Thursday, February 28, 2013

తెల్లవారినా.....

       తెల్లవారినా ........... 

తెల్లవారినా    తెలియదాయనే 
నల్లనయ్య   నా   చేరువ నుండగా    తె 

విడి  విప్పిన  నా కురులలోపల 
దాగియుంటి నే     సిగ్గు పొంగగా 
నల్లనయ్య తన   వల్లె   వాటుతో 
నన్ను కప్పేనే    మొగ్గపోలిక        తె 

పిలపిల మని పిట్టల   గుంపులు 
పిలిచితివట    భానుని     తొలిగా 
కలకలమను    మా    నవ్వుల 
కలిసిపోయె నా  రుతములు          తె 

తలుపు సందులను   
ఎరుపు    కాంతులేవో 
ఎగప్రాకగా    నే     కాంచితి కానీ 
నల్లనయ్య    కౌస్తుభ మటు నిటు 
ఊగిన దనుకొంటినే                        తె 

అందని  దొర     నా   సందిట 
పొందికగా నమరి యుండ 
తెలియునటే   పొద్దుల హద్దులు 
వినిపింపకు నాకిక     సుద్దులు          తె 

***************************

Sunday, February 24, 2013

మునిమాణిక్యం వారి ముత్యాల పంట

             మునిమాణిక్యం  వారి     ముత్యాల పంట 
         
                     సరస,సరళి సౌజ న్య     భావనల తో    నిండి  పండిన  స్త్రీ   మూర్తిని   నాయికగా   స్వీకరించి   కమనీయ  మైన     కాంతం    కధలు   సృష్టించిన    సిద్ధ  హస్తులు   శ్రీ   ముని   మాణిక్యం    నరసింహారావుగారు . కాంతం ఆంద్ర దేశం లో    ప్రతి   ఇంటా     సారస్వత     సేవ     చేసింది . ప్రతి గృహిణిని    పలకరించింది .  ప్రతి వారి  మనస్సులో    నవ్వులు చిలకరించింది . 
                        రాజ మహేంద్ర వరములో   ఒక మిత్రుని    కుమార్తె   పేరు    కాంత మట .నరసిమ్హా రావుగారు అక్కడికి       వెళ్లి నపుడు ఆ    మిత్రుడు     కుమార్తెను    మాటి మాటికి      కాంతం కాంతం అని పిలిచినప్పుడు -ఆ పేరు ఆయన కెంతో    బాగా     వున్నట్టు   తోచిందిట . ఆ పేరునే     కధలలో      నాయికకు ఉపయోగించడం     ప్రారంభించారట . తోలి సారిగా  "కాంతం"కదా వ్రాసిన శుభ  ముహూర్త మెట్టిదో     ఆ  పేరు తెలుగు   సారస్వతం లో     చిర  స్థాయిగా     నిలిచి పోయింది . 
                   కాంతం   కధలు ..... తెలుగు కద   రచనా    విధానంలో  -ఒక   వెన్నెల మలపు     కల్పించినాయి.   గార్హస్త్య జీవితం లో నుంచి   అతి సున్నిత మైన      సంఘటనలను ఎన్నుకొని   హాస్యాన్ని జోడించి ,   సభ్యతకు    భంగం   రాకుండా ,సౌజన్యత     తరిగి పోకుండా చిత్రించిన    కధలవి. "కాంతం చెప్పినట్లు"   అని  ప్రతి ఇంటా    సామెతలుగా చెప్పుకోవడం      సర్వ  సామాన్య  మైంది . 
                      కాంతం ఏదైనా గొప్ప  భావం  వెలి  బుచ్చిందని,సరసంగామాట్లాడిందని, సమస్యను చక్కగా    పరిష్కరించిందని ,అమాయకత్వంతో ,అనురాగంతో   పిల్లల పెంపకం కొన సాగించిందని-  కధల ద్వారా     వెలి బుచ్చడం తద్వారా    కాంతం హోదాను పెంచడం  శ్రీ    నరసింహారావు గారి     అభిలాష . కాంతాన్ని పొగుడుతుంటే     ముని  మాణిక్యం   వారు      చిన్డిన్చే    ముసిముసి  నవ్వులు-వారికి కలిగిన సంత్రుప్తికి ,శాంతికి చిహ్నాలుగా    కనిపించెవి. 
               బహుశ: తొ లి  సారిగా    హిందీ  లోకి     అనువదించ బడిన కధలు   కాంతం  కధలే  నెమో!  తర్వాత ఈ   కధలు  రష్యన్    మొదలైన  విదేశీ    భాషల్లోకి ,తమిళం,కన్నడం   మొదలైన  జాతీయ   భాషల్లోకి    అనువదించ   బడినాయి .
