Sunday, September 16, 2012
Monday, September 10, 2012
nagali-nakshatraalu
రేడియో నాటిక నాగలి -నక్షత్రాలు రచన
కీ శే రావూరు వెంకట సత్య నారాయణ రావు
మాధవ్-దివ్య ప్రభాతం శాంతా!
శాంత -బియ్యపు గింజలు స్వామీ !
మా- శుభోదయం శాంతా!
శాం -నిజమేస్వామీ!......ఇంట్లో బియ్యపు గింజలు లేవు......పిల్లలు ఎనిమిదింటికల్లా బడికి వెళ్ళాలి.
మా -ఏం అయిపోయినాయా?డబ్బాలో లేవా?
శాం -డబ్బాలోనా?........అది నాకంటే సిగ్గుపడి కొట్టుకొంటున్నది.అన్నదానానికి హస్తం జాచి నట్లుగా బియ్యంతో నిండి వున్నప్పుడా పాత డబ్బా పకపకలాడుతువుంది........అయిపోయినప్పుడు గిల గిలా కొట్టుకొంటున్నది.
[డబ్బా సందడి]
శాం -అలా చెవులు మూసుకొంటారేం?
మా-ఏం చెయ్యను మరి? ఇటు పిట్టల కల కలారవాలు కమ్మటి గానం వినిపిస్తుంటే,ఆనందంతో వింటున్నాను .......
వెనక ఈ డబ్బాల సంద డి ఏమిటి?
శాం -ఆడబ్బా మన బిడ్డల కోసం తాపత్రయ పడుతోంది.కడుపునిండా అన్నం పెట్టి,చక్కగా ముస్తాబు చేసి బిడ్డల్ని ముద్దులాడుతున్నప్పుడు వారి పకపకల ముందు ఈ పిట్టల కలకలారవాలెంత స్వామీ!
మా-అప్పుడే ఆగిన్డెం డబ్బా!
శాం -ఒకసారి హెచ్చరించింది....వూ రుకొన్ది .మీ భావ లహరికి అడ్డం రావడం దానికి మాత్రం ఇష్టమా?ఇంత సంభాషణ దేనికి? మనకు కావలసింది బియ్యపు గింజలు.......ఈ రోజుకో ఆరు దోసిళ్ళు,ఆరు దోసిళ్ళు......
ఈ రోజుకో ఆరు దోసిళ్ళు మాత్రమె!అంతే! రేపటి మాట ఆ పరమాత్మునికి ఎరుక .అదుగో పెద్దవాడు కదులు తున్నాడు పక్కమీంచి........లేవగానే "అమ్మా! వంట త్వరగా చెయ్యి........లేకపోతె బళ్ళో లేటు మార్కు పడుతున్దంటాడు .
మా-శాంతా పక్కింట్లో పట్రా
శాం- పక్క ఇంట్లోనా?ఇంకా ప్రజలు కంటి తలుపులే తెరవ లేదు,ఇంటి తలుపులెం తెరుస్తారు?ఎవరు బియ్యం కొలిచి నా కొంగులో పోస్తారు?అయినా ఇది మొదటి సారి కాదుగా!
మా-బాధ పడకు శాంతా!.......కొంచెం కూడా బియ్యం పిల్లలకు కూడా సరిపోవా?
శంఉండండి చూచి - వచ్చి చెపుతా ఎన్ని వున్నాయో!
మా-నా జీవిత మంతా నక్షత్రాల వంక చూడడం తోనే సరి పోయింది.కవనాల లోంచి వీచే మలయ పవనాలతోనే జీవితం హాయిగా నడిచి పోతున్దనుకోన్నాను. ఒక్కసారి నేలవంక చూడ లేదు.
శాం- ఇరవై ఆరు,ఇరవై ఏడు,ఇరవై ఎనిమిది ,ఇరవై తొమ్మిది పైన అర ముఫ్ఫయి గింజలకు అర తక్కువ.
మా-ఏం లెక్క అది శాంతా?
శాం- బియ్యపు గింజలు....డబ్బాచుట్టూ పడ్డవి-అంచున అతుక్కున్నవి ఏరి తెచ్చి లేక్కపెడుతున్నాఅర తక్కువ ముఫ్ఫయి .....అక్షింతలకే చాలవు,భక్షణ కేం సరిపోతాయి?
మా-శాంతా! ఈ జ్ఞానోదయం చాలు.....ఇంకా ఎక్కువ చెప్పక్కర్లా....గింజలు లెఖ్ఖ పెట్టి ,పంజరంలో వున్న చిలకను బాకుతో పొడిచినట్లు నా హృదయాన్ని పొడవకు శాంతా!నిత్య జీవితాన్ని అర్ధం చేసు కొంటానిక బియ్యపు గింజల్లో కల జీవ శక్తినే కాదు వేదాంత రహస్యాన్ని కూడా అర్ధం చేసుకొంటాను.శాంతా!ఈ నాటినుంచీ నిత్య జాగారం చేసి ఓగిర సమస్య తే ల్చుకొంటాను.నువ్వు లోపలి వెళ్లి పొయ్యి రాజేసి ఎసరు పెట్టు.......ఎలాగోలా బియ్యం తెస్తాను.బియ్యపు గింజల కోసం మన నేయ్యాన్ని దూరం చేసుకో లేను శాంతీ!
శాం- నేనెప్పుడూ మీ చరణ దాసినే!పసికందుల పోషణ సమస్య.....నన్ను కర్తవ్యతా మూదురాల్ని చేస్తుంది...అలాటి సమయంలో నేను మాట్లాడే మాటలను దూషణలు గా భావించ కండి. ....మీ పాదాలకు నమస్కరిస్తాను.
మా-శాంతా!నీ చిత్త స్థైర్యాన్ని పోగొట్టిన నేరాన్ని అంగీకరిస్తున్నాను.నీ నేత్రాలలో ఇదివరకు విర బూసిన కాంతులు క్రమంగా వెలిసి పోయినందుకు కారణం నేనే!శాంతా!దూరతీరాలనుంచి తరలి వచ్చే ముర్ముర తరంగాలవంటి నీ సన్నటి ఎలుగును మార్చి వేసిన నేరం కూడా నాదే!
శాం-నేరాల మాట దేనికి లెండి.సంతానాన్ని సంతోషంగా పెంచాలేకపోతున్నచింత ఒక్కటితప్ప......నాకేం లోపంవుంది!
మా-వెళ్ళు నిప్పు రాజేసి ఎసరు పెట్టు
శాం- అలాగే!
మా-ఈనాడు అర్ధం చేసుకొన్నాను....జీవిత రహస్యం.ఈ కవిత్వాలకు,కళలకు ,శాస్త్రాలకు, చర్చలకూ,పదవులకూ,ప్రాబల్యానికి వెనుక అసలు వేదాంతం ఒకటి వుంది.అది ఆహారానికి చెందిన వేదాంతం ,అత్యద్భుత వేదాంతం.ఆహార సమస్య తే లందే...విహారాలు లేవు,వినోదాలు లేవు.మానవుడికి అసలు ప్రగతే లేదు.
