Friday, June 8, 2012

అమ్మకోముద్దిచ్చి

  

 అమ్మకోముద్దిచ్చి


చెంచు కర్రొక చేత  చిన్ని మురళొ క చేత
నవ్వుతూ వచ్చేటి     నా   చిన్ని కృష్ణా !
పాడ వోయీ    పాట   వేడు కొంటున్నా
నీ మురళి గానమే నా బ్రతుకు తెరువోయి   ||చెంచు||

అమ్మ నీకోసమై  అటు చూసి ఇటు చూసి
కన్నా !కన్నా!అంటూ కలవరిస్తోందోయి
అమ్మకో ముద్దిచ్చి ఆడుకోవోయీ             ||చెంచు||

Tuesday, June 5, 2012

సన్నజాజులు

                                


సన్నజాజులు తెచ్చి నిన్నుపూజింతు
సకలభాగ్యములీయ  నిన్నుయాచింతు


మందారములు తెచ్చి నిన్ను పూజింతు
మా  ఎడద  నిలువంగ  నిన్ను యాచింతు  ||సన్న||


కేదారములు తెచ్చి నిన్ను పూజింతు
ఆధారముగా నిల్వ నిన్ను యాచింతు   ||సన్న||


ఎర్ర గన్నేరు పూల నిన్ను పూజింతు
ఏ వే ళ నా యండ   నిన్ను యాచింతు   ||సన్న||


తులసీ దళ మ్ముల  నిన్ను పూజింతు
తులలేని   సౌఖ్యాలు నిన్ను యాచింతు  ||సన్న||


మల్లెపూవులు తెచ్చి నిన్ను పూజింతు
మా ఇంట  నిలువంగ నిన్నుయాచింతు   ||సన్న||




Monday, June 4, 2012

విన్నపాలు వినవలె

                                    మనవి

కీర్తిశేషులు "కళాప్రపూర్ణ  శ్రీ రావూరు వెంకట  సత్యనారాయణరావుగారు" ప్రసిద్ధ రచయిత.   నేను వారి ఏకైక పుత్రికని.    నా పేరు తటవర్తి  జ్ఞానప్రసూన.    నేను మా నాన్నగారి  రచనలు  ఇందులో పొందు పరచాలనే  ఆశయంతో ఈ  బ్లాగ్    ప్రారంభిస్తున్నాను.   రచనలు చేయడం ఒక ఎత్తు, ఆ రచనలని  ప్రచురణ  చేసు కోగలగటం  ఇంకొక  ఎత్తు,  వాటి ద్వారా ధనం సంపాదించ గలగటం మరొక ఎత్తు.   అన్నిటికంటే  ముఖ్య మైనది, అవసర మైనది  ఇంకొకటున్నది..అది     రచనలు సమీకరించి భద్ర పరుచుకో గలగటం.   అప్పుడే ఎప్పటికైనా రచనలని  ప్రచురించుకొనే భాగ్యం   కలుగుతుంది.  మా నాన్న గారి రచనలు ఎవరిదగ్గరైనా వుంటే మాకు పంపిస్తే  ఇందులో పెట్టుకొంటాను. ఈవిషయం    లో సాహితీ ప్రియులందరూ సహకరించ వలసిందిగా  ప్రార్ధిస్తున్నాను.

భవదీయురాలు,
తటవర్తి జ్ఞానప్రసూన