                "కాంతం     ప్రసన్న వదనం   నాకు   నిత్యం  గోచరిస్తూనే    వుంటుంది . మూగగా   వున్న  నాకేవో      భావాలు అందిస్తూనే    వుంటుంది . ఆ    ముసిముసి     నవ్వులలో   ముత్యాల   జల్లులు  కురుస్తూ వుండేవి .ఎక్కడ   ఏ    సందర్భంలో  స్త్రీ ని చూసినా  మా   కాంత మైతే  ఈ     సందర్భంలో,    ఈ    సన్నివేశంలో   ఎలా   మాట్లాడుతుంది? అని ఆలోచన   వస్తున్ది.  ఆ ఆలోచనలోంచి  ఒక కదా ఉత్పన్న మయెది. "అని చెప్పారాయన ఒకసారి. 
                             ఆయన  గారెప్పు డైనా   హాస్యంగా    మాట్లాడుతున్నా,ఎవరితో నైనా    సాహిత్య పరమైన   ఘర్షణ     జరిగినా -అవతల  వారు "వుండండి,మీ   కాంతం   గారితో     చెపుతాను"అని హాస్యంగా    అంటూ వుంటారు .  నరసింహారావు  గారు   వెంటనే     నవుకొని "చెప్పండి_ఆవిడ      మీకేమి   జవాబు చెపుతుందో    నాకు తెలుసు. ....... నా విషయంలో    ఆవిడెప్పుడూ     గౌరవం గానే   వుంటుంది . అనేవారెంతో     ధీమాగా. ఇంటి   సంఘటనలనే    ఆయన గారు  కధలుగా  చిత్రించగలిగారు     కొన్నిసార్లు. 
                  కాంతం  ఆంద్ర దేశంలోని సామాన్య కుటుంబానికి చెందినా ఇల్లాలు .... ఆమె మనసెప్పుడూ తన ఇల్లు,పిల్లలు,ప్రియమైన భర్త ,మర్యాదగల    బంధువులు    .. వీరి  మీదనే     తిరుగుతూవుండేది ఆవిడకు    ఘట్టిగా      మాట్లాడటం     తెలుసునేమో గానీ  -గడుసరి తనం చెతకాదు.కొంచెం     సరసం     తెలుసునేమోగానీ , ఘనత   నాపాదించుకోవడం    తెలియదు.మోజులు     వెలిబుచ్చడం     తెలుసునేమో   గానీ,పోజులు     పెట్టడం     తెలియదు. ఆమె     ఏమి మాట్లాడినా   సంసార     పక్షం    గానే     వుంటుంది . ఒకప్పుడు భర్తతో    ఎదిరించి    మాట్లాడినా     అందులో ఏదో    ధర్మ మున్నట్లే    తోస్తుంది ఆమె     సాధు      స్వరూపం   సాహితీ పరుల    హృదయాలలో   చల్లటి మల్లె పందిరు లల్లుకొంది . నరసింహారావు గారి   కాంతం .... ఏదో   దూర తీరాల నుంచి   తెలుగు దేశానికి   సుగంధ   ద్రవ్యాలను    మోసుకు  వచ్చి పంచి పెట్టిన   పూల వాన. 
                              నరసింహారావు గారు   ఆదిలో  పద్య రచనకుఎక్కువ అభిలాష చూపుతూ    వచ్చారట . సాహితీ  సమితి  సభ్యులు   ,ఆసభ్యులకు  "అన్నగారు"  శ్రీ    శివ  శంకర శాస్త్రి   గారు  -ముని మాణిక్యం   వారితో    చెప్పారట ...... "చూడు నరసింహారావ్"నువ్వు కవిత్వం వ్రాయడం మాని    ,కధలు    వ్రాయడానికి పూనుకో .... నీ కలం కధల్లో   చురుకుగా      పరుగెత్తు తుంది అ ని సలహా చెప్పారట ."అన్నగారి"మాట ప్రకారం  ముని మాణిక్యం వారు కధారచన      ప్రారంభించారట .వీరు ప్రఖ్యాత     కదా   కారులు  కావడానికి   శ్రీ శివ శంకర శాస్త్రి గారి     ఆశీర్వాదం ఏంతో     తోడ్పడి   వుంటుంది . 
                          తోలి సారిగా వీరు    "ఉఫ్"  అనే కద   వ్రాసారట ఽఅ కద  అంతా   ఊహా గానం తో   నిండి వుంది . క్రమంగా    వారి కలం గార్హస్త్యజీవితం వేపు   మళ్ళింది . కాంతం    ప్రత్యక్షం    కావడం  తో కమనీయ  భావనలతో     నిండిన  కదా సాహిత్యం      సాక్షాత్కరించింది . కాంతం   మురిపాలు తిరి తీపి     వెన్నెలలు    కురిపించా  సాగాయి. 
                      మునిమాణిక్యం     వారి  కలం  కొంతకాలం    కాంతానికే అంకిత మయ్యింది . నేనూ-నా కాంతం ,కాంతం కైఫియత్ ,కాంతం కధలు,కాంతం కాపురం ,మొదలైన సంపుటా లెన్నో వెలిసినాయి.   అన్నిటిలో క్రొంగొత్త   కాంతులు     విరిసినాయి. 