.......ప్రాబల్యం లేదు...ఆహార సమస్య ప్రప్రధమ సోపానం ...దీన్ని పరిష్క రించే మార్గం చూడాలి ముందు.....ప్రస్తుతం ఈనాటి పరిష్కార మార్గం ఆలోచించాలి.బియ్యం....ఆరు దోసిళ్ళ బియ్యం..ఎలాగోలా సంపాదించాలి .తప్పక సంపాదించి......ఆ....ఉపాయం తట్టింది.ఆకలికి కవిత్వానికి చాలా దూరం.భాషా వైదుష్యానికి జీవిత పోషణకు పొంతన కుదరదు.ఉపాయం దొరికింది....వెళ్లి బియ్యం తేవాలి.
**************************************** తక్కినది రేపు
నాగలి -నక్షత్రాలు రచన
రావూరు
రాయలు-అమ్మా!అమ్మా!
శాం -ఇలా వంటింట్లోకిరా౧
రా- ఓ అప్పుడే వంట చేస్తున్నావే! రోజూ ఇలాచేయ్యమ్మా!చప్పునబడికి వెడతాను.
శాం-అలాగేరా!.......అలాగే! {గాద్గాత్యం తో} నువ్వు ముఖం కడుక్కో .కాసిని పాలున్నాయి తాగుడువుగాని....
రా- నేను ముఖం కడుక్కొని వస్తా..
శాం- పొయ్యిమీద గిన్నె చూచి పొంగి పోయాడు బిడ్డ.....ఎసట్లో బియ్యం ఎక్కడున్నాయో తెలియక కొట్టుకొంటూ న్నానని వాడికేమి తెలుసు? ఆయన సావిట్లో లేరు.........ఆయన కవితా హృదయానికి నేనో కారు మబ్బునయాను.
ఎక్కడికెళ్ళారో ఏమో! ********************
మా-అదికాదు షావుకారుగారూ.. ఇవి చాలా విలువైన గ్రంధాలు...వీటిని వాచస్పత్యా లంటారు...అన్ని మాటలకు అర్దాలుంటాయి దీనిలో......వీటిని మీదగ్గరున్చుకొని నాకో ముఫ్ఫయి దోసిళ్ళ బియ్యమియ్యండి. అయిదురోజులు వస్తాయి.ఎంత అవుతుందో చెప్పండి.తర్వాత సొమ్ము తెచ్చి ఇచ్చి ఈ గ్రంధాలు తీసుకొంటాను.
షావుకారు -వీటినేం అంటారూ?
మా-ఇంగ్లీషులో డి కష్టనరీ లంటారు....
షా -డిక్ష్టనరీలు మాకెందుకు!డి టేక్తివు లయితే చదువుకోడానికి ఇచ్చి రోజుకో పావలా అద్దె సంపాదించు కో వచ్చు.....వడ్డీ అన్నా గిడుతూ ఉంటింది.తూనిక్కి ఇస్తే ఇయ్యి లేకపోతె తీసుకెళ్ళు.
మా-తూనిక్కా?వీటిని చించి పొట్లాలు కడతారా?
షా-అమ్మే వస్తువు మీద ఆరా లెండు కయ్యా?కావాలంటే తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకొని పసుపు,కుంకుమ తో పూజ చెయ్యి....నే వద్దన్నానా!
మా- {బాధతో} నిజమే! అలా చేయ వలసిన గ్రంధాలే ఇవి...లక్ష్మిని రప్పించడం చేత .....సరస్వతిని దూరం చేసుకో వలసి వస్తోంది.అక్షర జ్ఞానం తెలిసిన వాడెవడూ ఇలాటిపని చెయ్యడు.
షా- బాగానే వుంది.....ప్రొద్దున్నే వచ్చి దుకాణం దగ్గర కళ్ళ నీళ్ళే మిటయ్యా?పుస్తకాలు పట్టుకెళ్లు.
ఆరు దోసిళ్ళ బియ్యం ........ఆరు దోసిళ్ళ బియ్యం
మా-శాంతా {అరుస్తాడు}
షా- శాంత ఎవరయ్యా ఇక్కడ? శాంతాలేదు గీంటా లేదు. దిక్కుమాలిన సంత తెచ్చి పెట్టావు దుకాణం దగ్గర .పైగా ఆ పిచ్చి చూపులేమిటి? మతి చెడింది గావునను......అవతల కెళ్ళు బయూ ....కావాలంటే నీకో బీడీ ముక్క ఇస్తాను
మా- తూచుకోండి పుస్తకాలు...ఎన్ని బియ్యం వస్తాయో ఇవ్వండి...త్వరగా ఇవ్వండి.
షా-అలా అన్నావు బాగుంది.రాళ్ళు చూసుకో.....తూకం చూసుకో...దగా మా వంశం లో లేదు.ఓ దమ్మిడీ పోయినా ఇష్టమే!
మా-అత్తలు చిన్చేస్తారేం?
షా-ఏం చేయ్యమన్నావు?అవే అర కిలో వున్నాయి.
ఎందుకు పనికొస్తాయి?ఈగల్ని తోలుకోవాలి...పట్టు చూసుకో పద్నాలుగు అణాలు....బియ్యం పట్టు.
మా-ఈసంచీలో పొయ్యండి..ఎన్ని..
షా-సరిగ్గానే పోస్తున్నా ....ఇంకో చారెడు వేస్తాలేపైన పట్టెడన్నం ఒకళ్ళకి పెట్టమన్నారు పెద్దలు.....పెట్టి చుట్టాలోచ్చారనుకోవాలి.
మా-=ఇవి ఎన్ని దోసిళ్ళ వుతాయ్ ?
షా-ఇంటికి పట్టుకెళ్లు పెద్ద పళ్ళెంలో పోసి లెక్కపెడుతూ మీడంపతులు తలంబ్రాలోసుకు చూడండి ...లెక్క చూసుకోవచ్చు.చక్కగా సంబరాలు పడొచ్చు.
మా-తలంబ్రాలు సంబరాలు "సిరిలేనివాడా!సిగ్గుపడతానికికూడా సిగ్గు పడతా వెందుకు''?అంటుంది సంఘం
షా-కవిత్వంలాగా వుండే!...ఇంకేం?నీబోటి వాళ్లకు నిత్య కళ్యాణ మేలే ....వెళ్ళు .
మా-పచ్చ తోరణం మాట మరిచిపోయారేం?
*************************
నాగలి-నక్షత్రాలు రచన -రావూరు
{౩} {ఒక బియ్యం ఫాక్టరీ కూస్తుంది బిగ్గరగా....లారీల హారన్లు మ్రోగుతూ వుంటాయి .పదేళ్ళ పిల్ల గావురుమని ఏడుస్తూ వుంటుంది.}
ఒక వ్యక్తి - ఏమిటమ్మా! బియ్యం ఒలకబోసుకోన్నావుగా!అయ్యో! అన్నీ బురదలో కూడా పడిపోయాయి.
పిల్ల-బియ్యం....బియ్యం...{ఏడుస్తుంది}
లారీల హారన్
డ్రైవర్ -తప్పుకోండి......తవ్వెడు బియ్యానికేమిటా గోల! తప్పుకొండిలారీ వెళ్ళాలి.
వ్య-డ్రైవరు గారూ!తవ్వెడు బియ్యం ఎక్కడి నుంచి వస్తాయి బీద వాళ్లకి?......అవి ఒక పూట రెండు మూడు
ప్రాణాలు నిల బెడతాయి.
