అమ్మకోముద్దిచ్చి
చెంచు కర్రొక చేత చిన్ని మురళొ క చేత
నవ్వుతూ వచ్చేటి నా చిన్ని కృష్ణా !
పాడ వోయీ పాట వేడు కొంటున్నా
నీ మురళి గానమే నా బ్రతుకు తెరువోయి ||చెంచు||
అమ్మ నీకోసమై అటు చూసి ఇటు చూసి
కన్నా !కన్నా!అంటూ కలవరిస్తోందోయి
అమ్మకో ముద్దిచ్చి ఆడుకోవోయీ ||చెంచు||
No comments:
Post a Comment