                         నరసింహారావుగారు     నవలలు  వ్రాయడం లో  సిద్ధ హస్తు లనిపించు కొన్నారు. "వక్రరేఖ"  'అన్నయ మంత్రి "వంటి   చారిత్రాత్మక    నవలలు వ్రాసి మెప్పు పొందారు . వారి "తిరుమాళి గ "  సంసార జీవితాన్ని ఎంతో     చక్కగా     ప్రతి బింబించి నగోప్ప  సాంఘిక   నవల . 
              రావుగారు    గుంటూరు   జిల్లా  లోని  సంగం  జాగర్ల మూడిలో  1898లో  మధ్య తరగతి బ్రాహ్మణ    కుటుంబం లో    జన్మించారు. తండ్రి శ్రీ    సూర్య నారాయణ గారు    ఉపాధ్యాయ వృత్తిలో     పేరు గడించారు . తల్లి రుక్మిణ మ్మగారు  దైవ భక్తీ కల    ఇల్లాలు. 
         నరసింహారావుగారు  తెనాలి,విజయ నగరాలలో     విద్యాభ్యాసం  చెసారు. రాజ మహేంద్ర వరంలో  బి,ఇ డి డిగ్రీ      పుచ్చుకొన్నారు. మొదటభీమవరం లోని ఒక మిషనరీ     స్కూలులో పనిచెసారు. తరువాత బందరు   హిందూ హై స్కూలు లో   చెరారు. ఉపాధ్యాయ పదవి అంతా   అక్కడే  జరిగింది . బందరులో వీరి రచనా    వ్యాసంగం    ఎక్కువగా     కొన సాగిన్ది. ఉత్తమ కధకులుగా     పేరు  కీర్తులు   సంపాదించారు . కృష్ణా పత్రిక దర్బారులో సభ్యులుగా  వుంది,ప్రతి రోజు హాజరై   నవ్వులందించేవారు .  
         తర్వాత హైదరాబాదులోని  ఆకాశ వాణి  కేంద్రంలో   విద్యా శాఖలో   అసిస్టెంట్   ప్రొఫెసరుగా    చెరారు.  అక్కడ నుంచి విర మించుకొన్న    తరువాత  ఆంద్ర సాహిత్య పరిషత్తు     వారు  నిర్వ హించే పండిట్ ట్రైనింగ్   సెంటర్  ప్రిన్సిపాల్ గా  పని చెసారు. 
                  శ్రీ    రావుగారికి ఆంద్ర సారస్వత పరిషత్తు విశిష్ట సభ్యత్వ పదవి  అందించి గౌరవించింది . అనేక సంస్థలు,సమాజాలు వీరిని ఉచిత   రీతిని గౌరవించాయి . 
                 రేడియోలో     వారు అనేక   హాస్య ప్రసంగాలు చెసారు. హాస్య  నాటికలు   వ్రాసారు. మద్రాసు రేడియో    కేంద్రం స్థాపించిన కొత్తలో శ్రీ   ముని  మాణిక్యం   నాటిక  ఒకటి   ప్రసార మైంది . అదే నేను   మొదటగా   రేదోయో నాటిక      వినడం . అదే కేంద్రం నుంచి ప్రధమంగా    ప్రసార మైన నాటిక  అనేది   నేను ఘట్టిగా  చెప్పలేనుకానీ   అదే ప్రదం   హాస్య    నాటికఅని   తెలుసు. 
               ఆరోజుల్లో   రేడియోలు కూడా తక్కువ. శ్రీ  మునిమాణిక్యం వారు నాటిక  వినడానికి  ఎవరింట్లోనో    ఏర్పాటు చేసి   మా  దర్బారీయులందరినీ తీసుకొని వెళ్ళా రు. నాకు బాగా జ్ఞాపకం ఆ  నాటికలో పాల్గొన్న   వారిలో ఒకాయన ఒక   వాక్యం   తప్పు   చెప్పాడు . మునిమాణిక్యం   వారు "అది కాదయ్యా  నేను వ్రాసింది "అని కేక పెట్టా రు.   మేమంతా నవ్వుకొన్నాము. కాతూరివారు "ఊరికే    అలా  కేకలు    పెట్టకయ్యా! వాళ్లకు కోపం    వస్తే    చెక్కు    పంపారు "అన్నారు మళ్ళీ    నవ్వుకొన్నాము. 
                          శ్రీ  నరసింహారావు గారు ఏంటో  కృషి చేసి "మన హాస్యం "అనే గ్రంధం    వ్రాసారు. ఆ గ్రంధాన్ని గురించి  మాట్లాడుతూ "ఇది నిజంగా  శాస్త్రీయ   గ్రంధం ,హాస్య రసానికి చెందిన  ప్రధ మ     శాస్త్రీయ  గ్రంధం  "అన్నారు. 
                          ఈ గ్రంధంలో   హాస్యంతో,చమత్కారంతో, హేళన -అవ హేళ నలతో గల వివిధ స్వరూపాల్ని  చక్కగా  చిత్రించారు.  ఎన్నో చక్కటి ఉదాహరణలిచ్చారు . ఇది వారు చేసిన   ఉత్కృష్ట    సేవ అని   చెప్ప వచ్చు.  
                 నరసింహారావుగారు మెత్తని హృదయం  కలవారు. మిత్రులంటే ఎంతో   ఆశక్తి. అదితి   మర్యాదలలో    అందే వేసిన చెయి. సాహితీ  రంగం లో పందెం   వేసి  పరుగులు    తీసిన   వ్యక్తి. కదా ప్రపంచంలో ఒక     యుగానికి   నాంది   గీతం . 
                              