డ్రై-సరేలే! తప్పుకొండయ్యా! ఎనిమిది ట్రిప్పులు తిరగాలి ,ఎనిమిది వేల బస్తా రవాణా ఈ వారం లో
హారన్ కొడుతూ వుంటాడు.
మరో వ్యక్తీ -ఎనిమిది వేల బస్తాల రవాణా!ఇక్కడ బీద కొంపల్లో తవ్వెడు బియ్యానికి లేదు గతి .
పిల్ల-నాబియ్యం ....నా బియ్యం........అమ్మ నన్ను కొట్టి చంపుతుంది.
వ్య -ఏడవకు తల్లీ!ఎలాగో అలా నేను బియ్యం తెచ్చి ఇస్తాలే! ఏడవకు.
మవ్య- దగ్గరలో బియ్యం షా పులన్నా లేవు.ఫాక్టరీ ఆయన్ని అడుగుదామొక శే రు బియ్యం ఇస్తాడేమో !
వ్య -పద .....
మా వ్య -ఏమండీ!పాపం ఆ అమ్మాయి బియ్యం బురదలో పోసుకుంది .ఒక శేరు బియ్యం ఇవ్వండి ఏడుస్తోంది.
యజమాని-ఏడిస్తే బియ్యం వస్తాయా?కన్నీళ్ళతో కష్టాలు గడుస్తాయా? మేమూ చాలా కష్టాల్లో వున్నాం .
మొన్న అరవై బస్తాల బియ్యం ముక్కి పోయినాయని అవి తింటే ప్రజలకు జబ్బులోస్తాయని ఆఫీసరు గారు తగుల బెట్టించారు.
వ్య- బస్తాల లెఖ్ఖ దేనికయ్యా?ఒక్క శేరు బియ్యం పొయ్యి......ఎసంచీ చాటు నైనా వుంటాయి.......నీకు పుణ్యం వుంటుంది.
య-పుణ్యమా? పుణ్యానికి పొతే పెళ్ళాం మెళ్ళో పుస్తెలు కూడా మిగలవు.ఇవి బియ్యమయ్యా బియ్యం ......ఇసక కాదు.
వ్య-ఇంత కష్టం గా మాట్లాడుతున్నావే! పోనీ డబ్బులిస్తాం .
య-వుంచు వుంచు లేకపోతె ముడుపు కట్టు.....
మా వ్య-తిరిగి తిరిగి మిల్లు చక్రాలన్నా అరుగుతాయి కాని వీళ్ళ మనసులు కరగవు .కొని ఇద్దాం రండి.
పిల్ల-అ మ్మా[ఏడుస్తుంది]
అమ్మ- ఏమిటే! అలా ఏడుస్తున్నావు?
ఫై-బియ్యం బురదలో.....
అ -ఓసి నీదుంప తెగా!.....నోటికాడ బియ్యం బురదలో పోశా వుటే![రెండు కొడుతుంది,పిల్ల గావురుమని ఏడుస్తుంది.]
అ- ఎరక్కపోయి నిన్ను పంపానే!ఎసట్లో పోద్దామని ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నా.ఇంత అన్నం తిని రిక్షా వేసుకు పోతానని మీ అయ్యా కూర్చున్నాడు.తిని పనిలోకి వెడదామని నీ అన్న కూర్చున్నాడు.దిక్కుమాలిన దానా!నోతోకాడ కూడు తీసావుటే!.......[ఇంకో రెండు కొడుతుంది,పిల్ల గోల పెట్టి ఏడుస్తుంది.]
మాధవ్ -ఎందుకమ్మా అలా కోడతావ్?
అ -కొట్టాలా-చీల్చాలా?బియ్యం బురదలో పోసింది.గింజ దొరక్క గిజగిజలాడే రోజులు .
మా-పోయ్యాలని పోస్తుండా!ఏదో చిన్నతనం...
అ-చిన్నతన మేమిటి?అది మాత్రం అన్నం తినడంలా!బియ్యం విలువ తెలియద్దూ!
మా-తినేవాల్లందరికి తెలుస్తుందాఅమ్మా?నేను నలభై ఎల్ల నుంచి తింటున్నానుఇవాళే తెలిసిందివాటి విలువ.నా సంచీలో బియ్యం వున్నాయి.....కొన్ని తీసుకో అమ్మా!ఆ అమ్మాయిని కొట్టకు.
[అన్నపూర్ణ కావిడి గంటలు మొగి స్తూఒక బిక్షకుడు వస్తాడు.]
బిక్షువు-అయ్యా! మీరాగండి......నా అన్నపూర్ణ కావిడిలో బియ్యం వున్నాయి.....ఇవి పోస్తాను ఆ తల్లికి ....మీరు చూస్తే పిల్లలుగల తండ్రి లాగా వున్నారు.మీరవి ఇంటికి తీసుకెళ్లండి.
మా-నువ్వు ఇంటింటికి తిరిగి సంపాదించుకొని వుంతావవి.మళ్ళీ ఎక్కడ తిరగ్గలావ్?
బి-నే పుట్టింది తిరగాడానికే! ఇంటింటికి ఇన్ని బియ్యపు గింజలు,ఇంటింటిముండు దీవెనల గంటలు.......నా అన్నపూర్ణ కావిడి అక్షయం గా వుంటోంది ఇంత వరకు.పది గుమ్మాలకొక గుమ్మంలో నయినా దాన హస్తాలు ముందుకు సాగుతూనే వున్నాయ్.మరేం ఫరవాలేదు.నా బియ్యం పోస్తాను ఇదుగో అమ్మా తీసుకో![ఫాక్టరీ కూస్తుంది బిగ్గరగా]
మా వ్య -ఆ యజమానికన్నా ఈ సాదువులో ఎక్కువ త్యాగం వుంది.సిరి ఎక్కువయిన కొద్దీ త్యాగం తరుగుతున్దంటారు పెద్దలు.
బి- ఇందులో త్యాగామేముంది బాబూ!పది ఇళ్ళ దానం.ఈ పుణ్యమా తల్లులకు దక్కుతుంది.
పి-తాతా!తాతా!
బి-నా కాళ్ళకు మొక్కుతావు దేనికితల్లీ!నే చేసింది ఏముందీ!కాసిని బియ్యపు గిజలు.....లే తల్లీ!
మా-తాతా!కాసిని బియ్యపు గింజలు అంటున్నావ్ !వాటిలో ఎంత జీవ శక్తి వుంది?ఎంత వేదాంతం దాగివుంది?
ఈ రోజే ఆ పరి శీలన ప్రారంభించాను.కాసిని బియ్యపు గింజలు......లోక కళ్యాణ మంతా వెతిలోనే వుంది.
అ-తాతా!నీ బియ్యం తీసుకో ....నేను కోపం తో బిడ్డను కొట్టాను.దరిద్రం లో వున్నా బాధ అది తాతా!....నీ బియ్యం నువ్వు తీసుకో!
బి-అదేమిటమ్మా!నా బియ్యమేమిటి?నీ బియ్యమేమిటి?ఆ బియ్యం అవుసరం వున్నవి.నాకు తొందర లేదు.తీసుకెళ్ళు....నా కూతురు లాటి దానివి.
