నువ్వు   అదనం గా శిస్తు   కట్టాలి . నువ్వు    పోరంబోకు కలుపుకొన్నట్లు    రుజువైంది 'అన్నాడట . 
            ఈ పెద్ద మనిషి వెంటనే   "నేనేమి     పోరంబోకు   కలుపుకొలెదు. సర్వే   రాళ్ళు  అలా అమ్మతల్లులల్లే   ఉండగా నేనెలా కలుపుకొంటాను?మీరెలా     ఒప్పుకొంటారు?   అయినా  మీకేమన్నా   పిచ్చా?...... కరణం గారి లెక్కల్లో   ఏదో తప్పుంది . లేకపోతె    తరతరాలుగా    మా  వూళ్ళో  "తీరువ బాకీ    లేని దేవరయ్యా?  అంటే ...తిరుపతయ్యె నని చెపుతారు. .......... మీకేమన్నా పిచ్చా?అన్నాడుట . 
              తహసిల్ దారుకి కోపం   వచ్చి  డ ఫేదార్?   వంక చూచి   "నాకు పిచ్చంటా డేమిటి ?బయటికి     పంపు, తీరువ  మూడు    రెట్లు   చేస్తున్నాను "అన్నాడట . 
                      అది విన్న పెద్ద మనిషి "అదేమిటి?    నేనే మన్నా నిపుడు? తీరువ కట్టక్కర లేదన్నాను . మూడు రెట్లంటా  రేమిటి? మీకేమన్నా పిచ్చా?అన్నాడట . 
          అప్పుడా    ఆఫీసరు    గారికి  తెలిసిందట  అది  అతగాడి   ఊత  పదమని. 

                 వూళ్ళో    ఎవరన్నా కనిపించి ..ఏ మీ తిరుపతయ్యా..కులాసా అంటే "ఆ..   కులాసే!  కోడె దూడ నమ్మితే    మూడొంద లొచ్చాయి. ... దాంతో   ఒక    పాడి   గేదెని   కొన్నాను. .... రెండు పూటలా    పెరుగు పోసుకొంటున్నాము . నీకేమన్నా    పిచ్చా? అనేవాడు . 
               "నువ్వు పెరుగు పోసుకొంటే     మాకు ఫై చ్చేమి టయ్యా !....ఇంకొ గేదెని కొనుక్కో!వెన్న ముద్దలు కూడా   మింగు .అని   అవతల  వాళ్ళ వెళ్లి పోయే   వాళ్ళు . 
                                       ఒకసారి   మా ఊరికో    కొత్తల్లుడు   వచ్చాడు . ప్రొద్దున అతడు    చెరువు    గట్టు    మీద వుండగా   ఈ     ఊత   పదం   పెద్దమనిషి వెళ్ళా డు . వెళ్ళిన తర్వాత     ఏదో      పలకరించాలిగా "ఏం  ఎప్పుడొచ్చారు?పది రోజులుంటారా!    వానా కాలమేగా    వుండిపో!  మీ  మామ   మంచాడే!   -ఏమిటి?   వుంటావా ?అసలు నీకేమన్నా     పిచ్చా!'అన్నాడు . 
                            ఆ అల్లుడు ఖంగారు   పడి   తనకు పిచ్చి అని ఎవరు చెప్పారీయనకు?  మా    మామకు పడని   వాళ్లె వరన్నా ఉన్నారేమో   వూళ్ళో నని ,ఆ పెద్ద మనిషితో   అన్నాడు " నాకు పిచ్చేమిటి?    నాకేం లేదు . శుభ్రం   గా  వున్నా!మా పెదనాన్నకు కొంచెం  పిచ్చి ఉండేదిట . ... ఆయన పోయాడు" అన్నాడు . 
                                                 ఆ పెద్ద మనిషి    పగల బడి నవ్వి " ఆ మాట     చెప్పవేం!  ఇంట   ఆలస్యం గా   చెప్పావెం! నీకేమన్నా పిచ్చా? అనుకొంటూ   వెళ్లి పోయాడుట . ఆ కొత్తల్లుడికి    నిజం గా    పిచ్చెక్కి నంత   పనయింది . తర్వాత గానీ     తెలియ లేదు అది  ఆయనకీ   ఊత పదమని. 
               **********************            7-7 1979