Wednesday, February 20, 2013

హాస్య రస సింధువు:సాహిత్య బంధువు శ్రీమొక్కపాటి నరసిం హ శాస్త్రి

          హాస్య రస సింధువు: సాహిత్య బంధువు
         శ్రీ మొక్కపాటి  నరసింహ  శాస్త్రి
             
                    తెలుగు సారస్వతానికి కొత్త వన్నె  చిన్నెలు  దిద్దగాలవారెందరో   బయలుదేరారు .వారు అనేక సాహిత్య శాఖల్లో నూతనత్వం    కల్పించి  చైతన్య    స్రవంతి   గా   రూపొందించ   గలిగారు. .
                    అలాంటి     సాహిత వేత్తలలో    హాస్యరస   పోషణకు     పూనుకొన్న వారిలో   శ్రీ   మొక్కపాటి వారికిగొప్ప  స్థానం లభించింది . "పిలక"అనే     వ్యాసం తో ప్రారంభ మైన  వారి   హాస్య రచన   అనేక రీతులుగా,అనేక శా ఖలుగావిస్తరించి,విరితోటగా     అవతరించింది .శాస్త్రి గారు అనేక కధలు,నాటికలు, వ్యాసాలూ  వ్రాసారు. వారు వ్రాసిన "బారిస్టరు  పార్వతీశం"అన్నిటా  తలమానికంగా   నిలిచినది . తెలుగు హాస్య రస   సాహిత్యం లోనే "బారిస్టరు   పార్వతీశం"ఒక ఉన్నత   స్థానాన్ని    అలంకరించింది . అందలి హాస్యం ఎందరి    హృదయాలనో కదిలించి   నవ్వించింది .మొ.క్క పాటి వారి  పార్వతీశం,గురజాడ వారి  గిరీశం    చెట్టా పట్టాలు   వేసుకొని నవ్వుతూ,నవ్విస్తూ సంచ రించడం   సాగించారు  సాహిత్యక   వీధుల్లొ.ఇంకా  ఆజంట    నవ్వుల  పంటలు   పండిస్తూనే వున్నారు .వీరిద్దరూ   డాన్ క్విక్ సాట్ -ఫాల్ స్టా పులతో బంధుత్వం    కలుపుకో గాలిగా రంటే అతిశయోక్తి ఎంత మాత్రం లెదు. పారవ తీశం వెండి తెరమీదకు   కూడా   ఎక్కాడు .పాఠకుల  హృదయాలలో  నక్కినక్కి   అదను దొరికి నప్పుడల్లా    నవ్విస్తూ   వుంటాడు ."బారిస్టరు  పార్వతీశం"  రెండు,మూడు   భాగాలుకూడా  వెలువడి నాయి. "అతనినింకా సరి అయిన    గమ్యానికి     చేర్చ లేదు .దాన్ని గురించి     ఆలో చిస్తున్నాను"అన్నారు శ్రీ శాస్త్రి గారు. .శాస్త్రి  గారి నాటికలలో కూడా    చక్కని హాస్యం     గొచరిస్తుంది .
      మొక్కుబడి-అభ్యుదయం
     ********************
                      మొక్కుబడి    అనే   నాటికలో వెంకటేశ్వర ప్రభువుపై భార్యకు గల విశ్వాసం -భర్తకు     ఆ   విశ్వాశం మీద   అవిశ్వా సమ్. ఈనాతికలో చక్కగా  వర్నించారు.విశ్వాసాలకు గలవిలువను,భక్తిని   నిరూపించడంలో ఈనాటిక  ఫల శృతి నందుకొం ది    అభ్యుదయంలో  మానవత్వానికి,యాంత్రిక యుగానికి ఏర్పడిన సంఘర్షణ   చిత్రించబడింది ంఒదతి ప్రపంచ యుద్ధాన్ని ఆధారం చేసుకొని   ఈ  నాటిక    వ్రాయ బడింది .దీనిలొ చక్కనినాతకీయతా,సంభాషణా పటిమా గొచరిస్తున్ది. రంగ స్థలానికి    అనువైన   నాటిక  ఇది. ఎప్పటికి సరిపోయే   సందేశం వుంది
       పెద్దమామయ్య
  అసాధారణ   సమావేశం