[ఫాక్టరీ కూత పెడుతుంది.]
బి-వీధి వీధినా ఫాక్టరీలు కూత పెట్టాలి.ఇంటింటా బియ్యం కుప్పలు పడాలి.
[గంట మ్రోగిస్తూ వెళ్లి పోతాడు.]
[4 నాగలి -నక్షత్రాలు రచన-రావూరు
aమా- శాంతా!ఇవుగో బియ్యం ....త్వరగా అన్నం వండు.
శాం-ఎలాతెచ్చారో! మిమ్మల్ని తిప్పలు పెడుతున్నాను.
మా-కాదు...కాదు....దారిలో పెడుతున్నావు.తరవాత మాట్లాడదాం,త్వరగా వంట చెయ్యి.
శీను-నాన్నగారూ..
మా-ఏమిటి బాబూ!
శీ -అమ్మకానికి పర్యాయపదమేమిటి!
మా-అమ్మకానికా!పర్యాయ పదమా?
శీ- లేదాండీ ....
మా-ఉన్నాయ్.విక్రయం ,ఆత్మ హత్య
శీ-ఆత్మ హత్య కూడావుందా నాన్నగారూ!
కొన్నికొన్ని సందర్భాలలో నాయనా!ఆత్మ ధనాన్ని అమ్ముకొన్నపుడు అది ఆత్మ హత్యే అవుతుంది.....అయినా ఈమాట నీకు వద్దులే!
శీ-వ్యధ అంటే ఏమిటి నాన్నగారూ?
మా-వ్యధ అంటే వేదన నాయనా,మనో వేదన
శీ-ఏమిటి నాన్నగారూ అంత బాధ పడుతున్నారు ఇవాళ? పత్రికకి పంపిన వ్యాసం ఏదైనా తిరిగి వచ్చిందా?
మా-లేదునాయానా వ్యాసం తిరిగిరాలేదు.......గ్రాసవాసో దైన్యత్వం లోచిక్కిన జీవి మనో వేదన నాయనా [తెప్పరిల్లి]శీనూ వ్యాసాల సంగతి,గ్రాసాల సంగతి నీకెందుకులే గాని..... చక్కగా స్నానం చేసి, అన్నం తిని బడికేల్లిపో నాయనా
శీ-అలాగే నాన్నగారూ!వెడుతున్నా.
మా-దోసెడు బియ్యం[బయటనుంచి మాధవరావుగారూ అనికేక]
మా-ఎవరూ? రండి రండి....గోపాలం గారా !
గోపాలం -నేనే!ఉంటారో లేదో అనుకొంటూ వచ్చా!ఒకటే అనుమానం నాకు మాధవరావుగారూ-ప్రతిదానికీ అనుమానమే!
మా-అసలు బ్రతుకే అనుమానం ....అందులో అనేక రకాల అవమానాలు {నవ్వుతాడు]
గో-కవులుమీరు,మాల గుచ్చినట్లు మాట్లాడుతారు.....మాకలారావుమాటలు .
మా-మీరు శాస్త్రజ్ఞులు లోకానుభవం కలవారు.అనేక సత్యాలు సూత్రా ప్రాయం గా తెలుసు మీకు.
గో-వాటిలో ఏంటో సంతృప్తి వున్నా మాట నిజమే!కానీ దేశం సుభిక్షం గా లేదన్నచింత తప్పడం లేదు.
ముఖ్యం గా పంటల మాట ఆలోచించండి.
మా-ప్రస్తుతం నేను వారి పంటను గూర్చి పరిశోధన చేయ తలిచాను.ఆహారం తర్వాతనే అన్ని సమస్యలు .ఏనాడు పుట్టిందో వరిపంట.
గో-వేదకాలం నుంచి వుంది పురాణాల్లో వుంది.ఆ కాలం లో రాజులు, ఋషులు వ్యవసాయం చేసేవారు.జనక మహర్షి గొప్ప రైతు,వసిష్టుడూ నాగలి చేత పట్టాడుట.ఎన్ని పదవులున్నా,ఎంత అధికారం వున్నా,భూదేవిని కొలవడంలో వున్నా శాంతి మరో దాంట్లో లేదు మాధవరావుగారూ.
మా-ప్రతి వ్యక్తీ వ్యవసాయం చేయ్యాలంటారా?
గో-స్వయం సమృద్ధి అనే విషయం మీద నీనొక గ్రంధం వ్రాస్తున్నాను.అందులో పోతనగారి మీద పది పద్యాలు కావలిసి మీదగ్గరకోచ్చాను.ఈనాటి ప్రపంచానికి ఆయన ఆదర్శ మూర్తి.భూదేవిని ఆశ్రయించి ,జీవితానికి కావలసిన ప్రశాంతిని సంపాదించి ,ఆ ప్రశాంతత లోనుంచి పవిత్రమైన కవిత్వం వ్రాసి పునీతుడయాడు
మా-అవును...ఆహారం కోసం పరుల నాశ్రయించ వలసి వస్తే ఆయన ఆ పరమ పవిత్ర మైన భాగవతాన్ని అనువదించ కలిగే వారు కాదు.అనువదించినా ఆ కవిత్వమలా అమల మందాకినీ ప్రవాహంలాగా వచ్చి వుండేది కాదు.
గో-మనమేనని విద్యలు నేర్చినా ,ఎంత విజ్ఞానం సంపాదించినా ...కడుపు నింపుకొన్న తర్వాతనే వాటి సోంపు తెలిసేది.వాయుభక్షణ,జలభాక్షణతో జీవిన్చాలెం మనం .వినండి ఒక జానపద గేయం లో ఎం వుందో....
పాతొడ్లు దంచాను
బానలో పోసాను
కొత్తోడ్లు దంచాను
కుండలో పోసాను
అటుకుల్లు దంచాను
అటికలో పోసాను
ఎపొద్దు లెటుపొతే
నాకేమీ!
ఏ సుద్దు లెటు చెపుతే
నా కేమీ!
గిన్నెల్లో అన్నమ్ము
వెన్నెల్లో విందులు
ఎన్నెన్ని పకపకలో
ఎన్నెన్ని చక చకలో
మా-గోపాలం గారూ....గొప్ప పాత వినిపించారు.జీవిత ధర్మం అంటా అందులో ఇమిడి వుంది. నిత్యం ఆహారాన్వేషణ కోసం బయలుదేరే జీవులకి ఎం స్థిమితం వుంటుంది?"గిన్నెల్లో అన్నమ్ము,వెన్నెల్లో విందులు,ఎన్నెన్ని పకపకలో, ఎన్నెన్ని చక చకలో"అలాటి జీవితం కావాలి గోపాలంగారూ!
గో-కావాలంటే ఎందుకురాదూ? నా ఆశయం చెప్పమన్నారా?ప్రతి కుటుంబం కనీసం అయిదెకరాల వ్యవసాయం చేయాలి.అక్కడితో బియ్యపు గింజలు వెతుక్కోవడమనే సమస్య తీరుతుంది.
శీ-నానా అన్నం తిన్నాను...క్యారియర్ తీసుకు బడికి వెడుతున్నాను.