*******************
                          పెద్ద మామయ్యా అంటే  వూరి పెద్దఽతని మాటకు తిరుగులెదు. కానీ   అతన్ని మోసం చేసి ఒక పెళ్లి చేసిన   వృత్తాంతం    ఈ  నాటికలో     వస్తువు. చక్కని హాస్యం తో నిండి వుంది నాటిక ఎవోఘన కార్యాలు చేయాలని ఏర్పాటైన సంఘాన్ని గురించిన గాధ  . అసాధారణ సమావెశమ్. సమావేశం ఏర్పాటు చెయ్యడం, సభ్యులు ఎవరి గొడవలో వారు పడటం ,కార్య దర్శి గల్లంతులో    పడటం   చిత్రించారు  శ్రీ శాస్త్రి గారు.వివిధ వ్యక్తుల   మన స్తత్వాలు హాస్యరస  ధోరణిలో వర్ణించ బడి నాయి.
     వారసత్వం_పాతివ్రత్యం
    *****************
                           వెంకట్రావు అనే పెద్దమనిషి భార్యకు   బ్రహ్మచారి మేనమామ ఒకడుంటా డు .వెంకత్రావు  ఆఅస్థి కోసం తాపత్రయ పదతాడు .బ్రహ్మ చారి \బ్రతికుండగానే  ఆస్తి తీసుకోవాలని ప్రయత్నిస్తాడు . అవసరమైతే  ఆబ్రహ్మ చారిణి తామే పోషిస్తామంటాడు . అలాపోషించక తప్పలెదు.  కనీబ్రహ్మ చారి అంతకుముందే      దివాలా  తీసాడు .వెంకత్రావుకి మిగిలింది చాకిరీ  మాత్రమె!
                       పాతివ్రత్యం మం  చి సమస్య గల నాటిక.  నాగరిక లక్షణాలు కల ఒక యువకుడు వివాహ మాడ తాడు .భార్య అమాయకురాలు.   పూర్వ కాలపు మనిషి .ఆవిడ లొ   నాగరిక    లక్షణాలు   కల్పించ లెకపొతాడు భర్త. అతనిలోగల     నాగరికతా   పిపాస     వదల లెదు. అందువల్ల   పరకీయతకు    లోబడతాడు .ప్రాక్పశ్చిమ సంస్కృతుల    సంఘర్షణ    ఈ  నాటికలో   చక్కగా  రూపొందించ   బడింది .
                              శాస్త్రి గారు"కన్నవి,విన్నవి"అనే పేరుతొ   వారి   కధలను  రెండు  సంపుటాలుగా  ప్రచురించారు. వీటిలో పద్దెనిమిది     కధలున్నాయి.   సాంఘిక,రాజకీయ,మత ,సాంస్కృతిక సమస్యలు  వీటిలో    కానీ పిస్తాయి. వీటి అన్నింటిలో      సున్నిత హాస్యం      గొచరిస్తుంది .
        నేను  మా ఆవిడ-
       బండ  సుబ్బుడు
      *************
                   ఒక పెద్దమనిషి    బజారులో  తనని అందరూ ముఖం మీద      పోగతం   వాళ్ళ తను గొప్ప వాణ్ణని విర్ర వీగుతాడు . భార్య మాత్రం    ఆ  విషయం   అంగీకరించదు. అంతటితో  ఊరుకోక   వట్టి  పనికి మాలిని   మనిషి అని కూడా  అంటుంది  ఆయనకు కోపం     వస్తుంది .అంత టితో   ఆవిడగారికి స్వతంత్ర మివ్వడమే     పొరపా టంటారు .ఇక్కడ   చాలా     హాస్య    ప్రధానమైన     సంభాషణ       జరుగుతుంది . "బండ సుబ్బుడు"తన బరువు తగ్గడాని  కి     మందు   పుచ్చుకొంటాడు .పలుచటి    మనిషిగా     మారిపొతాడు గాలిలొ ఎగిరిపోకుండా    బరువుగల    సూట్లు     కుట్టించుకొంటాడు ఆ సూటులో     దాచిన  సీసాలవల్ల   దాని బరువు     మరింత    అయి    అతణ్ణి భూమిమీద   నిల బెడు తుంది  .
       లాభ సాటి బేరం
       అగ్ని పరీక్ష.
      *********