మా-మంచిది బాబూ బళ్ళో అన్నం పారేయ్యకున్డాతిను.
శీ- పారేయ్యను నాన్నగారూ .....అమ్మచెప్పింది......పిల్లల్ని పెంచేది అమ్మా,నాన్నా కాదు అన్నమేఅని.
గో-అమ్మా,నాన్నలిని పెంచింది ,పెంచేది కూడా అన్నమే!....ఈ విషయమే మాట్లాడుతున్నాం.
మా-నువ్వు వెళ్లిరా నాన్నా!గపాలం గారు ఏదో చెపుతున్నారు.
గో-ప్రతి కుటుంబానికి ఇల్లెంత అవుసరమో పొలం కూడా అంటే అవుసరం.కుటుంబం లో కనీసం ఒక్కదయినా వ్యవసాయం చేయాలిందరికీ సరిపోయే ధాన్యం పండించాలి."నాలుగెకరాల పొలం ,నట్ట నడుమ ఒకపాక" ఇది నా స్వప్నం.
మా-అలాటి అదృష్టం నా బోటి వాళ్లకు పడుతున్దంటారా?
గో-మీబోటి కవులు "సుజలాం,సుఫలాం.అంటూ ముందుగా దిగాలి రంగం లోకి.భూమాత లోగల కరుణను ,ప్రకృతిలో గల ఆనందాన్ని మీరనుభావించ లేకపోతె ఎవరనుభ విస్తారు? నాగలి చేత పట్టాలి.....నవ్వుతూ పొలం దున్నాలి.....అలాటి అపర పోతనాలు ఎందఱో కావాలి మనకు.
మా-నేను వ్యవసాయం చెయ్యాలంటే కౌలుకి భూమి దొరుకుతుందా?ఎవరేనా ఇస్తారా?
గో-ప్రస్తుతం నేనిప్పిస్తాను.రామా పురంలో దాసు తాత అనే రైతు వున్నాడు.అతనికి చాలా పొలం వుంది.మీబోటి కొత్త రైతుల్ని పిలిపించి పొలం కౌలుకి ఇస్తాడు.వ్యవసాయం స్వయం గా దగ్గర వుండి నేర్పుతున్నాడు.
మా- తప్పక వెడతాను.
గో-పోతన గారి మీద పద్యాలు వ్రాసి ఇచ్చి వెళ్ళండి.మీకూ కొంత ఉత్సాహం వస్తుంది.అన్నట్లు మీరు తరవాత ప్రభుత్వానికి అర్జీ పెట్టుకొంటే భూమి వారే ఇస్తారు.ప్రస్తుతం వ్యవసాయానికి ఋణం ఇస్తారు.
మా-గోపాలం గారూ!మీరు నాకు అలాటి సహాయం చెయ్యాలి.మీ ఎదుట ప్రమాణం చేస్తున్నాను.నేను తప్పకుండా రైతునవుతానని.
గో-మీరు వెళ్ళిన తరువాత మరికొందర్ని కూదాపిలిపించి తీసుకు వెళ్ళండి.
మా-తప్పకుండా!పోతన మీది పద్యాలు కావాలన్నారు కదూ!ఒక్కటి ఆశువుగా చెప్తాను.తక్కినవి తర్వాత వ్రాసి పంపుతాను.
మా-పంట పోలమ్ములోఎడద
పండిన,నిండిన,భక్తీ భావముల్
మింటిని తాకగా,హలము
మేదిని దూయుచు,పోయు కొండ్రల న్
జంటగా కిన్నె రాంగనలు
స్వాగత గీతము లాల పింపగా
పంట వలన్తి చిర్నగవు
పండెను,పోతన గుండె నిండగాన్
గో- చాలా బాగుంది.మీగుండే కూడా ఆ ధాన్య లక్ష్మి చిర్నగవుతో నిండాలి.మీరు తప్పక వెళ్లి దాసు తాతను కలుసుకోండి.
మా-అలానే!నాలుగెకరాలడుగుతాను.నడుమనో మంచె వేసుకొంటాను.హలాన్నీ,కాలాన్నీ నడిపిస్తాను.ఆహార సమస్య తీర్చుకొంటాను.
గో-మంచిది. నేను రేపు కనిపిస్తాను.
*************************[ఇంకావుంది]
. నాగలి-నక్షత్రాలు.
రచన -రావూరు
దాసు-ఈ కొబ్బరి నీళ్ళు తాగండి మాధవరావుగారూ!ఆ గట్టు మీద చెట్లు ఆరూ గంగా ఫలాలే!ఆ మూడు మామిడి చెట్లు రసాలు.చివురాకు నమిలితేనే చెడ్డతీపి . .......ఇంకో బోళ్ళం కొట్టమన్నారా
మా-చాలు దాసు తాతా!ఏంటో తియ్యగా వుందీ నారికేళ తీర్ధం.మీ ఆతిధ్యానికి ఏంటో సంతోషం .
దా-మా ఆతిధ్య మేమిటి?ఇదంతా భూదేవి ఆతిధ్యం.ఆతల్లి కడుపు చలవ. తన సంతానాన్ని సంతోషం గా పెంచాలని ఆ తల్లి ఎన్ని తంటాలు పడుతుందో చెప్పలేం .మొక్క నువ్వు పాటు తక్కిన పోషణ అంటా నేను చూసుకొంతానీక్కావలసిన ఫల సాయమిస్తా ను అంటుందా తల్లి .మొక్కేయ్యడం చేతకాక,మొక్కడం చేతకాక బీద వాళ్ళం అయిపోతే ఆ తల్లెం చేస్తుంది."అడగందే అమ్మయినా పెట్టదనే"శాస్త్రం,అసలు భూదేవి నుంచే వచ్చిందంటారు. మీరు కవులన్నారు,నేనేదో చెప్పేస్తున్నా మార్చే దేమన్నా వుంటే మార్చండి.
మా-ఎంత మాట దాసుతాతా! నువ్వు మాట్లాడే ప్రతి మాటలో కవిత్వం వుంది. అద్భుత మైన కవిత్వం.గ్రామాలింత సుందరం గా ఉంటాయనీ ,ఇక్కడ ఇంట ఆతిధ్యం ఉంటుందనీ తెలియదు.
దా-నిజమే మాధవరావుగారూ!మంచి గ్రామం వంచిన పళ్ళ కొమ్మ లాటిది.చాలా మందికి గ్రామాలంటే అభిమానం పోయింది.అందువల్ల ఇలా మ్రోడులయిపోతున్నాయి.మీబోతివారు చేరితే మళ్ళీ చిగురిస్తుంది.
"చిగిర్చిన చెట్టుమీద వగలమారి కోయిలా!వచ్చే పోయే వారిమీద విసరకే నీపాట రాయిలా"అంటారు ఇక్కది పెద్దలు.అంటే ఏమిటో తెలుసా?మీకు తెలియ కుండా ఉంటుందా?కవులన్నారుకదా!
మా-ఆ మాట నిజమే కానీ ......అసలు నువ్వు చెప్పే అర్ధమేమిటో తెలుసుకోవాలని వుందితాటా!