            లాభసాటి బేరం ఏంటో హాస్యం  కల     కధానిక. ఒక బడాయి కో రు   పెద్ద మనిషి      మీసాలు పందెం లో పణం   పెట్ట బడ్డాయి     అ   వి ఒకరు గెలుచుకొన్నారు.  ఆ సమయంలో      ఆ    మీసాల రాయుడొక   సంగీత కచేరీకి వెడుతూ   వుంటాడు. అప్పుడు వాళ్ళు      ఒక వైపు     మీసం మాత్రం    తీసుకొని     తక్కింది     తరువాత  అంటారు .ఈ      దుస్థితి లోంచి   తప్పించుకోడానికి     ఆతడు    -పణం     పెట్టిన మొత్తానికి   రెట్టింపు    డబ్బు     ఇవ్వడానికి    అంగీకరించి   మీసాన్ని రక్షించు కొంటా డు.
    గాజులపాలెం గాంధీ
    ఆకాశ సౌధాలు
   ************
                    గాంధీజీని అనుకరించాలని ప్రయత్నించే అవక తవకల వ్యక్తులపైన      వ్యంగ రచన ఇది.   గాంధీజీ రాజకోటలో ఉప వాసం వున్నా సమయంలో     వ్రాసారీకధ.    ఆ  రోజుల్లో   ఎవరూ  కట్నాలు   తీసుకోరాదనీ,అలా తీసుకొంటే    తానూ   ఆమరణాన్తరమ్    నిరాహార దీక్ష    వహిస్తానని    గాజుల పాలెం   గాంధీ     శపథం చెశాదు.
                    రాజాజీ   అమ్మకం పన్ను విధించిన   సందర్భంలో    శాస్త్రి గారు వ్రాసిన వ్యంగ రచన   ఆకాశ సౌధాలు . శాస్త్రిగారా    సందర్భంలో కొన్ని కొత్త పన్నులు   సూ చించారు. సముద్ర తీరంలో పడుచు   వాళ్ళ వెంట     పడేవారి మీదా ,మీసాలూ గడ్డాలూ ఉన్నవారి మీదా,   పాశ్చాత్య దుస్తులు ధరించే స్త్రీల మీద,   లావుపాటి    వాళ్ళ మీదా,పన్నులు వెయ వచ్చు నన్నారు.  అయితే  కొన్ని కొన్ని      షరతులు  పెట్టారు. గడ్డాల మీద పన్నులు వెయ్యాలి గానీ    ముస్లిం గడ్డాల మీద   వెయకూడదు .లావు వాళ్ళమీద వెయ్య వచ్చుగానీ    కవులూ,గాయకులూ,   నటీనటులు  అయితే   వదిలి వెయ్యాలి.   ఇలా  ఏంతో      హాస్యం కల్పించారీ  కధలొ.
    మా బావు మరిది పెళ్లి
   రంగ    గ్రామ సింహ   రత్తయ్య
***********************
          మా   బావుమరిది పెండ్లి అనేది     మరో కధ.   పెండ్లి కూతురి   తండ్రి పారే కష్టాలూ,తరువాత  తాల్చే   అవతారం ,వగైరాలు   అందులో    వర్ణించ బద్దాయి. ఒక యువకుడు    నటుడుగా  మారి ఆ కధను నిత్య జీవితంలో
కూడా   ప్రతిబింబింప     చేయాలని     తాపత్రయ పడటం ఆ    సంభాషణలతో   ,పోజులతో ఇంట్లో వాళ్ళను దుంప  తెమ్పటం    ఈ కధలో గల   హాస్యమ్. పద్మ వదిన,అగ్ని పరీక్ష, న్యాయం అనే కధలు వ్రాసారు. ఆంద్ర ప్రదేశ్  సాహిత్య అకాడెమీ కానీ,ప్రభుత్వం కానీవీరి రచనల్లో   వీరి హాస్యాన్ని మూట     కట్టి దాచడం అవుసరమ్.
       శాస్త్రి గారు,శిల్ప సౌందర్యం హాస్యరసం    అనే   గ్రదాలు వ్రాస్తున్నారు. అవి కూడా   త్వరలో వెలువడ కలవు.శాస్త్రి గారు హాస్యరస సింధువు,గొప్ప సాహిత్య    బన్ధువు.            
        ప్రపంచం లోవున్న    రసమంతా   కలిపితే హాస్యపు విలువకు   తక్కువే   అవుతున్దిఽన్నరొక రచయిత.శాస్త్రి గారి   హాస్యం    మనకు     అమూల్య సంపద ..
                               