దా- మా అర్ధం చెప్పమన్నారా?చెట్టు చిగిరిస్తే వగలమారి కోయిల పాటలువిసురుతుంది. ఆపాట వూళ్ళో కాపుర ముండే వాళ్లకి ఉషారుగానే వుంటుంది.అందుకని దాన్ని రెట్టించి పాత కచ్చేరీ పెట్టిస్తారు.పోరుగూరునుంచి దారిన పోయే వాళ్లకి చెడ్డ చిక్కుగా వుంటుంది.తెలిసిందా బాబూ!ఇంతకీ నే చెప్ప
వచ్చిందేమిటంటే వూరు బాగుపడితే చాలదు. వూళ్ళో వుండాలి.దానిలో వున్నా సంతోషం అంటా పంచుకోవాలి. చాలా మంది పొలాలు కొంటారు ......మేం బస్తీల్లో వుంటాం అంటారు......అలాటి వాళ్ళు రైతు లనిపించుకోరు బాబూ!.....రాజులనిపించుకొంటారు తెలిసిందా?
మా-తెలిసింది తాతా! రాజుకీ రైతుకీ చాలా తేడావుంది......రైతు అనుభవించే సుఖం రాజెం అనుభవిస్తాడు?
డా-అంతేమరి....ఈ నాలుగెకరాలు మీకిస్తాను,,,ఈ చెట్లన్నీ మీవే.....గట్టుమీద పాదులెట్టు కొంటారో ,పశువులకు పసరికే పెంచు కొంటారో....అంతా మీ ఇష్టం ,మీకేప్పుడే అవుసరం వచ్చినా నన్ను పిలవండి. ..ఒక ఏడాది గడిస్తే మీరే నాకు నేర్పుతారు వ్యవసాయం ......మాట చాలా?కాగితం కావాలా?
మా-తాతా!కాగితమా!అంట మాట అనకు,నీ మాట కోటి విలువ .కొద్దిరోజుల్లో వచ్చి కాపురం పెడతాను.
తాత- ముందు ఊళ్ళోకి రండి.ఒక నెల దాకా మిమ్మల్ని ఇంట్లో వుండనియ్యము.[తాత నవ్వుతాడు]
మా- ఎందుకని?
దా-ఎవరైనా కొత్తగా ఊళ్ళోకి వస్తే తలోరోజు భోజనానికి పిలవందే వదల్రిక్కడ.అది ఆచారం .ఆనెలా మీ ఇల్లు విడిదే !
మా-అన్నిరోజులు ఆతిధ్యమా?నింపాలి'అని.
మా-అలాగాతాతా బాగుంది నువ్వు చెప్పిన మాట. తాతా!ఇలాటి ఆచారాలన్నీ నువ్వు చెపుతూ వుండాలి.నువ్వే నా గురువు.
దా- [పకపక నవ్వి]ఒక కవిగారికి గురువు నయ్యా నాన్న మాట!ఓ!ఎన్నో ఆచారాలు చెపుతా.ఎన్నెన్నో చెపుతా.సామెతలు చెప్తా,సరసాలు చెప్తా,తిన్నగావిని, తీరుగా ఆలోచస్తా నంటే.
మా-అలాగే తాతా !
దా-రాబడి తిరిగొ ద్దం గట్టు వెంట.ఆ! పాల పిట్ట ఎగిరింది మన తల మీదుగా మంచి ముహూర్తం.
మా- పాల పిట్ట ఎగిరితే మంచిదా తాతా!
దా-ఇంకా అడుగుతారేమిటి?ఏంటో మంచిది..పంట కోసం బయలుదేరే వాళ్ళ పైన పాల పిట్ట ఎఅగారాలి.ప్రేమకోసం బయలు దేరి వెళ్ళే వాళ్ళ పై రామ చిలుక ఎగరాలి.సిరి కోసం బయలు దేరే వాళ్ళ ముందుగా నక్క పరుగెత్తాలి....చాలా వున్నాయి రండి.ప్రదక్షిణం చేద్దాం..
*****************************
[గుళ్ళో గంటలు మ్రోగుతూ వుంటాయి.లోపల మంత్రాలు వినిపిస్తూ వుంటాయి.]
దా-రండి,ఇది మా వెంకటేశ్వర స్వామీ గుడి.ప్రదక్షిణం చెయ్యండి.
మా-అలాగే శాంతా...శీనూ రండి.
ఒక రైతు -మంచి అకవిత....వ్యవసాయం మీద మనసు తిరిగిందిట.మన వూరు వచ్చేసాడు.
మరో రైతు-దాసు తాత ఉన్నాడుగా! ఎంతమంది నైనా రప్పిస్తాడు.
ఇంకోరైతు-మన వూరు గొప్పదైపోవాలి.
మా-రండి లోపలోకి వెడదాం.[గంటల చప్పుడు]
శాంత-ప్రభూ!ఏడుకొండల వాడా!నీదే భారం.
మా- మాకాధారం నీవే ప్రభూ!
[గంటల మ్రోతలు]
దా-ఈ ఇల్లు మీకోసం ఏర్పాటు చేసాం.వసతులన్నీ వున్నాయి.ఇవ్వాళ మీరందరూ మా ఇంటికి రావాలి.
మరొకరు-రేపు మా ఇంటికి
మరొకరు -ఆ మర్నాడు మా ఇంటికి.
దా-ఆ మర్నాటికి ఎవరూ పిలవక్కర్లా...గుళ్ళో సంతర్పణ ......ఆ రోజుకు అక్కడే మాధవయ్యగారూ!
షా-తాతా! నువ్వు గుడికి ధర్మ కర్తవా?
దా-ఆ గుడికి అంటే రాళ్ళకు....మనందరికీ ధర్మ కర్త అక్కడున్నాడు.నరుడు,అందులో నావంటి వాడెం ధర్మ కర్త తల్లీ!
మా-ఈ తాత మనబోటి వాళ్లకు జీవన దాత.రేపటినుంచీ హలం పట్టి పొలం దున్నటా.పిల్లల కంచాలలో కి మల్లెపువ్వుల లాటి బియ్యం పండిస్తా.నాగలి-నక్షత్రాలు.నాగలి చాలులో నే నక్షత్రాలు మొలిపిస్తా
దా-ఎన్నిరోజులు...ఇంటికో రోజు !మరి దీంట్లో ఒక తమాషా లేదూ మీతో వూరందరికీ పరిచయం కావాలికదా!అందరూ వచ్చి మీ ఇంటిమీద పడకుండా వుంటారు.....ఎవరింటికి వెళ్ళినపుడు వారితో పరిచయం చేసుకోవచ్చు.కలుపు మొక్కలుంటే ఏరేసుకో వచ్చు ....ఇది ఈనాటి ఆచారం కాదు...మన దేశం లో ఆచారాలు పుట్టి ఊళ్ళు తరవాత పుట్టాయి.ఈ సంగతి తెలియక చాలా మంది ఆచారాల్ని ఎక్కిరించి ఎండు పుల్ల లాగా త్రుంచి అవతల పారేస్తున్నారు.
మా- మంచి మాట చెప్పావుతాతా.మీ ఆచారాలన్నిటినీ శిరసా వహిస్తాను.జీవితాన్ని మీ పద్ధతి లోనే మలుచుకొంటాను.