[ఇది     మొక్కపాటి వారు     జీవించి వుండగా     రావూరుగారు వ్రాసిన వ్యాసం,ఆంద్ర ప్రభలో ప్రచురిత మయింది .సంవత్సరం     తెలియదు.]

Sunday, February 17, 2013

ఎర్రమబ్బు

                                     ఎర్రమబ్బు

          ఎర్రమబ్బుల  చాటు మాటున
          ఏడు గుర్రాల రధము నెక్కి
          సూర్య దేవుడు బయలు దేరాడు.
               తూర్పు దిక్కున వెలుగు తోచింది.
               ప్రకృతి అంతా సొగసు పరిచింది
          ఎంత అందము ప్రకృతి నోదిగెను!
          ఎంత గానము ప్రకృతి   సాగెను !
                పసిడి లేళ్ళ వి  పరుగులెత్తెను
               చిలుక గుంపులు రెక్కవిసరెను 
               

Tuesday, January 15, 2013

ఉర్వి-ఉయ్యాల

                                     ఉర్వి -ఉయ్యాల

              ఉర్వి యంతా పెద్ద ఉయ్యాల గాగ 
              తారాధ్వమే తళుకు  చాందినీ గాగ 
              దిశలెల్ల  దిగజారు  జలతారు తెరలుగా 
              నాలుగూ ధర్మాలు  బలమైన త్రాళ్ళుగా 
              ఊగుతున్నాడమ్మ   ఊగుతున్నాడు 
              ఉయ్యాలలో స్వామీ    ఊగుతున్నాడు 