దా-మంచిది బాబూ!మీరు కవులన్నారు గనుక గ్రామంలో వాళ్లకి మన ఆచారాల మీద,పైరుల మీదా,పంటల మీదా,మంచిమంచి పాటలు వ్రాసి ఇవ్వండి.అందరి చేతా పాదిద్దాం.వూళ్ళో,గుళ్ళో,చేను గట్టు మీదా,చెరువు దిబ్బమేదాఎక్కద పడితే అక్కడ మనకు పాటలు వినిపించాలి.
మా--అలాగే తాతా!పోతన్నగార్ని తలుచుకొని చేత నైనంత కవిత్వం వ్రాస్తాను
దా-[నవ్వి]ఈ కాలానికి మీరే పోతన్నగారు.మరి వెడదాం ఊళ్ళోకి ....నాలుగెకరాల చుట్టూ ఒకసారి తిరిగి వెడదాం ...రైతు రోజూ అలా పంట పొలానికి ప్రదక్షిణ చేయాలి....అప్పుడు భూమాత అనుకొంటుంది"నన్ను నమ్ముకొన్న నరుణ్ణి సంతోష పెట్టాలి,వడ్ల గంపలతో అతని కొంప
నింపాలి అనుకొంటుంది.
మా-అలాగా తాతా !నువ్వు చెప్పిన మాట.ఇలాటి ఆచారాలన్నీ నువ్వు చెపుతూ వుండాలి.నువ్వే నా గురువు.
దా-అలాగే![పకపక నవ్వి} ఒక కవి గారికి గురువు నయ్యానన్న మాట!ఓ! ఎన్నో ఆచారాలు చెపుతా ,ఎన్నెన్నో చెపుతా..సామెతలు చెపుతా,సరసాలు చెపుతా,తిన్నగా విని తీరుగా ఆలోచిస్తానంటే!
మా-అలాగే తాతా !
ధా - రండి ప్రదక్షిణ గా పొలం గట్టు వెంట తిరిగి వద్దాము.పాల పిట్ట ఎగిరింది మన తలమీంచి మంచి ముహూర్తం .
మా- పాల పిట్ట ఎగిరితే మంచిదా తాతా?
దా -ఇంకా అడుగుతారేమిటి? ఏంటో మంచిది.పంట కోసం బయలు దేరే వాళ్ళ పై పాల పిట్ట ఎగరాలి.ప్రేమ కోసం బయలు దేరే వాళ్ళ పై రామ చిలుక ఎగరాలి,సిరి కోసం బయలు దేరే వాళ ముందుగా నక్క పరుగె త్తాలి. చాలా వున్నాయి,రండి ప్రదక్షిణ చేద్దాం.*******************************
{గుళ్ళో గంటలు మ్రోగుతూ వుంటాయి. మంత్రాలు వినిపిస్తూ వుంటాయి.}
దా -రండి. ఇది మా వెంకటేశ్వర స్వామీ గుడి.ప్రదక్షిణ చెయ్యండి.
మా-అలాగే!శాంతా,శీనూ రండి.
ఒక రైతు- మంచి కవి ట .వ్యవసాయంమీద మనసు తిరి గిందట. మన వూరు వచ్చీసాడు.
మరో రైతు-దాసు తాత ఉన్నాడుగా!ఎంత మంది నైనా రప్పిస్తాడు.
ఇంకో రైతు- మన వూరు గొప్పది పోవాలి.
మా-రండి లోపలి కి వెడదాము.{గంట చప్పుడు.}
శాంత- ప్రభూ!ఏడుకొండల వాడా!నీదే భారం.
మా-మాకాధారం నీవే ప్రభూ!
{గంటల మోతలు}******************
దా -ఈ ఇల్లు మీకోసం ఏర్పాటు చేసాము.వస్తూ లన్నీ వున్నాయి.ఇవాళ మీరందరూ మాఇంటికి భోజనానికి రండి.
మరొకరు- రేపు !మా ఇంటికి.
మరొకరు-ఆ మరునాడు మా ఇంటికి .
దా -ఆ మర్నాడు ఎవరూ పిలవక్కర్లా !గుళ్ళో సంతర్పణ వుంది.ఆరోజుకు మాధవయ్యగారూ!
శాంత-టాటా!నువ్వు గుడికి ధర్మ కత్రవా?
దా -ఆ గుడికి అంటే రాళ్ళకి.మనందరికీ ధర్మ కర్త ఆ పరమాత్ముడే!నరుడు!అందులో నా వంటి వాడేమి ధర్మ కర్త
తల్లీ!
మా- ఈ తాత మనబోటి వాళ్లకు జీవన దాత.రేపటి నుంచీ హలం పట్టి పొలం దున్నుతా ! పిల్లల కంచాలలో మల్లె పువ్వుల లాంటి బియ్యం పండిస్తా! నాగలి-నక్షత్రాలు.నాగలి చాలులో నక్షత్రాలు మొలి పిస్తా!
************************************************************
Monday, June 18, 2012
chakrapaani
చక్రపాణి
మానాన్నగారి సినీ జీవితంలో " చక్రపాణి " రచన ఒక మధుర ఘట్టం . ఆసాన్తం హాస్య భరితమైన చక్రపాణి సినిమాలో రసగుళికల వంటి పాటలు నాలుగు వ్రాసారు. అవి ఇక్కడ పొందు పరుస్తున్నాను.
ఓ!మాల తీ లతా ! ఏల వసివాడి తివి
ఓ!నవ మల్లికా!ఏల తలవాల్చి నిల చితివి !
నాపై జాలియా!
నన్ను జూచి ఇంత జాలి ఏలనమ్మ మాలతీ!
తోడు లేని దీన వోలె తలను వాల్తు వేలనే!
ఏకాకి నందువా?నా గాధ విన్డువా!
దయ గందువా? నాపైనా?
మంచుసోన జాలువార వంత నొందె దేలనే!
పూవులన్నీ నేలరాల తూలిపోయే దేలనే!
ఎడారి గాననా?వేసారి పోదునా?దరి చేరనా?
ఇక నైనా!
తోడులేని ఆడజన్మ గాలి మేడ యౌనా!
నీడ లేని తీవ వోలె వాడి పోవు టేనా!
*********************
మెల్ల మెల్లగా చల్ల చల్లగా నిడురారావే హాయిగా!
మెల్ల మెల్లగా చల్ల చల్లగా రావే నిదురా హాయిగా
వెన్నెల డోలికలా పున్నమి జాబిలీ పాపవై
కన్నుల నూగవె చల్లగా!
పిల్లతెమ్మేరలా ఊదిన పిల్లన గ్రోవి వై
జోల పాడవే తీయగా!
కలువ కన్నియలా వలచిన తుమ్మెద రెడువై
కన్నుల వ్రాలవె మెల్లగా!
*************************!
ఓ ప్రియురాలా!ఒజవరాలా!
పలుక వేలనే నాతొ!
వెన్నెల సెలఏరున విరబూసిన
కలువవు నీవేనే జవరాలా!
నా మదిలో దోలలూగా రావే!ఒప్రియురాలా!
మిన్నుల పువు దోటల విహరించే
కిన్నెరనీవేనే జవరాలా !
నా మదిలో వీణ మీట రావే!ఒజవరాలా
పొన్నాల నీడలలో నడయాడే
నేమలివి నీవేనే జవరాలా!