              లోకాల పుణ్యమే పులిగోరుకాగా 
              మునుల స్తోత్రంబులే  మొల త్రాడు కాగా 
               ముజ్జగంబుల సౌరు    కాలి గజ్జేలుగా 
              జ్యోతిర్లతా వళులు    చేతి వత్తులుగా 
              కళ్యాణ గానమే   కక్కుటుంగ రమన 
             ఊగుతున్నా డమ్మ -ఊగుతున్నా డు 

            తోరంపు ఆత్మలే   హారతులు పట్టా 
            వేదాంత వాసనలు  దిశలెల్ల  చుట్ట 
             మూలంపు టమ్మయె   ముంగురులు ముట్ట 
            చైత్రాంగనలె  వచ్చి     చేక్కిళులు   ముట్ట 
              ఊగుతున్నాడమ్మ  ఊగుతున్నాడు 

            జడదారు లెల్లరు పడతులై  వచ్చి 
            పంతాలతో తొట్టి    ప్రక్కలను జేరి 
            కోటి కోయిల లట్లు    గొంతు సవరించి 
           డోల నే ఊపగా    జోలలే పాడగా 
           ఊగుతున్నా డమ్మ -ఊగుతున్నా డు 

           అమల మందాకినీ గలగలల ఓలే 
           ఎందుకయ్యా స్వామీ అన్ని కిలకిలలు 
          పాపాల కొండ ల్లు    పడతన్ను రీతి 
          ఎందుకయ్యా స్వామీ కాలి సాముల్లు 

           బంగారు శంఖులో  ఉంగ నే తెచ్చి 
           అల్లదె వచ్చినది  అమ్మ   యశోద 
           అందుకా నా   స్వామీ అరమోడ్పు కనులు 
           ఎవరు నేర్పారయ్య ఈ కొంటి పనులు ?
           ఉంగ కాదది స్వామీ అమ్మలో బెంగ 
           
          పుప్పొడి గంధాలు కుప్ప పడే నవిగొ!
         నలుగు పెట్టగ వచ్చే   వెలుగైన  ఉషసి 
         పన్నీటి మున్నీరు  ప్రవహించే నదిగొ!
        బొబ్బ పోయగా వచ్చే తొలిప్రొద్దు కన్నె!
        మంద హాసమే  కాని,   తొందరే లేదు  
         తొట్టె లోపలే నీకు పట్టమా స్వామీ?

                  
            
     
               

Tuesday, January 1, 2013

చిరు చిరు మొగ్గల

                    చిరు చిరు   మొగ్గల

రాధ-చిరు   చిరు   మొగ్గల   చిలి పి    తెరలలో
     చిటికెలు   వేయుచు,     చిలిపిగా బ   నవ్వుచు
     వడి  వడిగా   వచ్చెను    వసంతరాగం
    ఎవరి కోసమీ సుమ  భోగం !

కృష్ణ -పిల పిల గాలుల పుప్పొడి దోగ
        ఈలలు వేయుచు     ఎదలను   దోచుచు
        ఆమని రాత్రుల    యామిని రాగా
        ఎవరికోసమీ    అనురాగం!

రాధ-ఎవరి కోసమీ  సుమ భోగం!

కృష్ణ-ఈఅనురాగమ్-ఈ సుమ భోగం !

రాధ -పూల తోటలో-కాలి బాటలో
        మురిపించేడు నీ  మురళి పాటలో
       తూగిన నా ఎద -ఊయెల లూగగా
       ఎన్ని నాళ్ళ దీ   సహయోగం

కృష్ణ-ఎవరి కోసమీ  సుమ భోగం!
        యమునా తీరమున    మురళి   గానమున
        కనులరమూయుచు కాలువలు దూ యుచు
        మయూరివలె    నీ    వయారి    నాట్యం
      ఎవరికోసమాహ్వానము?
రాధ -ఎన్ని నాళ్ళ దీ    సహయోగం!
       మరచిన తలపులు  పరుగిడి రాగా
       విరిసిన   వలపులు   పరువము   దోగా
       మధుర భావనలు  మనసున దోగా
       ఎవరి కోసమీ    మధుమాసం
కృష్ణ-అంతులేని   సహవాసం

రాధా-ఆరిపోని చిరు హాసం
       

Sunday, September 16, 2012