నామదిలో నాట్య మాడ రావే! ఓ!జవరాలా!
*********************************
ఉయ్యాలా జంపాల లూగ రావయ్యా!
తులలేని భోగాల తూగీ!
తాతయ్య సిరులేల్ల వేగ రప్పింప
జాబులో పుట్టిన బాబు నీవయ్యా!
మా మనోరమక్కాయి మదిలోన మెరసి
ఎదురింటి ఇల్లాలి ఒడిలోన వెలసి
ఎత్తుకొని ముత్తాత ఎంతెంతో మురిసి
నావారసుడా వంచు నవ్వురా కలసి
నా మదిలో కోర్కెలను మన్నింప దయతో
అవతరించినావయ్య! అందాల రాశి!
చిన్ని నా తండ్రికి శ్రీ రామ రక్షా!
తప్పక ఇచ్చురా తాతయ్య లక్ష!
**********************
మానాన్నగారి సినీ జీవితంలో " చక్రపాణి " రచన ఒక మధుర ఘట్టం . ఆసాన్తం హాస్య భరితమైన చక్రపాణి సినిమాలో రసగుళికల వంటి పాటలు నాలుగు వ్రాసారు. అవి ఇక్కడ పొందు పరుస్తున్నాను.
ఓ!మాల తీ లతా ! ఏల వసివాడి తివి
ఓ!నవ మల్లికా!ఏల తలవాల్చి నిల చితివి !
నాపై జాలియా!
నన్ను జూచి ఇంత జాలి ఏలనమ్మ మాలతీ!
తోడు లేని దీన వోలె తలను వాల్తు వేలనే!
ఏకాకి నందువా?నా గాధ విన్డువా!
దయ గందువా? నాపైనా?
మంచుసోన జాలువార వంత నొందె దేలనే!
పూవులన్నీ నేలరాల తూలిపోయే దేలనే!
ఎడారి గాననా?వేసారి పోదునా?దరి చేరనా?
ఇక నైనా!
తోడులేని ఆడజన్మ గాలి మేడ యౌనా!
నీడ లేని తీవ వోలె వాడి పోవు టేనా!
*********************
మెల్ల మెల్లగా చల్ల చల్లగా నిడురారావే హాయిగా!
మెల్ల మెల్లగా చల్ల చల్లగా రావే నిదురా హాయిగా
వెన్నెల డోలికలా పున్నమి జాబిలీ పాపవై
కన్నుల నూగవె చల్లగా!
పిల్లతెమ్మేరలా ఊదిన పిల్లన గ్రోవి వై
జోల పాడవే తీయగా!
కలువ కన్నియలా వలచిన తుమ్మెద రెడువై
కన్నుల వ్రాలవె మెల్లగా!
*************************!
ఓ ప్రియురాలా!ఒజవరాలా!
పలుక వేలనే నాతొ!
వెన్నెల సెలఏరున విరబూసిన
కలువవు నీవేనే జవరాలా!
నా మదిలో దోలలూగా రావే!ఒప్రియురాలా!
మిన్నుల పువు దోటల విహరించే
కిన్నెరనీవేనే జవరాలా !
నా మదిలో వీణ మీట రావే!ఒజవరాలా
పొన్నాల నీడలలో నడయాడే
నేమలివి నీవేనే జవరాలా!
నామదిలో నాట్య మాడ రావే! ఓ!జవరాలా!
*********************************
ఉయ్యాలా జంపాల లూగ రావయ్యా!
తులలేని భోగాల తూగీ!
తాతయ్య సిరులేల్ల వేగ రప్పింప
జాబులో పుట్టిన బాబు నీవయ్యా!
మా మనోరమక్కాయి మదిలోన మెరసి
ఎదురింటి ఇల్లాలి ఒడిలోన వెలసి
ఎత్తుకొని ముత్తాత ఎంతెంతో మురిసి
నావారసుడా వంచు నవ్వురా కలసి
నా మదిలో కోర్కెలను మన్నింప దయతో
అవతరించినావయ్య! అందాల రాశి!
చిన్ని నా తండ్రికి శ్రీ రామ రక్షా!
తప్పక ఇచ్చురా తాతయ్య లక్ష!
**********************
Sunday, June 17, 2012
venkateswaraa!
అసలది క్షీర సాగరము అమ్బరమంతయు లేత వెన్నె లల్
అసదృశ భక్తీ దేవగణ మంజలి పట్టుచు నీదు మూర్తిపై
విసరేడు వెల్ల నాకధుని విచ్చిన కల్వలు ,ఇంత వెల్ల లో
మసలేడు నీల వర్ణు డవు మా మది నిల్వ వేంక టే శ్వరా!
Friday, June 8, 2012
Tuesday, June 5, 2012
సన్నజాజులు
సన్నజాజులు తెచ్చి నిన్నుపూజింతు
సకలభాగ్యములీయ నిన్నుయాచింతు
మందారములు తెచ్చి నిన్ను పూజింతు
మా ఎడద నిలువంగ నిన్ను యాచింతు ||సన్న||
కేదారములు తెచ్చి నిన్ను పూజింతు
ఆధారముగా నిల్వ నిన్ను యాచింతు ||సన్న||
ఎర్ర గన్నేరు పూల నిన్ను పూజింతు
ఏ వే ళ నా యండ నిన్ను యాచింతు ||సన్న||
తులసీ దళ మ్ముల నిన్ను పూజింతు
తులలేని సౌఖ్యాలు నిన్ను యాచింతు ||సన్న||
మల్లెపూవులు తెచ్చి నిన్ను పూజింతు
మా ఇంట నిలువంగ నిన్నుయాచింతు ||సన్న||
Monday, June 4, 2012
విన్నపాలు వినవలె
మనవి
కీర్తిశేషులు "కళాప్రపూర్ణ శ్రీ రావూరు వెంకట సత్యనారాయణరావుగారు" ప్రసిద్ధ రచయిత. నేను వారి ఏకైక పుత్రికని. నా పేరు తటవర్తి జ్ఞానప్రసూన. నేను మా నాన్నగారి రచనలు ఇందులో పొందు పరచాలనే ఆశయంతో ఈ బ్లాగ్ ప్రారంభిస్తున్నాను. రచనలు చేయడం ఒక ఎత్తు, ఆ రచనలని ప్రచురణ చేసు కోగలగటం ఇంకొక ఎత్తు, వాటి ద్వారా ధనం సంపాదించ గలగటం మరొక ఎత్తు. అన్నిటికంటే ముఖ్య మైనది, అవసర మైనది ఇంకొకటున్నది..అది రచనలు సమీకరించి భద్ర పరుచుకో గలగటం. అప్పుడే ఎప్పటికైనా రచనలని ప్రచురించుకొనే భాగ్యం కలుగుతుంది. మా నాన్న గారి రచనలు ఎవరిదగ్గరైనా వుంటే మాకు పంపిస్తే ఇందులో పెట్టుకొంటాను. ఈవిషయం లో సాహితీ ప్రియులందరూ సహకరించ వలసిందిగా ప్రార్ధిస్తున్నాను.
భవదీయురాలు,తటవర్తి జ్ఞానప్రసూన
Subscribe to:
Posts (Atom)